కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్ : కర్నూలు ఆర్టీవో కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి రూ.25 వేలు తీసుకున్నాడని, ఇప్పుడు ఉద్యోగం చూపించకపోగా డబ్బులు కూడా ఇవ్వడం లేదని నగరంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన షెహన్‌షా అనే వ్యక్తి ఎస్పీ రఘురామ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమాని(94407 95567)కి జిల్లా నుంచి 46 ఫోన్ కాల్స్ వచ్చాయి. కోడుమూరు మండలం అనుగొండ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేమటూరు నుంచి ఇద ్దరు వ్యక్తులు వచ్చి నాటుసారా ప్యాకెట్లు, చీప్ లిక్కర్ బాటిళ్లను అమ్ముతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నాటుసారా వ్యాపారాన్ని నిరోధించి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ గ్రామంలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఇలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను జిల్లా ఎస్పీ నమోదు చేసుకున్నారు.
ఎస్‌ఐ కుటుంబానికి చెక్కు పంపిణీ
నీటిలో కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నందివర్గం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సాయిప్రసాద్ మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని జిల్లా ఎస్పీ ఆదుకున్నారు. ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి సలాం, నందివర్గం ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, మృతిచెందిన ఎస్‌ఐ తల్లి రమణమ్మ, చెల్లెలు అనితలు పాల్గొన్నారు.
డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి
Published Sat, Nov 9 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement