టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు ఏం మేలు చేశాయో చెప్పాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నోముల నర్సింహయ్య, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు.కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వంపై ఓర్వలేనితనంతోనే విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదని ధ్వజ మెత్తారు. ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలని హితవు పలికారు. అది మరిచిపోయి, కేవలం రాజకీయం కోసమే విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలన్నీ పూర్తిగా పొలిటికల్ స్టంట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకేం చేశాయో చెప్పాలి
Published Wed, Oct 26 2016 2:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement