TRS MLC
-
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది: ఎమ్మెల్సీ కవిత
-
హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి క్షమాపణ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి లిఖిత పూర్వక క్షమాపణ చెప్పారు. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనపై కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వరి సాగు చేపట్టవద్దని.. వ్యాపారులు వరి విత్తనాలు కూడా అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలిచ్చారనే ఆరోపణలతో పాటు కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న పట్టించుకోమన్నారనే అభియోగాలు రావడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వెంకట్రామిరెడ్డి క్షమాపణతో కోర్టు ధిక్కరణ కేసు విచారణను హైకోర్టు ముగించింది. చదవండి: ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి! -
అతివేగం: అసెంబ్లీ గేట్‌ని ఢీకొట్టిన వాణి దేవి కారు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణి దేవి కారు ప్రమాదానికి గురయ్యింది. అసెంబ్లీ గేట్ నెం-8 వద్ద ఆమె కారు అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలవడానికి వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేట్ నం 8 దగ్గర పార్కింగ్ ప్లేస్‌లో ఆమె ఇన్నొవా కారు కంట్రోల్ కోల్పోయి అతి వేగంగా వచ్చి గేట్‌ను గుద్దుకుంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో వాణి దేవి కారులో లేకపోవండతో ఆమెకు ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన గేటు వద్ద నిత్యం పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. డ్రైవర్ తీయాల్సిన వాహనాన్ని గన్‌మెన్ తీయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకాక గన్‌మెన్‌కి డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భద్రతా సిబ్బంది తెలిపారు. చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం -
ఆయనతో టచ్‌లో లేను: యాదవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బహిష్కరించినట్టు ఎటువంటి నోటీసులు అందలేదని ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో టీఆర్ఎస్ శుక్రవారం ఆయనను బహిష్కరించింది. దీనిపై ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. మీడియా ద్వారానే తనకు తెలిసిందని, అధికారిక సమాచారం లేదన్నారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని చెప్పారు. (ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్) ‘దీనికి కారణాలు ఏమిటనేది వాళ్లే చెప్పాలి. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఉన్నా ఒక్కరోజు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. గ్రూపు రాజకీయాలు చేయలేదు. పార్టీ వ్యతిరేక ప్రకటన చేయలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వీళ్ల నిర్వచనం ఏంటో వాళ్లే చెప్పాలి. షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా బహిష్కరించడం సహేతుకం కాద’ని అన్నారు. కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో మీపై చర్య తీసుకున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు మైండ్ గేమ్ ఆడతాయని చెప్పారు. ఎంత మంది పార్టీని వీడారని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలవడమే తప్పా, ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదని యాదవరెడ్డి వివరించారు. కాగా, టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో యాదవరెడ్డిపై వేటు పడినట్టుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఈరోజు మధ్యాహ్నం ఖండించిన యాదవరెడ్డి.. రాత్రి మేడ్చల్ సభలో సోనియా, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం గమనార్హం. -
ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలపై ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. నేడు యాదవ రెడ్డి సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా సోనియా సభలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇకపోతే మరో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్‌లోకి వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీని వీడే నేతలను ముందుగానే గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు అర్థమవుతోంది. -
కేటీఆర్ హామీతో అలకవీడిన ఎమ్మెల్సీ
సాక్షి, నాగర్ కర్నూలు: టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు పూర్తి కావస్తున్న ఆ పార్టీని అసమ్మతి సెగలు వీడటం లేదు. అసమ్మతి రాగం అందుకున్న కొందరు నేతలను టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించిగా.. మరికొందరు నేతలు మాత్రం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కల్వకుర్తి టికెటు విషయంలో మనస్తాపం చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఓ దశలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. గతంలో అపద్దర్మ మంత్రి కేటీఆర్ నారాయణరెడ్డిని బుజ్జగించినప్పటికీ ఫలితం లేకపోయింది. నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌కు గట్టి షాక్ తగిలే అవకాశాలు ఉండటంతో కేటీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కేటీఆర్ గురువారం మరోసారి నారాయణరెడ్డితో సంప్రదింపులు జరిపారు. నారాయణరెడ్డితో భేటీ అయిన కేటీఆర్ భవిష్యత్తులో ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. దీంతో అలకవీడిన నారాయణరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్‌ను గెలిపించుకుంటామని తెలిపారు. అనంతరం కేటీఆర్‌తో కలిసి కల్వకుర్తిలో జరిగే టీఆర్ఎస్ బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. -
కల్వకుర్తి స్వతంత్ర అభ్యర్థిగా కసిరెడ్డి?
ఆమనగల్లు(కల్వకుర్తి) : కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీచేయనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు సంకేతాలు ఇచ్చారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామం నుంచి గురువారం కసిరెడ్డి నారాయణరెడ్డి పరోక్షంగా ప్రచారం ప్రారంభించారు. కల్వకుర్తి అసెంబ్లీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను పార్టీ ప్రకటించడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. మంత్రి కేటీఆర్ స్వయంగా బుజ్జగించినా ఆయన మెత్తబడలేదు. తన అనుచరుల ఒత్తిడితో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కసిరెడ్డి సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీగా విస్తృత పర్యటనలు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆ వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని కసిరెడ్డి నారాయణరెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. టికెట్ రాకపోవడంతో... ఈ ఎన్నికల్లోనూ కల్వకుర్తి నుంచి పోటీ చేయడానికి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆసక్తి చూపించారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం టికెట్‌ను జైపాల్‌యాదవ్‌కు కేటాయించింది. అప్పటి నుంచి కసిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. అయితే, రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి ముఖ్యనాయకులతో కసిరెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించి అనుచరుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. -
ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ దాడి
-
ఎమ్మెల్సీ అవకాశం ఎవరికో?
అధికార పార్టీ అభ్యర్థిత్వాలపై కొనసాగుతున్న సస్పెన్స్ ►మూడు సీట్ల కోసం నేతల పోటాపోటీ ►పావులు కదుపుతున్న ఆశావహులు ►ఎంపికపై గులాబీ అధినేత కసరత్తు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అభ్యర్థులకు మూడు స్థానాలు దక్కే అవకాశముండగా.. ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అభ్యర్థులపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇంకా కసరత్తు కొనసాగిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మూడు, స్థానిక సంస్థల కోటాలో ఒకటి కలిపి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఐదు రోజులు గడువు మాత్రమే ఉన్నా.. అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న వి.గంగాధర్ గౌడ్‌కు ఈసారి కూడా అవకాశం ఇవ్వనున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. దీంతో మిగతా మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఎంఐఎం తమ రెండు స్థానాలను తమకు వదిలేయాలని టీఆర్ఎస్ను కోరే అవకాశం ఉందంటున్నారు. ఒక స్థానమైనా ఎంఐఎంకు ఇచ్చే అవకాశమున్నా.. ఇప్పటి దాకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. దీంతో మూడు స్థానాలపైనా టీఆర్ఎస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవులు ఆశించి భంగపడిన సీనియర్ నేతలు, వివిధ హామీలు పొంది ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీలో ఉన్నారు. తెరపైకి పలువురి పేర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన ఎర్రోల్ల శ్రీనివాస్ ఈసారి తనకు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్నారని చెబుతున్నారు. ఇక పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావు ఈ సారి తనకు చాన్స్ దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో అవకాశమివ్వాలని ఆయన కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. వీరితోపాటు వరంగల్‌కు చెందిన గుడిమల్ల రవికుమార్, తక్కళ్లపల్లి రవీందర్రావు, మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ తదితరుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా భువనగిరికి చెందిన పార్టీ సీనియర్ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. చర్చలో మహిళా అభ్యర్థి? శాసస మండలిలో అత్యధిక మంది సభ్యులున్న టీఆర్ఎస్కు మహిళా సభ్యులు మాత్రం లేరు. దీంతో ఈసారి ఒక మహిళకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా కేసీఆర్ వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత కొద్దినెలలకే సుధా రాణి రాజ్యసభ పదవీకాలం ముగిసిపోయింది. ఆమె కూడా ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారని చెబుతున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రిజిష్టర్ మ్యారేజ్
-
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రిజిష్టర్ మ్యారేజ్
కరీంనగర్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు శుక్రవారం ఓ ఇంటివారయ్యారు. నాంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైకోర్టు న్యాయవాది అక్కి వర్షను ఆయన రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు. -
కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకేం చేశాయో చెప్పాలి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీల మండిపాటు సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు ఏం మేలు చేశాయో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నోముల నర్సింహయ్య, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు.కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వంపై ఓర్వలేనితనంతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదని ధ్వజ మెత్తారు. ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. అది మరిచిపోయి, కేవలం రాజకీయం కోసమే విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలన్నీ పూర్తిగా పొలిటికల్ స్టంట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. -
ఉత్తమ్‌కుమార్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్
నిజామాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం నిజామాబాద్‌లో భూపతిరెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందుకే ఉత్తమ్‌కుమార్ పంటనష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందని భూపతిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
నయీమ్‌కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా?
-
నయీమ్‌కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా?
ఫిర్యాదుదారుడికి ఓ ఎమ్మెల్సీ ఆఫర్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బెదిరింపులతో కోట్ల ముడుపులు చెల్లించుకున్న బాధితుడు ఒకవైపు.. ఆ దందాలో ప్రమేయముందన్న కారణంతో పోలీసుల ఎఫ్ఐఆర్లో పేరెక్కిన ఎమ్మెల్సీ మరోవైపు.. వారి మధ్య రాజీ కుదిర్చి, సదరు ఎమ్మెల్సీని ఒడ్డున పడేద్దామని నడుంకట్టిన కాంగ్రెస్ నేతలు ఇంకోవైపు.. మొత్తంగా సదరు బాధితుడు బలవంతంగా నయీమ్‌కు చెల్లించుకున్న కోట్ల రూపాయల కప్పాన్ని తాను వెనక్కిస్తానంటూ ఎమ్మెల్సీ బేరసారాలు.. మొత్తంగా నయీమ్ కేసులో రాజకీయ నేతల మధ్య జరుగుతున్న రసవత్తరమైన సన్నివేశమిది. నయీమ్‌తో సంబంధాల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ... కేసు నుంచి బయట పడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... నయీమ్‌తో సంబంధాలున్న పార్టీ నేతలపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చ జెండా ఊపారు. ఈ వారంలోనే పలువురికి నోటీసులు కూడా జారీ చేయనున్నారని సమాచారం. అయితే నయీమ్‌తో సంబంధాలున్న ఆయా పార్టీల నేతల్లో అత్యధికులు నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఒకరికి ఏళ్లుగా నయీమ్‌తో అనుబంధం ఉందనే దానిపై ‘సిట్’ ఆధారాలు సేకరించిందని, చర్య తీసుకోవడమే తరువాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న రాజకీయ పరిచయాలతో బయటపడేందుకు ఆ ఎమ్మెల్సీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం జరుగుతోంది? నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత కొద్ది రోజులకు భువనగిరికి చెందిన ఓ వ్యాపారి.. తనను డబ్బుకోసం నయీమ్ హింసించడం, వసూలు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీమ్ బెదిరింపులను రుజువు చేసేలా ఫోన్ సంభాషణల రికార్డులను కూడా అందజేశాడు. ఈ సంభాషణలోనే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పేరు ప్రస్తావన కూడా ఉంది. దీంతో వ్యాపారి ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్లో ఆ ఎమ్మెల్సీ పేరు కూడా చేర్చారు. త్వరలోనే ఫిర్యాదుదారు నుంచి పూర్తి వివరాలు సేకరించే యోచనలో సిట్ అధికారులు ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఫిర్యాదుదారు సిట్ అధికారులకు తన పేరు చెప్పకుండా ఉండేం దుకు సదరు ఎమ్మెల్యే ఒత్తిళ్లు మొదలుపెట్టారు. అందులో భాగంగా భువనగిరికి చెందిన ఆ వ్యాపారితో సన్నిహితంగా ఉండే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఒక మాజీ మంత్రిని కలిశారని.. ఫిర్యాదుదారు తన పేరు చెప్పకుండా ఒప్పిం చాలని బతిమిలాడినట్లు చెబుతున్నారు. ఆ యత్నం ఫలించక నల్లగొండ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేతను రాయబారానికి పంపించారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆ నేతకు, భువనగిరికి చెందిన ఫిర్యాదుదారుతో దగ్గరి సంబంధాలున్నాయంటున్నారు. డబ్బులు ఇచ్చేస్తా.. నయీమ్ బెదిరింపులకు భయపడి ఆ వ్యాపారి చెల్లించిన మొత్తం డబ్బులను తాను తిరిగి వెనక్కిస్తానని నల్లగొండ కాంగ్రెస్ నేత వద్ద ఆ ఎమ్మెల్సీ మోకరిల్లినట్లు చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం అటు టీఆర్ఎస్లో, ఇటు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనపై వేటు పడడం ఖాయమన్న అభిప్రాయానికి వచ్చిన ఆ ఎమ్మెల్సీ.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదంటున్నారు. మరోవైపు ఈ ఎమ్మెల్సీతో, నయీమ్‌తో అంటకాగిన టీఆర్ఎస్ నాయకుడొకరు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నయీమ్ అనుచరులు పాశం శ్రీనివాస్, సుధాకర్‌లపై పీడీ యాక్టు కింద నమోదైన కేసులో వారిద్దరు అరెస్టు కాకుం డా 3 నెలల పాటు అడ్డుకోగలిగిన ఆ నేత ఇప్పటికే దేశం దాటి వెళ్లాడని ప్రచారం జరుగుతోంది. తనకు సాయపడే ఆ నేత కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆ ఎమ్మెల్సీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు. -
'నయీమ్‌తో నాకెలాంటి సంబంధాలు లేవు'
-
'నయీమ్‌తో నాకెలాంటి సంబంధాలు లేవు'
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో నాకెలాంటి సంబంధాలు లేవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం డీజీపీని కలసిన కర్నె ప్రభాకర్ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... నయీమ్ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కర్నె విజ్ఞప్తి చేసినట్లు కర్నె ప్రభాకర్ తెలిపారు. అంతకుముందు డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మను కర్నెప్రభాకర్ కలిసి.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ విషయంలో నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
'కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుసు'
-
కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుసు: కర్నె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, కాంగ్రెస్ చేసిన మోసాలు తెలంగాణ ప్రజలకు తెలుసని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ కేంద్ర నాయకులు దిగ్విజయ్‌సింగ్, మీరాకుమార్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం తామే 2000 సంవత్సరంలో ఉద్యమాన్ని మొదలు పెట్టామని కాంగ్రెస్ నేతలు చె ప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వలేదని, కేసీఆర్ ఉద్యమ ధాటికి ఇచ్చి తీరాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ మేలిమి బంగారమైతే హైదరాబాద్‌లో ఎందుకు అమ్ముడు పోలేదు. ఇక్కడ నకిలీ అని తేలింది. అందుకే వరంగల్‌లో అమ్మకానికి పెట్టి అక్కడి ప్రజలను మోసం చేస్తారా’ అని సర్వే సత్యనారాయణ అభ్యర్థిత్వంపై కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. -
ఆడంబరంగా ‘నేతి’ ప్రమాణం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు రెండోసారి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్‌లు కూడా సహకరించడంతో మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లా నేతకు రెండోసారి ఈ పదవి చేపట్టే అవకాశం లభించింది. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన నేతి విద్యాసాగర్‌ను సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర మంత్రులు సంప్రదాయ పద్ధతిలో చైర్మన్ స్థానం వరకు తోడ్కొని వచ్చారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులు సాదరంగా ఆయనను డిప్యూటీ చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. రెండోసారి.. నేతి విద్యాసాగర్‌కు వరుసగా రెండోసారి మండలి డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం లభించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఆ పదవి చేపట్టిన ఆయన అనంతరం తెలంగాణ శాసనమండలిలోనూ తొలి డిప్యూటీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నేతి ఇటీవల టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో డిప్యూటీ చైర్మన్ హోదాలోనే ఆయన పనిచేశారు. ఆ సమయంలో మండలిలో ఆయన వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ శాసనమండలి కొలువుదీరిన తొలిరోజు నుంచి ఆయన టీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగి యడం, కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తెలిసిందే. మీ పాత్ర ప్రశంసనీయం: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో నేతి విద్యాసాగర్ పోషించిన పాత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. చైర్మన్ స్థానంలో నేతిని కూర్చోబెట్టిన అనంతరం మండలిలో ఇతర సభ్యులనుద్దేశించి సీఎం మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఎదరుచూసిన రీతిలోనే నేతి విద్యాసాగర్ వ్యవహరించి ఆ సమయంలో తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని ప్రశంసించారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా రాజకీయ సమీకరణల నేపథ్యంలో తనకు రావాల్సిన అవకాశాలు రాకపోయినా నమ్ముకున్న పార్టీలోనే ఉండి సేవ చేయడం నిజంగా గొప్పతనమన్నారు. రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు విద్యాసాగర్ ఎన్నోకష్టాలు పడాల్సి వచ్చిందని, అయినా తన స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగారని అన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, కర్నె ప్రభాకర్‌లు కూడా నేతి విద్యాసాగర్‌ను అభినందించారు. -
ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీలదే అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరుస రైతు ఆత్మహత్యలపై శనివారం హైదరాబాద్‌లో కర్నె ప్రభాకర్ స్పందించారు. కాంగ్రెస్ హయాంలో రైతులను పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు ఆపాల్సిందిపోయి ప్రేరేపించే విధంగా కాంగ్రెస్, టీడీపీలు ప్రకటనలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్బంగా రైతులకు కర్నె ప్రభాకర్ హామీ ఇచ్చారు. -
'త్వరలో డీఎస్సీ ప్రకటన'
మోమిన్‌పేట (రంగారెడ్డి): ప్రస్తుతం 8 వేల విద్యావాలీంటర్లను నియమించి తర్వాత డీఎస్సీ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం జనరల్‌బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీలు ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణకు న్యాయం జరగలేదని వాపోయారు. త్వరలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే భవిష్యత్ అంతా తెలంగాణదే అన్నారు. -
బీజేపీ సర్కార్ తెలంగాణాకు అన్యాయం చేస్తుంది: కర్నె
-
తెలంగాణపై కేంద్రానిది సవతితల్లి ప్రేమ
హైదరాబాద్: తెలంగాణపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన తెలంగాణ బీజేపీ నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరుగుతుందని మోదీ ప్రభుత్వంపై ప్రభాకర్ నిప్పులు చెరిగారు. -
'నిరుద్యోగులకు కానిస్టేబుల్ రాతపరీక్ష'
నారాయణఖేడ్ రూరల్ (మెదక్ జిల్లా): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పోటీ పరీక్షల్లో రాణించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కాకతీయ, వాగ్దేవి పాఠశాలల్లో ఆదివారం జరిగిన పరీక్షా కేంద్రాలను రాములు నాయక్ మెదక్ డీఎస్పీ రాజారత్నంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత కానిస్టేబుల్, ఎస్ఐతోపాటు ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు అవకాశం ఉందన్నారు. -
'చంద్రబాబు ఒత్తిడి తేవడం దుర్మార్గం'
హైదరాబాద్: సెక్షన్ - 8ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం దుర్మార్గమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో కర్నె ప్రభాకర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సెక్షన్ -8 ను టీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని... విభజన బిల్లు రూపకల్పనప్పుడే యూపీఏ పెద్దలకు తమ పార్టీ నేత కేసీఆర్ తెగేసి చెప్పారన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏడాది కాలంగా హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి... ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇబ్బందులు ఉన్నాయనటం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి కార్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒత్తిళ్లకు కేంద్రం సెక్షన్ - 8 అమలు చేస్తుందని టీఆర్ఎస్ భావించడం లేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓ వేళ అదే జరిగితే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రజాక్షేత్రంలో పోరాడుతామని కార్నె ప్రభాకర్ వివరించారు. -
’చంద్రబాబు ఒత్తిడితేవడం దుర్మార్గం’
-
ఫలించిన టీఆర్ఎస్ వ్యూహం
* స్పష్టమైన అంచనాతోబరిలోకి ఐదో అభ్యర్ధి * ఒక్క ఓటూ వృథా కాకుండా ప్లాన్ సాక్షి, హైదరాబాద్: సరైన సంఖ్యా బలం లేకుండా ఐదో అభ్యర్థిని ఎలా పోటీ పెడతారంటూ విపక్ష కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు చేసిన విమర్శలను తిప్పికొడుతూ అధికార టీఆర్ఎస్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులనూ గెలిపించుకుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టమైన అంచనాతో పోటీకి దింపిన ఐదో అభ్యర్థి విజయం వెనక ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించింది. ఎమ్మెల్యేలకు 3 సార్లు మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లు మురిగిపోకుండా, క్రాస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సీపీఐ, సీపీఎం ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో విజేతకు అవసరమైన ఓట్ల సంఖ్య తగ్గిపోవడమూ టీఆర్ఎస్కు కలసి వచ్చింది. దీనికితోడు ఎంఐఎంకు చెందిన ఏడుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో ఐదుగురు అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలం చేకూరింది. ఎమ్మెల్యే కోటా నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే టీఆర్ఎస్ ఒక ప్రణాళికతో ఉంది. ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే 4 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే వీలున్నా ఐదో అభ్యర్థిని పోటీకి పెడుతున్నట్లు ప్రకటించింది. మండలి చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చి తమకు సహకరించిన ముగ్గురికీ టికెట్లు ఇచ్చింది. ఇప్పటికే మంత్రివర్గంలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావులకు టికెట్ ఖరారు చే సింది. ఒక దశలో టీడీపీ కాకుండా ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థిని పోటీకి పెడితే ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టరనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. కానీ టీడీపీ అభ్యర్థి పోటికి దిగడంతో టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని పోటీకి పెట్టింది. దీనికితోడు టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆ పార్టీకి చెందిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు ఎన్నికలకు 2 రోజుల ముందు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం కూడా అధికార పార్టీకి కలసి వచ్చిం ది. సోమవారం జరిగిన పోలింగ్‌లో 118 ఓట్లు పోలవగా విజేతకు 17 (16.86) ఓట్లు అవసరమని తేలింది. ఈ లెక్క ప్రకారమే టీఆర్ఎస్ 85 మంది ఎమ్మెల్యేలతో తొలి ప్రాధాన్య ఓటుతోనే ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకుంది. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకుంది 63 స్థానాలే. కానీ ఆ తర్వాత టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నుంచి నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆ పార్టీలో చేరారు. బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు విలీనం అయ్యారు. దీంతో బలం 76కు పెరిగింది. దీనికితోడు ఎంఐఎం 7, వైఎస్సార్ కాంగ్రెస్ 1 ఎమ్మెల్యే, నామినెటెడ్ ఎమ్మెల్యే మద్దతుతో 85 ఓట్లను సమకూర్చుకుని ఐదుగురిని గెలిపించుకుంది. సీఎంను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ విజేతలు మండలి ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం రాత్రి మంత్రులు నాయిని, ఈటల, మరికొందరు ఎమ్మెల్యేలతో కలసి సీఎం కేసీఆర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విజేతలకు కేసీఆర్ అభినందనలు తెలపగా తమకు అవకాశం కల్పించి, ఎన్నికల్లో గెలిపించినందుకు నూతన ఎమ్మెల్సీలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
'టీడీపీ నేతలకు మురికి పట్టింది.. క్లీన్ చేస్తాం'
హైదరాబాద్: టీ టీడీపీ నేతలకు మురికి పట్టింది.... స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వారిని కూడా క్లీన్ చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. సాగునీటిపై త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పథకం ప్రకటిస్తారని తెలిపారు. జూన్ 2 లోగా రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమంపై టీ టీడీపీ నేతలు విమర్శులు గుప్పిస్తున్నారు. -
రేవంత్ రెడ్డికి లగడపాటికి పట్టిన గతే పడుతుంది
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... యాత్రల పేరిట కాంగ్రెస్, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీ.టీడీపీ నేతలు బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే భవిష్యత్తులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు.