
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారన్నారు. పీఆర్సీ, డీఏల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం హామీని నెరవేర్చేలా కృషి చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.