
అమరావతి,సాక్షి: ఏపీ సచివాలయంలో (andhra pradesh secretariat) రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు కార్యకలాపాలు నిర్వహించే రెండవ పేషీ (ap secretariat minister peshi) బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రమాదంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. ఎస్పీఎఫ్ సమాచారంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
అగ్ని ప్రమాదం సంభవించిన రెండో బ్లాక్‌లో సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనితల పేషీలు ఉన్నాయి.
ఏపీ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు
అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. సచివాలయంలోకి మీడియాని అనుమతించకుండా ఆంక్షలు విధించారు. సిబ్బంది ఐడీ కార్డ్ చూసిన తరువాతే వారిని లోపలికి పంపుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నుల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న మీడియాను లోపలికి అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం.. పై అధికారుల నుండి ఆదేశాలు వచ్చిన తర్వాతే లోపలికి మీడియాని అనుమతి ఇస్తామని చెబుతున్నారు.
