ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: హైకోర్టుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లిఖిత పూర్వక క్షమాపణ చెప్పారు. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనపై కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వరి సాగు చేపట్టవద్దని.. వ్యాపారులు వరి విత్తనాలు కూడా అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారనే ఆరోపణలతో పాటు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకోమన్నారనే అభియోగాలు రావడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వెంకట్రామిరెడ్డి క్షమాపణతో కోర్టు ధిక్కరణ కేసు విచారణను హైకోర్టు ముగించింది.
చదవండి: ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి!
Comments
Please login to add a commentAdd a comment