హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీలదే అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరుస రైతు ఆత్మహత్యలపై శనివారం హైదరాబాద్లో కర్నె ప్రభాకర్ స్పందించారు. కాంగ్రెస్ హయాంలో రైతులను పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు.
రైతుల ఆత్మహత్యలు ఆపాల్సిందిపోయి ప్రేరేపించే విధంగా కాంగ్రెస్, టీడీపీలు ప్రకటనలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్బంగా రైతులకు కర్నె ప్రభాకర్ హామీ ఇచ్చారు.