![YSRCP MLA Raghurami Reddy and Mayer Meet Kadapa SP Over Votes Remove Issue - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/7/YSRCP-MLA-Raghurami-Reddy.jpg.webp?itok=kWW9zOKr)
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లు ఉండటం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే రఘురామ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మరో ఎమ్మెల్యే అంజాద్ భాషా, కడప మేయర్ సురేష్ బాబుతో కలిసి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను కలిశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో కావాలనే తమ కార్యకర్తల పేర్లను చేర్చారని ఎస్పీకి తెలిపారు. నేర చరిత్ర చూశాకే బైండోవర్ కేసులు పెట్టాలని విన్నవించారు. ఓట్ల తొలగింపు దొంగలను పట్టుకుని శిక్షించాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు.
అయితే ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను కేవలం విచారణ మాత్రమే చేస్తున్నామని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment