సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిస్మిస్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. లీవ్ దరఖాస్తు చేసినందుకు డిస్మిస్ చేయడం ఎప్పుడూ చూడలేదని, నిమ్మగడ్డ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో అందరికి తెలుసునని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉద్యోగుల మనోభావాలను ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరపాలి...ఎప్పుడు జరుపుతున్నారు?. ఆయనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే ఎన్నికలు అవసరం లేదా. ( నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం )
ఇంతటి ఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. మేము కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడలేదు. 9 నెలల నుంచి ఉద్యోగులు కరోనాపై పోరాటం చేస్తుంటే ఎందుకిలా చేస్తున్నారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు మొండి పట్టుదల పడుతున్నారు ఈ రోజు హై కోర్ట్‌కు వెళ్లాము...ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. ఎస్‌ఈసీ ఇప్పటికైనా మొండి పట్టుదల వదిలేసి కోవిడ్ వాక్సినేషన్ అయ్యాక ఎన్నికలు పెట్టాల’’న్నారు.
Comments
Please login to add a commentAdd a comment