గద్వాలన్యూటౌన్, న్యూస్‌లైన్: గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి రికార్డు స్థాయిలో జరిగిందని అధికార పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఫ్లెక్సీలు, బోర్డులతో ప్రజలను మభ్యపెడుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డీకే సమరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. గద్వాల మండలంలో ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం గద్వాల మండల పరిధిలోని గోనుపాడు గ్రామానికి చేరుకుంది. శెట్టి ఆత్మకూర్, మదనపల్లి, ఈడ్గోనిపల్లి, గుంటిపల్లి, రేకులపల్లి గ్రామాలలో సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సమరసింహారెడ్డి మాట్లాడారు.
గత 20 ఏళ్ల క్రితం జరిగిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత జరిగింది శూన్యమన్నారు. జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాయచూరు రైల్వే లైన్‌ల అభివృద్ధికి తన హయాంలోనే కృషి జరిగిందన్నారు. ప్రస్తుతం అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతుందన్నారు. తాను ఓట్ల కోసం పాదయాత్ర చేపట్టలేదని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు అధికార పార్టీ నాయకుల అవినీతిని వివరించడానికే పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. . ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లత్తీపురం వెంకట్రామిరెడ్డి, గంజిపేట రాములు, పూజారి శ్రీధర్, మస్తాన్, చెన్నయ్య, నాగశంకర్, కలీం, కార్యకర్తలు పాల్గొన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
Published Mon, Dec 16 2013 3:02 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement