అతివేగం: అసెంబ్లీ గేట్‌ని ఢీకొట్టిన వాణి దేవి కారు | TRS MLC Vani Devi Car Met Accident At Assembly Gate No 8 | Sakshi
Sakshi News home page

అతివేగం: అసెంబ్లీ గేట్‌ని ఢీకొట్టిన వాణి దేవి కారు

Published Thu, Mar 25 2021 10:23 AM | Last Updated on Thu, Mar 25 2021 10:51 AM

TRS MLC Vani Devi Car Met Accident At Assembly Gate No 8 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వాణి దేవి కారు ప్రమాదానికి గురయ్యింది. అసెంబ్లీ గేట్‌ నెం-8 వద్ద ఆమె కారు అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి గురువారం అసెంబ్లీలో  స్పీకర్‌ను కలవడానికి వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేట్ నం 8 దగ్గర పార్కింగ్ ప్లేస్‌లో ఆమె ఇన్నొవా కారు కంట్రోల్ కోల్పోయి అతి వేగంగా వచ్చి గేట్‌ను గుద్దుకుంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో వాణి దేవి కారులో లేకపోవండతో ఆమెకు ప్రమాదం తప్పింది. 

ప్రమాదం జరిగిన గేటు​ వద్ద నిత్యం పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. డ్రైవర్ తీయాల్సిన వాహనాన్ని గన్‌మెన్‌ తీయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకాక గన్‌మెన్‌కి డ్రైవింగ్‌ సరిగ్గా రాకపోవడంతోనే ఈ  ప్రమాదం జరిగిందని భద్రతా సిబ్బంది తెలిపారు.

చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement