
తెలంగాణపై కేంద్రానిది సవతితల్లి ప్రేమ
హైదరాబాద్: తెలంగాణపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన తెలంగాణ బీజేపీ నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరుగుతుందని మోదీ ప్రభుత్వంపై ప్రభాకర్ నిప్పులు చెరిగారు.