venkatramireddy
-
రాష్ట్ర సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
డెక్కన్ క్రానికల్ వెంకట్రామ్రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామ్‌రెడ్డితో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. వీరిని నేడు కోర్టులో హాజరుపచిన అనంతరం రిమాండ్‌కు పంపనున్నారు. కాగా రూ. 8 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది. పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్‌రెడ్డిపై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామ్‌రెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది. చదవండి: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో -
YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం
గుంతకల్లుటౌన్(అనంతపురం జిల్లా): ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్–వైవీఆర్ క్యాంటీన్’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్‌పీరా, సీనియర్ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి క్షమాపణ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లిఖిత పూర్వక క్షమాపణ చెప్పారు. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనపై కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వరి సాగు చేపట్టవద్దని.. వ్యాపారులు వరి విత్తనాలు కూడా అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారనే ఆరోపణలతో పాటు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకోమన్నారనే అభియోగాలు రావడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వెంకట్రామిరెడ్డి క్షమాపణతో కోర్టు ధిక్కరణ కేసు విచారణను హైకోర్టు ముగించింది. చదవండి: ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి! -
ఫోన్ వచ్చింది.. మాట మారింది
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల పేరుతో జరుగుతున్న ఆందోళనల వెనుక బయట శక్తుల ప్రమేయం ఉన్నట్లు పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. వారి వెనుక రాజకీయ అజెండా దాగుందని, ఆ సంఘాలపై కొందరు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారని వెల్లడించింది. ఫిట్మెంట్ మినహా మిగిలిన పీఆర్సీ అంశాలన్నీ సానుకూలంగా ఉన్నాయని ఒప్పుకున్నాక ముగ్గురు ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు రావడంతో మాట మార్చారని బహిర్గతం చేసింది. పీఆర్సీ అంశంపై తమకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, కొందరి ప్రోద్బలంతో జరుగుతున్న ఆందోళనలపై ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఏపీటీఎఫ్, ఎస్టీయూ అధ్యక్షులు మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావేశంలో సమ్మె విరమణకు అంగీకరిస్తున్నామని తెలియచేసి బయటకు వచ్చాక ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట మారుస్తున్నారని తెలిపారు. ఫోన్లు రావడంతో వెళ్లిపోయారు: వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చల సందర్భంగా ఫిట్మెంట్ మినహా మిగిలిన అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు వచ్చాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హెచ్ఆర్ఏను దాదాపు తెలంగాణతో సమానంగా సాధించామన్నారు. కొంతమంది ప్రతి అంశంలోనూ చర్చల్లో పాల్గొని ఇప్పుడు తమను మాట్లాడనివ్వలేదని ఆరోపించడం సరికాదన్నారు. ఫిట్మెంట్ వారికి ప్రధాన అంశమైనప్పుడు మిగతా అంశాలపై చర్చల్లో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. మంత్రుల కమిటీతో చర్చలు ముగిసిన తర్వాత జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఫిట్మెంట్ మినహా అన్నీ బాగా జరిగాయని వారే అన్నారని గుర్తు చేశారు. సమ్మె విరమిద్దామంటే సరేనన్నారని చెప్పారు. ఒకరిద్దరు ప్రెస్మీట్లో కూర్చుని ఫోన్లు రావడంతో వెళ్లిపోయారని తెలిపారు. దీన్నిబట్టి ఎవరు, ఎవరి వల్ల ప్రభావితమవుతున్నారో ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. కొందరికి సమ్మె జరగలేదనే అసంతృప్తి ఉందని, వారే రకరకాల ప్రచారాలు చేయిస్తున్నారని తెలిపారు. బాధ్యత గల ఉద్యోగులైతే మా శవయాత్రలు చేస్తారా? అని ప్రశ్నించారు. తమపై దుష్ప్రచారాలు, ట్రోలింగ్లు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఒప్పుకున్నాక ఫోన్లు చేసిందెవరు?: బొప్పరాజు హెచ్ఆర్ఏ, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తామే సాధించామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పుకుంటున్నారని, అదే సమయంలో చర్చల్లో తమను మాట్లాడనీయడంలేదని చెబుతున్నారని, దీన్నిబట్టే వారు ఎంత గందరగోళంలో ఉన్నారో తెలుస్తోందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ మినిట్స్ చూస్తే ఎంత పారదర్శకంగా చర్చలు జరిపామో తెలుస్తుందని స్పష్టం చేస్తూ ఆ పుస్తకాన్ని చూపారు. హెచ్ఆర్ఏ, సీసీఏ తామే సాధించామని చెప్పుకుంటున్నప్పుడు వారిని మాట్లాడకుండా ఆపిందెవరని ప్రశ్నించారు. అన్నీ ఒప్పుకున్నాక ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది? ఎవరి నుంచి వారికి ఫోన్లు వచ్చాయో చెప్పాలన్నారు. తమతోపాటు ప్రెస్‌మీట్‌కు వస్తూ మధ్యలో ఫోన్ మాట్లాడుతూ హృదయరాజు వెళ్లిపోయారని వెల్లడించారు. చర్చలు పూర్తయ్యాక ఉపాధ్యాయ సంఘాల నాయకులపై ఒత్తిడి వచ్చిందని, ఈ విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. సంతకాలు చేసి బయటకు వెళ్లాక మాట మార్చారన్నారు. ప్రతి విషయాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని స్వయంగా సీఎం చెప్పారన్నారు. సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత రాజకీయ అజెండాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కొందరు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులను ఒత్తిడి చేయవద్దని వారి వెనుక ఉన్న పెద్దలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులతో సంబంధం లేదని శక్తులు ఇందులో జొరబడుతున్నాయన్నారు. ఐక్య ఉద్యమాల్లో పని చేసినప్పుడు ఏది జరిగినా సమష్టి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇతరులపై నిందలు మోపడం ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఎవరు నేర్పారని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికీ లాభమే: బండి కొందరు ఉపాధ్యాయులు తమ ఫొటోలకు దండలు వేయడం, శ్రద్ధాంజలి ఘటించడం, దహన సంస్కారాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సూచించారు. తమ కుటుంబ సభ్యుల్ని కూడా బూతులు తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి జీతంలో రూ.6 నుంచి రూ.7 వేల నష్టాన్ని నివారించి రూ.6 నుంచి రూ.8 వేల లాభం వచ్చేలా చేశామన్నారు. తాము ఏమీ చేయలేదనడం సరికాదన్నారు. తాము ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని చెప్పారు. తాము ఉద్యోగులకే విశ్వాసంగా ఉన్నామని తెలిపారు. చేతిలో సెల్‌ఫోన్ ఉందని ఇష్టం వచ్చిన్లు ట్రోల్ చేయడం మర్యాద కాదన్నారు. తమపై చెడుగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల ముసుగులో ఇదంతా ఎవరు చేస్తున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు పోరాటం చేసి ఎక్కువ ఫిట్మెంట్ సాధిస్తే వారి కాళ్లకు దండం పెడతామన్నారు. అంత జనాభా లేకున్నా సాధించాం: సూర్యనారాయణ ఉద్యోగులతో సంబంధం లేనివారు తమ నలుగురిని దోషులుగా చిత్రీకరిస్తూ సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలకు పాల్పడరని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అంత జనాభా లేకపోయినా వెలగపూడికి 24 శాతం హెచ్ఆర్ఏ సాధించటాన్ని బట్టి పెరిగినట్లా.. తగ్గినట్లా? అనేది ఉద్యోగులు ఆలోచించాలన్నారు. పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాలని విధానపరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐదేళ్లకు వెనక్కి తీసుకురావడం గొప్ప విజయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర అనుబంధ ఉద్యోగులకు తమతోపాటు పీఆర్సీ అమలు చేసేలా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సీఎంతో సమావేశంలో టీచర్ల సంఘాల నేతలు ఏమన్నారంటే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను చాలా భేషుగ్గా అమలు చేస్తున్నారనేది వాస్తవం సర్. అమ్మఒడి, ఆసరా లాంటి సంక్షేమ పథకాలు లేనివారు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈ ఐదు సంవత్సరాలే మా వర్గానికి చేసే అవకాశం ఉంటుంది. పీఆర్సీ అమలులో ఒక్కొక్కసారి ఒక్కో జీవోలో కొంతమందిని విస్తరిస్తున్నారు. పబ్లిక్ సెక్టార్‌కు, గురుకుల టీచర్లకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇచ్చారు. గత సంవత్సరం ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా 5 సంవత్సరాల నుంచి ఆలస్యమవుతోంది. వాళ్ల బడ్జెట్లో, వాళ్ల బోర్డుకి సంబంధించి ఇచ్చే జీవోలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పుడు ఇచ్చే జీవోలోనే అందరు ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేలా చూడాలి. అశోతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటకు రాకపోతే చాలా అంశాల్లో మాస్టర్ స్కేల్స్ లాంటివి బయటకురావు. అవి బయటకు వస్తేనే కొన్ని అంశాల్లో ముందుకుపోయే పరిస్థితి ఉంటుంది. అదనపు పెన్షన్ అలాగే ఉండేలా చూడాలి. హెచ్ఆర్ఏ, సీసీఏ కొత్తగా ఇవ్వకపోయినా, అలాగే ఉంచినా సరిపోతుంది. ఫిట్‌మెంట్‌పై మీరే ఆలోచన చేసి చేయాలని కోరుకుంటున్నాను. అనామలిస్ కమిటీ మీ ద్వారానే వేయాలని కోరుతున్నా. – హృదయరాజు, ఏపీటీఎఫ్ నేత సీఎంతో నాటి సమావేశంలో టీచర్ల సంఘం నేత ఏమన్నారంటే.. (వీడియో సాక్ష్యంతో) స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూలేని సంస్కరణలు విద్యాశాఖలో తీసుకొచ్చిన సీఎంకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు స్వయంగా పరిశీలించి విద్యార్థులకు షూలు, యూనిఫామ్స్, బ్యాగ్‌తో సహా ఇస్తూ విద్యాభివృద్ధిని ఎంతో ముందుకు తీసుకువెళుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మావి 2 సమస్యలున్నాయి. సర్వీసు రూల్స్ లేకపోవడంతో ఒక ఉపాధ్యాయుడు చేరిన దగ్గర నుంచి 35, 40 సంవత్సరాలు ఒకే సర్వీసులో రిటైర్ అవుతున్నారు. మీరు తప్పనిసరిగా విద్యా శాఖ సర్వీసు రూల్సు రూపొందించి పదోన్నతులకు శ్రీకారం చుట్టాలి. ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు చేయాలి సర్. మాకు బల్క్‌గా సాధారణ బదిలీలు ఇస్తే బాగుంటుంది. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై మా అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు సర్.. – ఎస్టీయూ నేత జోసెఫ్ సుధీర్‌బాబు -
ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయమని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, ఐదు డీఏలు ఇస్తామడం మంచి బెనిఫిట్ అనిపేర్కొన్నారు. ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్డ్ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయం. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, 5డీఏలు ఇస్తామనడం మంచి బెనిఫిట్. ఏప్రిల్‌లోపు పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని చెప్పడం మంచి పరిణామం. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎవరూ ఊహించని వరాలు ఎవరూ ఊహించని విధంగా సీఎం.. మాకు వరాలిచ్చారు. సీఎస్ కమిటీ సిఫారసు చేసినట్లు 14.29 ఫిట్‌మెంట్‌ను పక్కన పెట్టి 23 శాతం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జూన్ 30లోపు కొత్త ఫిట్మెంట్ సహా క్రమబద్దీకరిస్తామని స్పష్టంగా చెప్పారు. ఇళ్లు లేని వారికి 20 శాతం రిబేటుతో స్థలాలు కేటాయిస్తామనడం అభినందనీయం. మేం ప్రభుత్వానికి 71 డిమాండ్లు ఇవ్వగా 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది. – బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్ సాహసోపేత నిర్ణయాలు సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలివ్వాలని ప్రతిపాదించినప్పటికీ, ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే ఇవ్వాలని సీఎం ఆదేశించటం అభినందనీయం. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై మేం ఆశ్చర్యానికి గురయ్యాం. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయం. మెజారిటీ బెనిఫిట్స్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఎసీ అమరావతి చైర్మన్ అన్నీ ఉద్యోగ సంఘాలు హర్షిస్తున్నాయి ఎక్కడా లేని విధంగా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం పట్ల అన్ని ఉద్యోగ సంఘాలు హర్షించాయి. రెండు వారాల్లో హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంఐజీ లే అవుట్ లో 20 శాతం రిబేటు ఇచ్చి స్థలం కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను ఈ నెల వేతనంతో ఇవ్వనున్నారు. మొత్తంగా సీఎం నిర్ణయాల పట్ల ఉద్యోగులందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది. – ఎన్.చంద్రశేఖరరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జగన్ అంటే ఒక నమ్మకం ఊహించని విధంగా ఉద్యోగులకు సీఎం వరాలు ఇచ్చారు. చేస్తానని చెప్పటం వేరు.. చేయడం వేరు. సీఎం జగన్ చేసి చూపించారు. అది ఒక్క సీఎం జగన్‌కే సాధ్యం. సీఎం జగన్ అంటే ఒక నమ్మకం. ఇది ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన సంక్రాంతి కానుక. పెండింగ్ డీఏలన్నీ ఒకేసారి చెల్లిస్తామనడం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలోని ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. – వైవీరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేత మాకు శుభవార్త గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మూడు నెలలుగా పడుతోన్న ఆందోళనకు తెరపడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్ కావని కొందరు చేసిన దుష్ప్రచారానికి సీఎం అడ్డుకట్ట వేశారు. ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించి సీఎం జగన్ ఈ నిర్ణయాలను ప్రకటించినట్లు అర్థమైంది. ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ, సహకారాలు మరింతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని చెబుతున్నాం. ఉద్యోగుల ఆశీస్సులు, చల్లని దీవెనలు సీఎం జగన్‌కు ఎల్లవేళలా ఉంటాయి. – మహ్మద్ జానీ బాషా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేత నిజంగా మాకు పండుగే సంక్రాంతి ముందు ఇంకో పెద్ద పండుగలా ఉంది. కరోనా ఆర్థిక పరిస్థితుల్లో సైతం 23 శాతానికిపైగా ఫిట్మెంట్ ప్రకటించడం హర్షించతగ్గ విషయం. పదవీ విరమణ వయస్సు పెంపు హర్షణీయం. – బి.సేవానాయక్, కార్యదర్శి, జేఏసీ ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ చైర్మన్ స్వాగతిస్తున్నాం ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఉద్యోగులు ఊహించని విధంగా సర్వీసు కాల పరిమితిని 62 ఏళ్లకు పెంచడం పట్ల కృతజ్ఞతలు. సర్వీసు కాలాన్ని పెంచడంతో పాటు ఇంటి స్థలాల కొనుగోలుపై 20 శాతం రిబేట్ ఇవ్వడం, పెండింగ్ డీఏల చెల్లింపు, నిర్ణీత సమయంలో కారుణ్య నియామకాలు తదితర నిర్ణయాలు మాకందరికీ సంతృప్తినిచ్చాయి. అర్హత గలవారికి పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నాం. – ఎస్.కృష్ణమోహన్, ఏపీ మునిసిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎంకు ధన్యవాదాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏప్రిల్ లోపు ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం హర్షించతగ్గ విషయం. వైద్యపరంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగులెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – పావులూరి హనుమంతరావు, ఏపీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనందంగా ఉంది కరోనా పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ 23.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం హర్షణీయం. ఈ నెల నుంచే డీఏలన్నీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం నిజంగా హర్షించతగ్గ విషయం. ఉద్యోగుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు. – ఏఏ భాస్కరరెడ్డి, అధ్యక్షుడు, ఏఎంసీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉద్యోగులకు ఎంతో మేలు ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగులకు ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. స్మార్ట్ సిటీలలో 10 శాతం స్థలాల కేటాయింపుతో పాటు 20 శాతం రాయితీ ఇవ్వడం ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంతో మేలు చేసే అంశం. ఈ పీఆర్సీలో ఉద్యోగులు ఊహించని ఎన్నో లాభాలను చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – వి.జయదేవ్, టూరిజం కార్పొరేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనుకున్నదాని కంటే ఎక్కువ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగిస్తోంది. ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికంటే సీఎం ఎక్కువే చేసినందుకు కృతజ్ఞతలు. – కళ్లే పల్లి మధుసూదన రాజు, కన్వీనర్ కోన దేవదాసు, ఏపీ గ్రంథాలయ ఉద్యోగుల సంఘం (108/19) ఆర్థిక సమస్యలున్నా ఉద్యోగుల సంక్షేమాన్ని వీడలేదు కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడ్డారు. రాష్ట్ర ఉద్యోగుల కోర్కెలను చాలావరకు తీర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వచ్చే జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని ప్రకటించడం శుభపరిణామం. – వీఎస్ దివాకర్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ హర్షణీయం కోవిడ్ సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా 23 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించడం హర్షణీయం. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారనేందుకు ఇది తార్కాణం. ఇళ్లు లేని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఇళ్లు.. తదితర అంశాలు ఎంతో అభినందనీయం. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ముందుగానే సంక్రాంతి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27శాతం ఐఆర్ ఇచ్చారు. పెండింగ్ డీఏలను జనవరి నుంచి ఇస్తామనడం, ఇళ్లు లేని ఉద్యోగులకు రాయితీపై ఎంఐజీలో అవకాశం కల్పించడంతో ఉద్యోగులకు సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. సీఎంకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు – కె.జాలిరెడ్డి, కె.ఓబుళపతి వైఎస్సార్ టీఎఫ్ సంతోషకరం ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ నిర్ణయం, ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం హర్షణీయం. ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల నిర్ణయం సంతోషకరం. – లెక్కల జమాల్‌రెడ్డి, గురువారెడ్డి.. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆపద్బాంధవుడు సీఎం ఉద్యోగుల పాలిట ఆపద్బాంధవుడుగా సీఎం జగన్ మరోసారి నిలిచారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం ఎందరో మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్ 27శాతం ఐఆర్ ఇచ్చారు. – తూతిక శ్రీనివాసవిశ్వనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రకాశం చదవండి: ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్ -
AP: జేఏసీ నాయకులకు ఆందోళన ఎందుకు?
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం మాట ఇచ్చిన తర్వాత కూడా ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. శనివారం ఒంగోలులో జరిగిన ఫెడరేషన్ జిల్లా మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత.. హామీలను సరిగ్గా పట్టించుకోవన్నారు. కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్టీసీని విలీనం చేశారని గుర్తు చేశారు. దీన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమైనా ఊహించిందా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీని విలీనం చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.3,600 కోట్లు మేర భారం పడుతుందని నిపుణులు చెప్పినా ‘మాట ఇచ్చాను. విలీనం చేయాల్సిందే’ అని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. మిగిలినవి కూడా ఇదేవిధంగా నెరవేరుస్తారని చెప్పారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తిరుపతిలో ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా ఉద్యోగ జేఏసీ నాయకులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నీచ రాజకీయాలు సరికాదని సూచించారు. వచ్చే వారం చివరికల్లా పీఆర్సీ పూర్తవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు అంశంపై కూడా ముఖ్యమంత్రితో మాట్లాడామని చెప్పారు. బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇద్దరూ ప్రకాశం జిల్లా వారేనని, దానికి తోడు ఇద్దరూ బంధువులేనని చెప్పారు. రాజకీయాలు కాకుండా.. ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు అరవపాల్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ
సాక్షి, అమరావతి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) విషయంలో ఉద్యోగులకు స్పష్టత ఉందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే పీఆర్సీ అమలు ఉంటుందన్నారు. సచివాలయ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల 29న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రభుత్వంతో చర్చిస్తామని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు చెప్పాయని, దీంతో.. వారంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నివేదికపై స్పష్టత ఇస్తామని సీఎస్ చెప్పారన్నారు. కొన్ని అనివార్య కారణాలతో సీఎం మాట్లాడడం కుదర్లేదని.. దీంతో ఉద్యోగ సంఘాల వినతి మేరకే బుధవారం సాయంత్రం సీఎస్ ముఖ్యమంత్రిని కలిశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో.. గత జేఎస్సీ సమావేశానంతరం పరిణామాలు, సీఎంతో చర్చించిన అంశాలను వివరించేందుకు శుక్రవారం (ఈనెల 12న) మధ్యాహ్నం మరోసారి అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ అమలు సాధ్యంకాదన్నారు. నివేదికపై అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి చర్చించుకుని సమావేశంలో వ్యక్తమైన సలహాలు, సూచనలను తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించారు. కేంద్రం హెచ్ఆర్ఏను తగ్గించడం, తెలంగాణ కూడా తక్కువ ఇస్తున్నందున రాష్ట్రంలో హెచ్ఆర్ఏ విషయంలో ఉద్యోగులకు నష్టం జరగకుండా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతోందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులందరూ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సానుకూల పరిస్థితులను అర్థంచేసుకోకుండా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం, అధికారులపై ఆరోపణలు చేయడం బాధాకరమని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కేవలం మైలేజీ పెంచుకునేందుకు అనవసర నిరసనలు చేస్తున్నారన్నారు. తాము పీఆర్సీపై ఆందోళన చెందడంలేదన్నారు. -
మాట తప్పని సీఎం జగన్
కడప కోటిరెడ్డిసర్కిల్: నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీవో నంబరు 154 జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని నూర్జహాన్ కల్యాణ మండపంలో వీఆర్వోలకు పదోన్నతుల కల్పనపై ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆగిపోయిన వీఆర్వోల పదోన్నతి.. తిరిగి ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల అభిమానంతో అధికారం చేపట్టిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారన్నారు. -
సాయి ప్రసాద్‌ని డిస్మిస్ చేయడం దుర్మార్గం
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిస్మిస్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. లీవ్ దరఖాస్తు చేసినందుకు డిస్మిస్ చేయడం ఎప్పుడూ చూడలేదని, నిమ్మగడ్డ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో అందరికి తెలుసునని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉద్యోగుల మనోభావాలను ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరపాలి...ఎప్పుడు జరుపుతున్నారు?. ఆయనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే ఎన్నికలు అవసరం లేదా. ( నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం ) ఇంతటి ఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. మేము కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడలేదు. 9 నెలల నుంచి ఉద్యోగులు కరోనాపై పోరాటం చేస్తుంటే ఎందుకిలా చేస్తున్నారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు మొండి పట్టుదల పడుతున్నారు ఈ రోజు హై కోర్ట్‌కు వెళ్లాము...ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. ఎస్ఈసీ ఇప్పటికైనా మొండి పట్టుదల వదిలేసి కోవిడ్ వాక్సినేషన్ అయ్యాక ఎన్నికలు పెట్టాల’’న్నారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు సంబంధించి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంత శాతం జీతాలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు ఇవ్వాల్సిన జీతాలపై గురువారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలకు ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు అందుతాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. పూర్తి జీతాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంతో తాము సంప్రదించామని, గత రెండు నెలలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాలు 50 శాతం వాయిదా వేసినట్లు తెలిపారు. ఈరోజు(మే21) నుంచి పూర్తిస్థాయి ఉద్యోగులు హాజరవుతున్నారని, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. విధులకు హాజరయ్యే ఉద్యోగుల కోసం మాస్కులు, శానిటైజర్లను ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో ఉన్నవారిని ప్రత్యేక బస్సుల్లో రప్పిస్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. (పులివెందుల అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) -
విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం: వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం అధ్యకుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల అవసరాలపై ప్రత్యేక పత్రాల ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని కోరారు. మే 31 లోపు ఉద్యోగులను విశాఖ తీసుకెళ్లాలని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారన్నారు. పీఆర్సీ, డీఏల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం హామీని నెరవేర్చేలా కృషి చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయుడును అరెస్ట్ చేసి, అరగంట అనంతరం వారందరిని వాళ్ల ఇళ్ల వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతాడు. అయితే అతడి స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు మద్దతుగా జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే యత్నం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు అడ్డగోలు వాదనలకు దిగారు. అయితే వెంకట్రామిరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్థారణ చేశారు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తోడు నిలిచి.. కన్నీళ్లు తుడిచి!
‘‘మాటతప్పని రాజన్నా.. మడమతిప్పని మనిషివయా’’ ఇటీవల వైఎస్సార్ జీవిత చరిత్రపై తీసిన ‘యాత్ర’ సినిమాలోని పాట ఇది. ఆయన రక్తాన్నే కాదు.. నడకను, నడతను పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా పాలన సాగిస్తున్నారు. అక్కా.. అమ్మా అవకాశం ఇవ్వండి.. రాజన్న పాలన తెస్తానంటూ మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందరికో న్యాయం చేస్తున్నారు. తాజాగా 2016లో డెంగీతో ఇద్దరు పిల్లలను కోల్పోయిన వాజిదా తబస్సుమ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి మరోసారి మాటతప్పని పాలకుడినని చాటుకున్నారు. చేతులెత్తేసిన టీడీపీ ⇒ 2016 సెప్టెంబర్ 15: అనంతపురం వినాయకనగర్‌లో నివాసముంటున్న ఎస్.వాజిదా తబస్సుమ్, ఎస్.ఖలందర్ దంపతుల ఇద్దరు కుమారులు మహమ్మద్ ఇద్రీస్(12), మహమ్మద్ జునైద్(9)లను డెంగీ కాటేసింది. అపరిశుభ్రత కారణంగా దోమలు ప్రబలి చిన్నారులిద్దరినీ తల్లిదండ్రుల నుంచి దూరం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు డెంగీతో మృతి చెందిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తల్లి వేదన ఎందరినో కన్నీళ్లు పెట్టించింది. ⇒ 2016 సెప్టెంబర్ 16: అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు వాజిదా తబస్సుమ్ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇల్లు మంజూరు, ఇంట్లో ఒకరికి ఉద్యోగమిస్తామని హామీలిచ్చారు. ఆ కుటుంబం బాధ్యత తమదంటూ ఫొటోలకు ఫోజులిచ్చి మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇందులో ఒక్కటీ అమలు చేయలేకపోయారు. మాటకు కట్టుబడిన వైఎస్సార్ సీపీ ⇒ 2017 డిసెంబర్ 11: ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా మదిగుబ్బ క్రాస్ వద్ద నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సులో ఎస్.వాజిదా తబస్సుమ్, ఎస్.ఖలందర్లు పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, టీడీపీ తీరును వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పక ఆదుకుంటామన్నారు. అప్పటి ముఖ్యమంత్రికీ, కలెక్టర్‌కు లేఖ రాస్తాననీ, అప్పటికీ వారు స్పందించకపోతే మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రిలీఫ్ ఫండ్ కింద తబస్సుమ్ పేరున రూ.10 లక్షలు మంజూరు చేశారు. ⇒ 2019 సెప్టెంబర్ 23: ఇద్దరు పిల్లలను కోల్పోయిన వాజిదా తబస్సుమ్‌కు రూ. 10 లక్షల చెక్కును సోమవారం గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అందించారు. మాటఇచ్చి నిలుపుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ తల్లి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. సాక్షి, అనంతపురం(గుంతకల్లుటౌన్) : అనంతపురం వినాయకనగర్‌లో నివాసముంటున్న ఎస్.వాజిదా తబస్సుమ్, ఎస్.ఖలందర్‌లకు ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు. వినాయకనగర్‌లో అపరిశుభ్రం కారణంగా ఇద్దరు కుమారులైన మహమ్మద్ ఇద్రీస్, మహమ్మద్ జునైద్ డెంగీతో మృతి చెందారు. పిల్లలిద్దరినీ కోల్పోయిన ఆ దంపతుల వేదన ఎందరినో కలచివేసింది. కానీ అప్పటి టీడీపీ సర్కార్ మనస్సు మాత్రం చలించలేదు. సాయం చేస్తామని గొప్పలు చెప్పిన వారంతా ఆ తర్వాత ముఖం చాటేశారు. రెండేళ్లు ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టూ తిరిగిన వాజిదా తబస్సుమ్, ఖలందర్ దంపతులు విసిగిపోయి ఆర్థిక సాయంపై ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలోనే 2017 డిసెంబర్ 11న ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనార్టీల ఆత్మీయ సదస్సు నిర్వహించగా అందులో పాల్గొన్నారు. తమ వేదనను వినిపించి ఓ అర్జీ అందించారు. స్పందించిన జగన్మోహన్రెడ్డి ‘‘వాజిదాబేగం నాకిచ్చిన అర్జీని జిల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రికి పంపి సహాయం చేయమని కోరతా. ఈ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం, మానవత్వం ఏ కోశాన ఉన్నా వెంటనే ముందుకొచ్చి సాయం చేయాలి. కానీ నేనొక్కటైతే చెబుతున్నా తల్లీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోకొంత సాయమైతే మీకందుతుంది. అదొక్కటే కాకుండా భరోసా ఇచ్చే ఇంకో మాట చెబుతున్నా.. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేసే బాధ్యత మాది. మీ కుటుంబానికి తోడుగా ఉంటాం’’ అని హామీ ఇచ్చారు. హామీ గుర్తుంది.. ఆర్థికసాయం అందింది జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఒక్కో హామీ అమలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వాజిదా తబస్సుమ్, ఖలందర్ దంపతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఆ చెక్కును గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పంపారు. బాలుర తల్లికి చెక్కు అందజేత సోమవారం ఉదయం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వాజిదా తబస్సుమ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అందజేశారు. వైఎస్ జగన్ మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి అని వైవీఆర్ కొనియాడారు. విద్యావంతురాలైన తబస్సుమ్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని వైవీఆర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజినేయులు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.వీ.సందీప్‌రెడ్డి, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌బాషా, ఎద్దుల శంకర్, మైనార్టీ నాయకులు నూర్‌నిజామి, జాబీర్, ఆర్డీజీ.బాషా పాల్గొన్నారు. జగనన్నకు రుణపడి ఉంటాం నా బిడ్డలు మహమ్మద్ ఇద్రీస్, మహమ్మద్ జునైద్‌లు డెంగీతో చనిపోయినప్పుడు అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు మా ఇంటికి వచ్చారు. బాధలో ఉన్న మమ్మల్ని పరామర్శించి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషి యా, ఇల్లు, ఉద్యోగమిప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా కోసం మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనికరం చూపలేదు. కానీ అనంతపురానికి వచ్చిన జగనన్నను కలిసి నా గోడు చెప్పుకున్నాను. ఆ రోజు మాట ఇచ్చారు... ఈ రోజు అమలు చేసి చూపాడు. జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – వాజిదా తబస్సుమ్ సాక్షి వరుస కథనాలు పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో అనంతపురం నగరంలో అపరిశుభ్రతో పెరిగి డెంగీ, మలేరియా విజృంభించగా.. సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇద్రీస్, జునైద్ మరణానికి కారణమెవరని ప్రశ్నించింది. కనీసం బాధిత కుటుంబాన్నైనా ఆదుకోవాలని పాలకులకు గుర్తు చేసింది. సెప్టెంబర్ 17, 2016లో ‘ఈ పాపం ఎవరిది’ శీర్షికన.. సెప్టెంబర్ 17, 2017న ‘నిర్లక్ష్యానికి ఏడాది’ శీర్షికన ‘సాక్షి’ కథనాలతో ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేసింది. కానీ మొద్దనిద్రలో ఉన్న అప్పటి సర్కార్ కనీసం స్పందించకపోవడం గమనార్హం. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపేటలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకట్రామిరెడ్డి(42) చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్‌తోనే సువర్ణ పాలన
ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కొనసాగించగలరని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నాటి సువర్ణ పాలన తిరిగి రావాలంటే జగన్‌ను సీఎం చేయడమే మార్గమన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్యూఐ నాయకులు, విద్యార్థులు ఎమ్మెల్యే కేతిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖరరెడ్డి, హనుమంతరెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరిన విద్యార్థులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత రాజకీయంగా ఎదగాలన్నారు. సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి తాను ఐదేళ్లలో చేసి చూపానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. వైఎస్ ప్రతిష్టను తగ్గించేందుకు అయన అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు అటకెక్కించారని విమర్శించారు. వైఎస్ పథకాలను విమర్శించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు ఆ పథకాలను అమలు చేస్తానని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ప్రజలను వంచిస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి ముందు నుంచీ సమైక్యవాదాన్నే వినిపిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మద్దతు తెలపాలని జాతీయ నాయకులను కోరారన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బి కొండారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్‌రెడ్డి, వై రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శులు సందీప్‌కుమార్, విజయ్‌కుమార్, మదనమోహనరెడ్డి, కార్యదర్శులు నబీరసూల్, రమేష్, సోమశేఖరరెడ్డి, కోశాధికారి భాస్కరరెడ్డి, కమిటీ సభ్యులు రాజశేఖరరెడ్డి, రామిరెడ్డి, కొండారెడ్డి, ముత్యాలు, రవీంద్రారెడ్డి ఉన్నారు. వీరితోపాటు ధర్మవరం ప్రాంతానికి చెందిన యూనివర్సిటీ విద్యార్థులు 500 మంది పార్టీలో చేరారు. -
బహిరంగ చర్చకు సిద్ధమా?
గద్వాలన్యూటౌన్, న్యూస్‌లైన్: గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి రికార్డు స్థాయిలో జరిగిందని అధికార పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఫ్లెక్సీలు, బోర్డులతో ప్రజలను మభ్యపెడుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డీకే సమరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. గద్వాల మండలంలో ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం గద్వాల మండల పరిధిలోని గోనుపాడు గ్రామానికి చేరుకుంది. శెట్టి ఆత్మకూర్, మదనపల్లి, ఈడ్గోనిపల్లి, గుంటిపల్లి, రేకులపల్లి గ్రామాలలో సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సమరసింహారెడ్డి మాట్లాడారు. గత 20 ఏళ్ల క్రితం జరిగిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత జరిగింది శూన్యమన్నారు. జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాయచూరు రైల్వే లైన్ల అభివృద్ధికి తన హయాంలోనే కృషి జరిగిందన్నారు. ప్రస్తుతం అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతుందన్నారు. తాను ఓట్ల కోసం పాదయాత్ర చేపట్టలేదని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు అధికార పార్టీ నాయకుల అవినీతిని వివరించడానికే పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. . ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లత్తీపురం వెంకట్రామిరెడ్డి, గంజిపేట రాములు, పూజారి శ్రీధర్, మస్తాన్, చెన్నయ్య, నాగశంకర్, కలీం, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇప్పటికి మేల్కొన్నారు
కర్నూలు, న్యూస్‌లైన్: మృత్యువు చేల‘రేగింది’. 45 మందిని పొట్టన పెట్టుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రైవేట్ బస్సు ఘటనతో ఇప్పుడు ఆ వాహనాలంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమోననే చర్చతో వారిలో కదలిక వచ్చింది. అయితే వీరు ఎంతకాలం ఇలా తనిఖీలుతో సంబంధిత యాజమాన్యాలను దారిలోకి తీసుకొస్తారనేది ప్రశ్నార్థకం. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కర్నూలు నగర శివారులోని టోల్‌ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పర్మిట్ల గడువు ముగిసినప్పటికీ అక్రమంగా తిప్పుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. రీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిప్పుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు రిజిస్ట్రేషన్ల కాగితాలు, డ్రైవర్ల లెసైన్స్‌లతో పాటు అధిక లోడ్ వివరాలను పరిశీలించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాంప్రసాద్ నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారులు చంద్రబాబు, రమణ, శ్రీనివాసులు, శేషాద్రి, ఏఎంవీఐలు శివలింగయ్య, రాజేశ్వరరావు, రవిశంకర్ నాయక్, నారాయణ నాయక్, కుసుమ, జయశ్రీ, విజయకుమారి తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. సహారా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా తనిఖీ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి బళ్లారికి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పీయూఎన్ ట్రావెల్స్, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపీ టూరిస్ట్ ట్రావెల్స్ వాహనాలను పరిశీలించారు. పర్మిట్ల గడువు ముగిసినట్లు తనిఖీల్లో తేలడంతో కేసులు నమోదు చేశారు. అలాగే రీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మూడు వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా 12 మాసాల్లోపు రిజిస్ట్రేషన్ బదలాయించి నంబర్లు మార్చుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న(కర్ణాటక) బస్సులను తనిఖీ చేసి రీ అసైన్మెంట్ కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు(మర్చంటైల్ గూడ్స్) టాప్‌పైన అధిక లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేసి కేసు కట్టారు. వీటికి సంబంధించి దాదాపు రూ.2 లక్షల అపరాధ రుసుముతో పాటు ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు అప్పగించేందుకు వాహనాలు సీజ్ చేసి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ డిపోకు తరలించారు. అదేవిధంగా నంద్యాలలో ఆర్టీఓ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటేశ్వరరావు, రాజబాబు, శివకుమార్, అనిల్‌కుమార్ నేతృత్వంలో మరో బృందం నంద్యాల జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 12 కేసులు నమోదు చేసింది. ఈ సందర్భంగా డీటీసీ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులో ఇద్దరు డ్రైవర్లను కచ్చితంగా నియమించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని, తనిఖీలు నిరంతరాయంగా కొనసాగిస్తామని హెచ్చరించారు.