sai prasad
-
Badminton: కొత్త కెరటం... తీగల సాయిప్రసాద్
సాక్షి, హైదరాబాద్: అసోంలోని గువహటిలో గత ఏడాది ఆగస్టులో బ్యాడ్మింటన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఈ) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన కుర్రాళ్లను గుర్తించి వారిని భవిష్యత్తు కోసం తీర్చిదిద్దడం కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రం ఇది. ముందుగా అండర్–17 స్థాయిలో సెలక్షన్స్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఏకంగా 858 మంది యువ షట్లర్లుపాల్గొన్నారు. వీరిలో టాప్–4కి మాత్రమే అక్కడ చోటు లభించింది. ఈ సెంటర్లో మొదటి విద్యార్థిగా అడుగు పెట్టిన కుర్రాడే హైదరాబాద్‌కు చెందిన తీగల సాయిప్రసాద్. అప్పటికే తన ప్రతిభ తో ఆకట్టుకున్న సాయిప్రసాద్ ఎన్సీఈలో శిక్షణతో మరింత పదునెక్కాడు. తన ఆటలోని సత్తాను చూపిస్తూ ఇటీవల కీలక విజయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత నెలలో ఇరాన్లో జరిగిన ఫజర్ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయి టైటిల్ సాధించి షటిల్ వేదికపై కొత్త కెరటంలా వెలుగులోకి వచ్చాడు. తండ్రి ప్రోత్సాహంతో... సాయి తండ్రి సూర్యారావు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆటగాడిగా కెరీర్‌ను ముగించిన తర్వాత ఆయన కోచ్‌గా మారారు. సుదీర్ఘ కాలం పాటు న్యూజిలాండ్‌లో వేర్వేరు క్లబ్‌లలో కోచింగ్ ఇచ్చిన సూర్య ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చారు. చిన్నప్పటినుంచి తండ్రి ఆటను చూస్తూ వచ్చిన సాయి సహజంగానే షటిల్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. దాంతో సాయిని పూర్తిస్థాయిలో ఆటగాడిగా తీర్చిదిద్దాలని భావించిన సూర్య స్వయంగా తానే ఓనమాలు నేర్పించారు. ఆ తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం ప్రతిష్టాత్మక పుల్లెల గోపీచంద్ అకాడమీలో సాయి చేరాడు. అదే అకాడమీలో తండ్రి సూర్య కూడా ఒక కోచ్‌గా ఉండటం సాయికి మరింత సానుకూలాంశంగా మారింది. అటు గోపీచంద్ మార్గనిర్దేశనం, ఇటు తండ్రి శిక్షణ వెరిసి సాయి మంచి ఫలితాలు సాధించాడు. అండర్–13 స్థాయిలో జాతీయస్థాయి నంబర్‌వన్ కావడంతోపాటు అండర్–15, అండర్–17లలో సాయిప్రసాద్ టాప్–5లో కొనసాగాడు. జాతీయ జూనియర్ ర్యాంకింగ్ టోర్నీలతో పాటు అండర్–13 స్థాయిలో సింగపూర్, థాయ్‌లాండ్‌లలో జరిగిన టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. అనంతరం కెరీర్లో ఎదుగుతున్న కీలక దశలో అతను గువహటి ఎన్సీఈలో ప్రవేశంతో తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. కెరీర్లో కీలక విజయం... అగ్రశ్రేణి కోచ్‌లు, అత్యుత్తమ సౌకర్యాలతో ఉన్న ఎన్సీఈలో సాయిప్రసాద్ సాధనకు మరింత మంచి అవకాశం దక్కింది. ఈ క్రమంలో అతని పురోగతి వేగంగా సాగింది. గత ఏడాది ఆగస్టులో సాయి జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 1043వ స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది జనవరి తొలి వారంలో మొదటి సారి టాప్–100లోకి అడుగు పెట్టాడు. మంగళవారం ప్రకటించిన తాజా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో అతను 37వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో జనవరిలో అతని కెరీర్లో చెప్పుకోదగ్గ విజయం దక్కింది. ఇరాన్లో జరిగిన జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో సాయిప్రసాద్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్ చేరడానికి ముందు చక్కటి ప్రదర్శనతో అతను వరుసగా మూడు మ్యాచ్‌లలో స్థానిక ఇరాన్ ఆటగాళ్లను ఓడించడం విశేషం. గత వారమే 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సాయి ఇకపై అండర్–19 స్థాయి టోర్నీల్లోనే పాల్గొనబోతున్నాడు. జూనియర్ విభాగంలో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి చేరడంపై సాయి దష్టి పెట్టాడు. ఆపై జూనియర్ వరల్డ్‌లాంటి పెద్ద టోర్నీని గెలవడం అతని ముందున్న ప్రస్తుత లక్ష్యం. సాయి ప్రతిభకు తోడు ఎన్సీఈ శిక్షణ అతని ప్రదర్శన స్థాయిని పెంచింది. ఇదే ఆటను కొనసాగిస్తే మున్ముందు ఈ అబ్బాయి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అద్భుత ఫలితాలు సాధించడం ఖాయం. -
ఉదారంగా ఆదుకోండి
సాక్షి, అమరావతి/పామర్రు/గుడివాడ/కంకిపాడు: మిచాంగ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సాయం అందించే విషయంలో ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ–విపత్తుల నిర్వహణ శాఖ) సాయిప్రసాద్ కేంద్ర బృందానికి విన్నవించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో బుధవారం తాడేపల్లిలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ తదితరులతో కలిసి సాయిప్రసాద్ సమావేశమయ్యారు. తుపాను తీవ్రతతో కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర బృందానికి వివరించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయని తెలిపారు. వీలైనంత మేర ఆదుకోవడానికి సహకరిస్తాం: కేంద్ర బృందం కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ.. తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన నాలుగు జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. తుపాను వల్ల కలిగిన నష్టాలను విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ కేంద్ర బృందానికి వివరించారు. శాఖాపరంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.2,641 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.703 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.100 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.86.97 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మొత్తంగా మిచాంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వాటి పునరుద్ధరణకు రూ.3,711 కోట్లు సాయం అందించాలని విన్నవించారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లింది. గురువారం కూడా ఈ బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రైతులకు న్యాయం చేస్తాం.. రాష్ట్రంలో పంట నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం ప్రతినిధి రాజేంద్ర రత్నూ పేర్కొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా పామర్రు, కంకిపాడు, గుడివాడల్లో కేంద్ర బృందం పర్యటించింది. కంకిపాడు రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. గుడివాడ మండలం రామనపూడి, వలిపర్తిపాడు గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించింది. అలాగే పామర్రు మండలం నెమ్మలూరు, కొరిమెర్ల తదితర గ్రామాల పరిధిలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ తదితరులతో కలిసి రాజేంద్ర రత్నూ పరిశీలించారు. నెమ్మలూరులో కౌలు రైతు ఆత్మూరి రామ కోటేశ్వరరావు కేంద్ర బృందంతో మాట్లాడుతూ సాగు చేస్తున్న 40 ఎకరాలలోని వరి పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కాలువలు, మురుగు డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఏటా పంట నష్ట పోవాల్సి వస్తోందని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ వివిధ గ్రామాల రైతులు కేంద్రం బృందానికి అర్జీలను సమర్పించారు. మొత్తం 1,270 ఎకరాల సాగులో 1,040 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. జేసీ అపరాజితాసింగ్ స్థానికంగా జరిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, కైలే అనిల్ కుమార్, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నేడు దెబ్బతిన్న ధాన్యం పరిశీలన తుపాను దాటికి దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర పౌరసరఫరాల శాఖ సాంకేతిక బృందం గురువారం నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పంట కోసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యంతో పాటు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన ధాన్యంలో విరిగిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం నమూనాలను సేకరించనుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సహాయకులను ఎంపిక చేసింది. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ఈ క్రమంలో తేమ శాతంతో సంబంధం లేకుండా తడిచిన ధాన్యాన్ని సైతం సేకరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తుపాను ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. వర్షాలు తగ్గడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తోంది. -
ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యుటేషన్లు
సాక్షి, అమరావతి: మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యుటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. జిరాక్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యుటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటివల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను తహసీల్దార్లు ధృవీకరించాలని చెప్పింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. తహశీల్దార్లు ప్రతి మ్యుటేషన్‌కు తప్పనిసరిగా సేల్ డీడ్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్ లింకు డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఈసీతోపాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించినట్లు తహసీల్దార్ ఆన్లైన్లో ధృవీకరించాలని (సర్టిఫై చేయాలి) ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ నుంచి ఆన్లైన్లో చూసే డాక్యుమెంట్లు తప్ప ఇతర ఏ సందర్భంలోనైనా ఈ విధానం పాటించాల్సిందేనని చెప్పారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లని ధృవీకరించకుండా చేసిన ఎలాంటి మ్యుటేషన్ లేదా ఆర్డర్ ఆమోదయోగ్యం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల తహశీల్దార్లు ఫొటో కాపీల ఆధారంగా మ్యుటేషన్లు చేయడం, అసలైన యజమానులు ఫిర్యాదుతో అవి సరైన పత్రాలు కావని నిర్థారణ అయిన నేపథ్యంలో హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో సీసీఎల్ఏ ఈ ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలోని చివరి వ్యక్తి నుంచి అన్ని స్థాయిల్లో ఈ నిబంధనలు పాటించాలని, దీనికి విరుద్ధంగా ఎవరైనా ఫొటో కాపీలు చూసి మ్యుటేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాక్ట్ 15 ఆఫ్ 2022 ప్రకారం క్రిమినల్ లా కింద ఎవరైనా ఆర్ఓఆర్ చట్టానికి విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వారిని జిల్లా కలెక్టర్లు విచారించే అధికారం ఉందని తెలిపారు. -
ఎవరెస్ట్ ఎక్కించిన తెలుగుపాఠం..
నిర్మల్: ఆయనో చార్టెడ్ అకౌంటెంట్. పక్షంరోజులు పనులన్నీ పక్కనపెట్టి, ఏకంగా ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లారు. తొలిసారే అవకాశం లేదనడంతో వెనక్కి తగ్గేది లేదంటూ.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ వెళ్లారు. ఆయన హిమాలయాలకు వెళ్లడానికి, అంత ఎత్తు ఎక్కడానికి కారణం తొమ్మిదో తరగతిలో ఆయన విన్న తెలుగుపాఠం కారణం. ఎవరా సీఏ, ఏమా తెలుగుపాఠం.. వివరాలివిగో! నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముక్క సాయిప్రసాద్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన కరీంనగర్‌లోని పారామిత హైసూ్కల్లో చదువుకున్నారు. తెలుగుసార్ సన్యాసిరావు తొమ్మిదో తరగతి పాఠంలో భాగంగా ‘అటజని కాంచె భూమిసురుడు..’ అనే పద్యాన్ని చెబుతూ హిమాలయాలను అందంగా వర్ణించారు. అది సాయిప్రసాద్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఎప్పటికైనా హిమాలయాలకు వెళ్లాలని, ఆ అందాలను చూడాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. తరువాత ఉన్నత చదువులు, కెరీర్లో పడిపోయినా.. ఇరవైఏళ్ల కిందట విన్న పాఠం, హిమాలయాలకు వెళ్లాలన్న ఆలోచన ఆయన మదిలో మెదులుతూనే ఉంది. మొదటిసారి కావడంతో.. అయితే.. గతనెల 28న నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లిన ఆయన అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. మొత్తం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,849 మీటర్లు కాగా, బేస్ క్యాంప్ 5,364 మీటర్లు ఉంటుంది. తొలిసారి ఎవరెస్ట్ ఎక్కాలనుకునేవారిని ఈ బేస్ వరకే అనుమతిస్తారు. సాయిప్రసాద్‌ను సైతం బేస్ వరకే అనుమతించారు. ఏడురోజుల పాటు ఎక్కుతూ ఈనెల 6న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. తన కుటుంబం, మిత్రుల సహకారంతో ఇక్కడి వరకూ వచ్చానని సాయిప్రసాద్ చెప్పారు. తనతో పాటు ఆయన మిత్రుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన నార్లాపురం గిరిధర్‌ను కూడా ఒప్పించి వెంట తీసుకెళ్లారు. హిమాలయాలు అద్భుతం.. హిమాలయాల గురించి వింటుంటాం. కనులారా చూస్తేనే వాటి అందం తెలుస్తుంది. నాకు ట్రెక్కింగ్ అనుభవం లేదు. కానీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తాను. అదే నేను ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు చేరడానికి ఉపయోగపడింది. అక్కడికి వెళ్లి హిమాలయాలను చూడటం మర్చిపోలేని ఫీలింగ్. మరోసారి ఎవరెస్ట్ మొత్తం ఎక్కడానికి ప్రయత్నిస్తా. – ముక్క సాయిప్రసాద్, సీఏ, నిర్మల్ -
నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చుక్కల భూములకు విముక్తి
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో భారీ స్థాయిలో చుక్కల భూములకు ప్రభుత్వంవిముక్తి కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 41,041 ఎకరాల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించింది. బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ శనివారం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. చుక్కల భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమోటో వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ సుమోటో వెరిఫికేషన్ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఆ జిల్లాలో 41,041 ఎకరాల చుక్కల భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇ లోనే ఉన్న 13,883 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 14,133 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 751 ఎకరాలను 22ఎ(1)సి లోకి, 62 ఎకరాలను 22ఎ(1) డి లోకి మార్చారు. కేవలం 10 సెంట్లను మాత్రమే 22ఎ(1)ఇ లో కొనసాగిస్తున్నారు. అలాగే, బాపట్ల జిల్లాలో 5,776 ఎకరాల చుక్కల భూములను 22ఎ(1)ఇ నుంచి తొలగించారు. ఇవి కాకుండా సెక్షన్ 22ఎ(1)ఇలోనే ఉన్న 1,080 ఎకరాలను 22ఎ(1)ఎ లోకి, 89 ఎకరాలను 22ఎ(1)బి లోకి, 858 ఎకరాలను 22ఎ(1)సి లోకి మార్చారు. 13,461 ఎకరాలను మాత్రం 22ఎ(1)ఇ లోనే ఉంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయగా, తాజాగా ఈ రెండు జిల్లాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా 15 జిల్లాల్లో ఒకేసారి 2.06 లక్షల ఎకరాలను చుక్కల భూముల నుంచి తొలగించడం ద్వారా లక్ష మంది రైతులకు ప్రభుత్వం మేలు చేకూరుస్తోంది. -
సాయి ప్రసాద్‌ని డిస్మిస్ చేయడం దుర్మార్గం
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిస్మిస్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. లీవ్ దరఖాస్తు చేసినందుకు డిస్మిస్ చేయడం ఎప్పుడూ చూడలేదని, నిమ్మగడ్డ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో అందరికి తెలుసునని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉద్యోగుల మనోభావాలను ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరపాలి...ఎప్పుడు జరుపుతున్నారు?. ఆయనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే ఎన్నికలు అవసరం లేదా. ( నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం ) ఇంతటి ఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. మేము కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడలేదు. 9 నెలల నుంచి ఉద్యోగులు కరోనాపై పోరాటం చేస్తుంటే ఎందుకిలా చేస్తున్నారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు మొండి పట్టుదల పడుతున్నారు ఈ రోజు హై కోర్ట్‌కు వెళ్లాము...ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. ఎస్ఈసీ ఇప్పటికైనా మొండి పట్టుదల వదిలేసి కోవిడ్ వాక్సినేషన్ అయ్యాక ఎన్నికలు పెట్టాల’’న్నారు. -
నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ లీవ్‌లో వెళ్లిన అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ అనారోగ్య సమస్యలతో నెలరోజులపాటు మెడికల్ లీవు పెట్టారు. సాయి ప్రసాద్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్ పెట్టారు. అయితే ముగ్గురు లీవ్ పెట్టినప్పటికి జేడీ సాయి ప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ( టీడీపీతో నిమ్మగడ్డ చెట్టపట్టాల్ ) ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వకూడదన్న ఎస్ఈసీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు విస్మయం చెందాయి. ఉద్యోగులను బెదిరించడం ద్వారా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారంటూ వాపోతున్నాయి. -
నిందితుడిని ఉరితీయాలి
వారిద్దరికీ ఇంటర్మీడియట్ చదివే సమయంలో పరిచయం ఏర్పడింది. తెలిసి తెలియని వయస్సులో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ముసుగులో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తోటి స్నేహితురాలిని నమ్మించి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన కొత్తూరు పంచాయతీ కుమ్మరిగూడలో శుక్రవారం చోటు చేసుకుంది. రంగారెడ్డి, కొత్తూరు : స్థానికులు, హత్యకు గురైన విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన ఈశ్వర్, పద్మమ్మ దంపతుల కుమార్తె శిరీష(21). దిల్‌సుఖ్‌నగర్‌లోని అనిబిసెంట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ బ్యాంక్ ఉద్యోగం కోసం అక్కడే ఓ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటుంది. కాగా శిరీష ఇంటర్మీడియట్ చదివే సమయంలో తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ కాలనీకి చెందిన సాయిప్రసాద్‌తో స్నేహం ఏర్పడింది. క్రమంగా అతడి ప్రవర్తన హద్దు మీరడంతో శిరీష విషయాన్ని కుటుంబ సభ్యులు తెలపడంతో వారు అతడ్ని మందలించారు. చాలా కాలం పాటు శిరీష జోలికెళ్లని సాయిప్రసాద్ గురువారం తాను దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్‌కు వెళ్లినట్లు తెలుసుకొని అక్కడి నుంచి మాటల్లో పెట్టి తనను శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. అనంతరం శిరీష మొఖం కడుకునేందుకు సబ్బు రాసుకునే సమయంలో పథకం ప్రకారం.. తనను హత్య చేయాలని అనుకున్న సాయిప్రసాద్ కత్తితో గొంతు కోశాడు. రక్తపు మడుగులో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. సాయంత్రం అవుతున్నా కూతురు ఇంటికి రాకపోయే సరికి ఆమెకు తండ్రి ఫోన్ చేయడంతో స్విచ్చాఫ్ వచ్చింది. తీరా రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్‌చేసి శిరీష ప్రగతి రిసార్ట్స్‌లో హత్యకు గురైనట్లు తెలపడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. బహిరంగంగా ఉరితీయాలి... తమ కూతురు చదువుల్లో ఎప్పుడు ఫస్ట్‌గా ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా ఉండేదని శిరీష తల్లి పద్మమ్మ బంధువులతో చెబుతూ కన్నీంటి పర్యంతమయ్యారు. పథకం ప్రకారమే సాయి ప్రసాద్ తమ కూతుర్ని హత్య చేసినట్లు వాపోయారు. మరోమారు ఆడపిల్లలపై ఇలాంటి ఘోరాలకు పాల్పడకుండా ప్రభుత్వం సాయిప్రసాద్‌ను బహిరంగంగా ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. చదువు కోసం ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె శవమై రావడంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం గ్రామానికి చేరుకున్న విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
హత్యపై అనుమానాలెన్నో..
రంగారెడ్డి, చేవెళ్ల: శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో గురువారం జరిగిన శిరీష హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రేమించిన యువకుడు నమ్మించి రిసార్టుకు తీసుకువచ్చి దారుణంగా కత్తితో గొంతుకొసి కడుపులో, ముఖంపై విచక్షణారహితంగా పొడిచి హత్యచేశాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కత్తితో రావడంతో అతనికి ఎవరైనా సహకరించి ఉంటారని మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. అతనితో పాటు ఉన్న వ్యక్తులు, సహకరించిన వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని కోరుతున్నారు. ప్రగతి రిసార్టు లాంటి పేరొందిన దానిలోకి ఎవరైనా రావాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అలాంటిది కేవలం ఇద్దరు పెళ్లికాని యువతీయువకులు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే వారి వివరాలు చెక్ చేయకుండా ఎలా కేటాయించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి తోడు రిసార్టులోకి ఎవరు వెళ్లినా వారిని పూర్తిగా చెక్‌చేసి డిడెక్టర్ల ద్వారా పరిశీలించి పంపిస్తుంటారు. అలాంటిది హత్య చేసేందుకు పథకం వేసుకొని వచ్చిన యువకుడు కత్తిని ఎలా రిసార్టు లోపలికి తీసుకెళ్తే భద్రత ఏమైందని ప్రశ్నిస్తున్నారు. గోప్యంతోనే ఆలస్యమా..? సాయిప్రసాద్‌తో పాటు ఎవరైనా రిసార్టులోకి వచ్చి ఉంటారని హత్య చేసేందుకు సహకరించి తరువాత దీనిని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించి విఫలం కావడంతోనే బయటకు వచ్చేందుకు ఆలస్యం జరిగిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య విషయం సాయంత్రం పోలీసులకు, రిసార్టు సిబ్బందికి తెలిసినప్పుడు మృతురాలి శిరీష వద్ద ఉన్న ఐడీ కార్డులు, సెల్ఫోన్ల ఆధారంగా తల్లిదండ్రులకు ఎందుకు వెంటనే సమాచారం అందించలేదని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు కనిపించలేదని, ఫోన్‌చేస్తే కలవలేదన్నారు. చివరకు రాత్రి 8 గంటలకు ఫోన్ చేస్తే పోలీసులమని మీరు ప్రగతి రిసార్టు వద్దకు రావాలని చెప్పారని అంటున్నారు. హత్య జరిగిన తరువాత ఇంత సమయం ఎందుకు అయిందని పలు అనుమానాలకు తావునిస్తుంది. రిసార్టు పేరు బయట పడకుండా ఉండే జాగత్ర పడ్డారా? లేక హత్య చేసిన యువకుడి వెనక పలుకుబడి ఉన్న నాయకులు ఎవరైనా ఉండి కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ పోలీసులు హత్య చేసిన యువకుడు దొరకడంతో ఆధారాల ప్రకారం తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ హత్యపై వస్తున్న అనుమానాలపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. -
ఈ డాక్టర్ తీరు అసభ్యకరం
ప్రొద్దుటూరు క్రైం : వైద్య పరీక్షల పేరుతో తమ పట్ల డాక్టర్ సాయిప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మౌలానా ఆజాద్ వీధులకు చెందిన మహిళలు ఆరోపించారు. బుధవారం పలువురు మహిళలు మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాతో కలసి ఆస్పత్రి వద్దకు వెళ్లారు. డాక్టర్ తీరును నిరసిస్తూ మహిళలు ఆయన పనిచేస్తున్న వసంతపేట అర్బన్ హెల్త్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ముఖంపై కప్పుకున్న నఖాబ్ (ముసుగు)ను తీయమని చెబుతాడని, స్టెతస్కోప్‌తో పరీక్షించే క్రమంలో అనవసరంగా శరీర భాగాలను తడుముతాడని మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళలతో వారి భర్తలు కూడా వచ్చి ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. డాక్టర్‌ను వెంటనే తొలగించి మహిళా వైద్యురాలిని నియమించాలని వారు డిమాండు చేశారు. కొందరైతే నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లి నిలదీశారు. నాకు అలాంటి అవసరం లేదు నేను చాలా సీనియర్ డాక్టర్‌ను. మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాను. మెడికల్ కాలేజి విద్యార్థులకు నైతిక విలువలను బోధిస్తున్నాను. ఈ వయసులో నాకు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఆస్పత్రికి వస్తున్న మహిళలు ఇంజక్షన్లు వేయాలని, యాంటిబయాటిక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలని అడుగుతుం టారు. ఎక్కువగా ఇంజక్షన్లు, యాంటిబయాటిక్స్ వాడటం మంచిది కాదనే ఉద్దేశంతో వాటిని సిఫార్సు చేయను. ఈ ఉద్దేశంతోనే నాపై నిందలు వేస్తున్నారని డాక్టర్ వివరణ ఇచ్చారు. -
నింగి.. నేల .. నీరు.. ప్రసాద్
స్ఫూర్తి విధి అతనికి ఒక్క కాలే ఇచ్చి, ఎలా జీవిస్తావో చూపమని శాసించింది. ఆత్మస్థైర్యమే ఆలంబనగా విధికే సవాల్ విసిరి విజయపథంలో దూసుకుపోతున్నారు సాయిప్రసాద్. మూడు పదుల సాయి ప్రసాద్ విశ్వనాథన్ తనలాంటి వారికే కాదు సకలాంగులకూ జీ- మ్యాట్‌లో శిక్షణనిస్తూ విదేశీ కంపెనీలలో ఉద్యోగవకాశాల కల్పనకు దారులు వేస్తున్నారు. నేల, నింగి, నీరు, అగ్ని, వాయువు.. పంచభూతాలను అనుభూతిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. సంకల్పం ఉంటే... అదే సమస్తాన్నీ ముంగిట్లోకి తెస్తుందని నిరూపిస్తున్నారు. ఈ హైద్రాబాదీ సాయిప్రసాద్ విజయగాథ... ‘‘నేను పుట్టి పెరిగింది తమిళనాడులోని లాల్గుడి. మా అమ్మ వాసంతి, నాన్న విశ్వనాథన్. వారి అండదండలు ఉండడం వల్లే బాగా చదువుకోగలిగాను. నా చిన్నప్పుడు అవిటితనాన్ని హేళన చేసిన ఘటనలు చాలానే ఎదుర్కొన్నాను. ‘అవిటివాడినని, పక్కన కూర్చోవద్దు అని’ నా క్లాస్‌మేట్స్‌కు వారి తల్లితండ్రులు చెప్పేవారు. కానీ, మా అమ్మ నాలో ఆత్మన్యూనత పెరగకుండా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేది. అందువల్లే అవేవీ నేను పట్టించుకోలేదు. బాధపడనూ లేదు. అంధురాలైనా ఎంతో సాధించిన హెలెన్ కెల్లర్ జీవితగాథ నాలో స్ఫూర్తి నింపింది. ఆ స్ఫూర్తితోనే టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు సాధించా. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సిబిఐటిలో ఇంజినీరింగ్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించా. ఆ తర్వాత టోఫెల్, జిఆర్ఇ వంటి అన్ని పరీక్షల్లోనూ టాప్ స్కోర్ సాధించా. అమెరికాలో ఎమ్ఎస్, ఎంబిఎ పూర్తి చేశా. ఐఎస్బిలోనూ సీటు వచ్చింది. ప్రస్తుతం విదేశీ కంపెనీలకు కన్సల్టెంట్‌గా ఉన్నా. స్కై డ్రైవ్ కోసం అంటార్కిటికాకు వెళ్లినప్పుడు అక్కడ స్థితిగతుల్ని చూశాక మన దేశంలో అర్హత గలవారికి జీమ్యాట్‌లో శిక్షణ నిస్తే బాగుంటుందని అనుకున్నా. ఉన్న అనుభవంతో కొందరి భవిష్యత్తునైనా అందంగా మార్చగలను అనుకున్నాను. ఆ ఆలోచనే ‘సహస్ర’కు నాంది అయింది. ‘సహస్రా’వధానం కనీసం వెయ్యిమంది విద్యార్థులకైనా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ‘సహస్ర’ పేరుతో సంస్థను నెలకొల్పాను. మూడేళ్లుగా ‘ఐఎస్బి’తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రముఖ కంపెనీలలో ఉద్యోగావకాశాలు పొందాలనుకుని దారీతెన్నూ తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు దిశా నిర్దేశం చేస్తున్నాను. కిందటేడాది 170 మందికి శిక్షణనిస్తే వారిలో 150 మందికి పైగా విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ కంపెనీలకు 60 అప్లికేషన్లు పంపిస్తే అన్నీ ఎంపిక అయ్యాయి. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన దారి తెలియకపోతే అవకాశాల్ని అందిపుచ్చుకోలేనివారు ఎందరో. వారిలో పేద విద్యార్థులూ ఉన్నారు. ధనిక, పేద తేడా లేకుండా ఏ విద్యార్థి అయినా డిగ్రీతో పాటు ఎంబిఎ చేసి ఉంటే చాలు. వారికి విదేశాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయో, వాటిలో ప్రవేశానికేం చేయాలో అన్ని టెక్నిక్స్ నేర్పడానికే ఈ సంస్థను నెలకొల్పాను. పంచభూతాలతో ప్రపంచ రికార్డ్ మొదటిసారి ఓ వికలాంగుడు 14 వేల అడుగుల ఎత్తులో స్కై డ్రైవ్ చేశాడని నా పేరును లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. పాపకర్మల వల్ల అవిటి జీవితం రాదని, నింగి, నేల, నీరు, గాలి, అగ్ని - ఇలా పంచభూతాలే మానవాంశకు అసలు కారణం అని భగవద్గీత ద్వారా తెలుసుకున్నా. పంచభూతాలను పూర్తి గా అనుభూతించాలనుకున్నా. అమెరికాలోని గ్రాండ్ కానియన్ వద్ద స్కై వాక్, అంటార్కిటికాలో స్కై డ్రైవ్ చేశాను. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లోని అతి ఎత్తై అగ్నిపర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నా. అలాగే, అర్జెంటీనాలోని ఓ గుహలో కొన్నాళ్ల పాటు ఒక్కడినే జీవించాలనుకుంటున్నా. వికలాంగుడైనా సాహసకృత్యాలు చేయడంలో వెనకంజ వేయాల్సిన అవసరం లేదని నాలాంటి వారికి నిరూపించడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నా. చదువు ఒక్కటే సమస్త ప్రపంచాన్నీ చేరువ చేస్తుంది. అందుకే వికలాంగుల తల్లితండ్రులకు నాదో విన్నపం. వికలాంగులైనా మీ బిడ్డల్ని బాగా చదివించండి. అప్పుడు భవిష్యత్తులో వారు మీకు భారం కారు, భరోసాగా నిలుస్తారు’’ అన్నారు సాయిప్రసాద్. - నిర్మల చిల్కమర్రి -
ఆ నేతలపై ఫిర్యాదు చేసినందుకు..
పంజగుట్ట: అధికార పార్టీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేశారని అల్వాల్‌కు చెందిన సాయి ప్రసాద్ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు, నాయకుడు నక్కా ప్రభాకర్ అల్వాల్‌లో ఆక్రమించుకున్న స్థలంలో రెండు అంతస్థులకు అనుమతి తీసుకుని మరో రెండు అంతస్థులు అక్రమంగా కట్టిన భవనాలపై ఆర్టిఏ ద్వారా సమాచారం తీసుకుని జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానన్నారు. దీంతో నక్కా ప్రభాకర్ అతని అనుచరులు తన ఇంటì కి వచ్చి తనపై దాడులు చేశారని, ఫిర్యాదు వాపస్ తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు. ఈ విశయమై పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, త్వరలో హెచ్ఆర్సీని కూడా ఆశ్రయిస్తానని తెలిపారు. -
అంబులెన్సు, కారు ఢీ: ఒకరు మృతి
ఆస్పత్రి నుంచి రోగి, అతని కుటుంబసభ్యులతో వెళ్తున్న అంబులెన్సు రోడ్డు ప్రమాదానికి గురై అందులోని రోగి మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు వద్ద మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన జి.సాయిప్రసాద్(69) అనారోగ్యంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. తిరిగి మంగళవారం వేకువజామున భార్య, కుమారుడితో కలసి అంబులెన్సులో స్వగ్రామానికి బయలుదేరారు. వారి వాహనాన్ని మానవపాడు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సాయిప్రసాద్ చనిపోయారు. ఆయనతోపాటు ఉన్న భార్య పుష్పవతమ్మ(60)కు తీవ్రగాయాలయ్యాయి. కుమారుడు సత్యనారాయణ, డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే మానవపాడు ఆస్పత్రికి తరలించారు. -
సాయిప్రసాద్ సంచలన బౌలింగ్
► అభినవ్ కోల్ట్స్ బౌలర్ ఘనత ► ఎ-డివిజన్ వన్డే లీగ్ హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో అభినవ్ కోల్ట్స్ బౌలర్ సాయి ప్రసాద్ (8/8) చెలరేగాడు. అద్భుతమైన స్పెల్‌తో సదర్న్ స్టార్స్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. దీంతో అభినవ్ కోల్ట్స్ జట్టు 234 పరుగుల భారీ తేడాతో సదర్న్పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్ట్స్ జట్టు 42.1 ఓవర్లలో 284 పరుగులు చేసింది. అజ్మత్ అలీ (114) సెంచరీ సాధించగా, సంతోష్ 42 పరుగులు చేశాడు. తర్వాత సదర్న్ స్టార్స్ 12.2 ఓవర్లలోనే 50 పరుగులకే ఆలౌటైంది. సాయిప్రసాద్ ధాటికి ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు శాంతి ఎలెవన్: 238/9 (సుజిత్ 50, సాయి సిద్ధార్థ్ 41; ధీరజ్ 4/45, గౌరీశంకర్ 3/86), సత్య సీసీ: 66 (సాయి కిరణ్ 4/23, మనోజ్ కుమార్ 4/25). కన్సల్ట్ సీసీ: 156/8 (భాను 106, భరత్ 54; అఖిల్ 3/29, సాయి 3/30), విజయ్ సీసీ: 157/5 (శితికంఠ 59; కరణ్ 3/17). హైదరాబాద్ జిల్లా: 56 (నాగ నితిన్ 5/13, వల్లభ్ రెడ్డి 3/13), పికెట్ సీసీ: 57/0 (ప్రద్యుమ్న 45 నాటౌట్). విజయ్‌నగర్ సీసీ: 42 (శేషగిరి 5/15, చరణ్‌తేజ 3/18), ఎస్‌యూసీసీ: 45/5 (రాకేశ్ 4/10). మహేశ్ సీసీ: 272/9 (శేఖర్ 98, నరేశ్ 51; గోపి 5/37, తృప్త్ 3/59), ఎంపీ స్పోర్టింగ్: 157/9 (వినీత్ 60 నాటౌట్; అవినాశ్ 4/27). యూత్ సీసీ: 44 (జెరోమ్ అరోకినాథన్ 6/14), సాక్రెడ్ హార్ట్స్: 45/1 (జేమ్స్ ఆంథోని 31 నాటౌట్). మహావీర్ సీసీ: 293/3 (ప్రేమ్సుందర్ 122; అనుజ్ యాదవ్ 3/70), గ్రీన్లాండ్స్: 167 (అనుజ్ 62; రాజీవ్ శర్మ 3/17). -
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ దుర్మరణం
అనంతపురం : అనంతపురం జిల్లా తలుపుల మండలం నామాలగుండు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కదిరి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయి ప్రసాద్ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కారు-లారీ ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. -
నందవరం టు న్యూయార్క్
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: పుట్టుకలో లోపాలను వైద్యులు సరిదిద్దగా.. విధికి ఎదురొడ్డి నిలిచిన ఆ బాలికకు బంగారు భవిష్యత్తు ఆహ్వానం పలికింది. అమెరికాలోని రాస్ స్కూల్లో చదువుకునే అవకాశం దక్కడంతో పాటు హార్వర్డ్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించే అదృష్టం కూడా తలుపుతట్టింది. అయితే ఆమె జనన ధ్రువీకరణ పత్రం, తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం లేకపోవడం ఆమె ఉజ్వల భవిష్యత్తుకు అడ్డంకిగా మారింది. నందవరం గ్రామానికి చెందిన లోకన్న, జయలక్ష్మి దంపతుల కుమార్తె పద్మావతి. 1998లో ఈ బాలిక గ్రహణమొర్రితో జన్మించింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు వైద్యం చేయించే స్థోమత లేక అలాగే వదిలేశారు. కొన్నిరోజులకు ఇలాంటి కూతురు, భార్య తనకు వద్దంటూ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లి జయలక్ష్మి, మేనమామ దస్తగిరి వద్ద బాలిక పెరిగింది. 2001లో అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కర్నూలులో ఏర్పాటు చేసిన గ్రహణమొర్రి ఉచిత వైద్య శిబిరానికి పద్మావతిని తీసుకెళ్లాడు. అప్పట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు ఫోర్ట్ సభ్యులు లయన్ నాగేశ్వరరావు, లయన్ శివశంకర్‌రెడ్డి, లయన్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, దంత వైద్యులు డాక్టర్ పి.సునీల్‌కుమార్‌రెడ్డి చేయూతనందించారు. అప్పటి జిల్లా కలెక్టర్ సాయిప్రసాద్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని జీఎస్ఆర్ హాస్పిటల్లో డాక్టర్ గోస్లా శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైద్య సేవలు మొదలయ్యాయి. పన్నెండేళ్ల పాటు పద్మావతికి ఉచితంగా భోజన, వసతి సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ క్లెఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో క్లెఫ్ట్ కిండర్ హిల్ఫే షెవాజ్ క్లెఫ్ట్ స్కూల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించే కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువు చెప్పించారు. ప్రస్తుతం ఆ బాలిక మంచి మార్కులతో 8వ తరగతి పూర్తి చేసింది. కుందనపు బొమ్మగా మార్చిన వైద్యులు జీఎస్ఆర్ హాస్పిటల్లో మూడేళ్ల వయస్సున్న పద్మావతికి వైద్యులు మొదట హైపర్టిలోరిజం విధానం ద్వారా పెదవిని దగ్గరగా చేర్చే ఆపరేషన్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అంగిళిలోని ఎముకను దగ్గరగా అతికించడం, నుదురును, కనుబొమ్మలను దగ్గరగా చేయడం, ముక్కును సరిచేయడం వంటి చికిత్సలన్నీ చేస్తూ వచ్చారు. అంగిళిలోని వైకల్యాన్ని రూపుమాపేందుకు పక్కటెముకలోని ఒక ఎముకను తీసి అతికించారు. ఇలా పన్నెండేళ్ల పాటు 8 నుంచి 12 సార్లు స్థానిక వైద్యులతో పాటు స్విట్జర్లాండ్‌లోని జురిచ్కి చెందిన ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫెసర్ హెర్మన్ సిలీర్ వంటి వారిచే శస్త్రచికిత్సలు నిర్వహించారు. వైద్యుల కృషి ఫలితంగా ఆ బాలిక అందంగా తయారైంది. వీసా, పాస్‌పోర్ట్‌కు అడ్డంకులు మూడేళ్ల వయస్సులోనే నందవరం వదిలి హైదరాబాద్‌కు వచ్చిన పద్మావతికి నేడు జనన ధ్రువీకరణ పత్రం జారీ సమస్యగా మారింది. అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి లోకన్న మరణ ధ్రువీకరణ పత్రం సైతం కుటుంబసభ్యులు తీసుకోలేదు. ప్రస్తుతం ఆమె తల్లి జయలక్ష్మి సైతం అనారోగ్యంతో మంచంపట్టింది. దీంతో పద్మావతికి వీసా, పాస్‌పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి. జూన్ 20వ తేదీలోపు అమెరికా వెళ్లాల్సిన ఆమెకు ఇప్పటి వరకు కనీసం పాస్‌పోర్ట్ కూడా రాలేదు. పాస్‌పోర్ట్ రావాలంటే తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి. ప్రస్తుతం తండ్రి జీవించి లేకపోవడంతో ఆయన మరణ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంది. దీనికి తోడు పద్మావతి జనన ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. జిల్లా అధికారులు స్పందించి అరుదైన ఈ బాలికకు ఈ పత్రాలన్నీ తక్కువ సమయంలో సమకూర్చగలిగితే ఆమె బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన వారవుతారని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అమెరికాలో ఉన్నత చదువుకు అవకాశం ప్రస్తుతం 8వ తరగతి పూర్తి చేసుకున్న పద్మావతికి ఉన్నత విద్యనందించాలని క్లెఫ్ట్ సొసైటీ వారు అమెరికాలోని రాస్ పాఠశాలకు లేఖ రాశారు. స్పందించిన రాస్ పాఠశాల నిర్వాహకులు బాలికకు పాఠశాల విద్యనే కాకుండా హార్వర్డ్ యూనివర్సిటీలో వైద్య విద్యను సైతం ఉచితంగా అందిస్తామని పేర్కొంటూ క్లెఫ్ట్ సొసైటీకి లేఖ పంపారు. ప్రస్తుతం ఆమె ఉన్నతిని చూసి కుటుంబ సభ్యులతో పాటు వైద్య సేవలు అందించిన వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సాయి ప్రసాద్ పరిస్థితి విషమం
కోలారు(కర్ణాటక), న్యూస్‌లైన్: దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని సెయింట్‌జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ (22) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు గురువారం తెలిపారు. అతని శరీరంలో కొన్ని అవయవాలు స్తంభించిపోయాయని, మరో రెండు, మూడు రోజులు గడిస్తే కానీ ఏ విషయమూ చెప్పలేమని వారు చెప్పారు. అతన్ని బతికించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సాయి ప్రసాద్ కోలారు సమీపంలోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలలో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న సంగతి తెలిసిందే. గత మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా దేవరాజ్ అర్స్ వైద్య కళాశాల సమీపంలో.. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని మెడలోని గొలుసును లాక్కుపోయే ప్రయత్నంలో ఈ దురాగతానికి పాల్పడడం విదితమే. ఈ సంఘటనను దారిదోపిడీ సందర్భంగా జరిగినదిగా సాయి ప్రసాద్ సహచరులు పేర్కొన్నారు. ఆరు నెలలుగా ఏదో మార్పు: దేవరాజ్ అర్స్ వైద్య కళాశాలలో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న సాయి ప్రసాద్ గత ఆరేడు నెలలుగా తరగతులకు సక్రమంగా హాజరు కావట్లేదని తెలిసింది. అతను మంచివాడని, ఎవరితోనూ గొడవ పడేవాడు కాదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాణికొప్ప తెలిపారు. మూడేళ్లుగా ఫస్ట్‌క్లాస్‌లోనే పాసవుతూ వస్తున్నాడని చెప్పారు. అయితే ఎందుకనో... ఫైనలియర్ తరగతులకు సక్రమంగా హాజరు కావట్లేదన్నారు. నెల రోజుల నుంచి క్యాంపస్‌లో కూడా కనిపించడం లేదని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రామ్నివాస్ చెప్పారు. -
డబ్బులు ఇప్పించి న్యాయం చేయండి
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్ : కర్నూలు ఆర్టీవో కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి రూ.25 వేలు తీసుకున్నాడని, ఇప్పుడు ఉద్యోగం చూపించకపోగా డబ్బులు కూడా ఇవ్వడం లేదని నగరంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన షెహన్షా అనే వ్యక్తి ఎస్పీ రఘురామ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమాని(94407 95567)కి జిల్లా నుంచి 46 ఫోన్ కాల్స్ వచ్చాయి. కోడుమూరు మండలం అనుగొండ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేమటూరు నుంచి ఇద ్దరు వ్యక్తులు వచ్చి నాటుసారా ప్యాకెట్లు, చీప్ లిక్కర్ బాటిళ్లను అమ్ముతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నాటుసారా వ్యాపారాన్ని నిరోధించి గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ గ్రామంలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఇలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలను జిల్లా ఎస్పీ నమోదు చేసుకున్నారు. ఎస్ఐ కుటుంబానికి చెక్కు పంపిణీ నీటిలో కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నందివర్గం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ సాయిప్రసాద్ మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని జిల్లా ఎస్పీ ఆదుకున్నారు. ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి సలాం, నందివర్గం ఎస్ఐ గోపాల్‌రెడ్డి, మృతిచెందిన ఎస్ఐ తల్లి రమణమ్మ, చెల్లెలు అనితలు పాల్గొన్నారు.