Surabhi Vani Devi
-
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న
-
ప్రకృతి రమణీయత.. హార్ట్‌ను తట్టిన ఆర్ట్
ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టారు. పల్లెసీమలను కుంచె నుంచి ముంచెత్తారు. చిత్రకారులు దృశ్య మాలికలను గుదిగుచ్చారు. చూపరుల కళ్లను మురిపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సాలార్జంగ్ మ్యూజియం, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సంయుక్తాధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ ద హార్ట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రారంభించారు. ఇక్కడ 140 విభిన్నమైన చిత్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి, సీఐఎస్ఎఫ్ డీఐజీ శ్యామల, జేఎన్‌ఏఎఫ్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కవిత, ఇంటాక్ కన్వీనర్ అనురాధ రెడ్డి, ఆర్గనైజింగ్ అధ్యక్షులు రమణా రెడ్డి, అనిత, మ్యూజియం కీపర్లు నరేందర్, డాక్టర్ కుసుం, చింతమల శ్రీనివాస్ పాల్గొన్నారు. – బహదూర్‌పురా -
సురభి వాణి దేవి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
-
పీవీ కూతురికి కీలక పదవి..!
హైదరాబాద్: శాసనమండలి ‘హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సురభి వాణీదేవికి ప్రాధాన్యతగల పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఉన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన కుటుంబానికి మరింత గుర్తింపు దక్కేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ముగియనుంది. దీంతో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల నుంచి ఇద్దరు నేతలు తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్‌గా పీవీ కుమార్తె, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ గుత్తా సుఖేందర్‌రెడ్డిని తిరిగి మండలికి నామినేట్ చేసే పక్షంలో డిప్యూటీ చైర్మన్ పదవి వాణీదేవికి లభించే సూచనలున్నాయి. సామాజికవర్గ సమీకరణాల లెక్కలపరంగా చూస్తే బ్రాహ్మణ/కరణం సామాజికవర్గం నుంచి శాసనమండలిలో పురాణం సతీష్, శాసనసభలో వొడితెల సతీష్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన సురభి వాణీదేవికి మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని అప్పగిస్తే ఆ సామాజికవర్గానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. పీవీ కుటుంబానికి మరింత గుర్తింపు కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆ పార్టీ తగిన గుర్తింపునివ్వలేదని గతంలో విమర్శించిన సీఎం కేసీఆర్... పీవీ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం కూడా చేశారు. దీంతోపాటు హైదరాబాద్‌లో పీవీ స్మారకం అభివృద్ధి, త్వరలో అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఆవిష్కరణ, ఢిల్లీ తెలంగాణ భవన్లో కాంస్య విగ్రహం ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాణీదేవిని మండలి చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవిని పీవీ శతజయంతి సందర్భంగా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. వాణీదేవి ప్రస్తుతం కరోనా బారినపడటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆమె వచ్చే నెల ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. -
ఎమ్మెల్సీ సురభివాణికి కరోనా పాజిటివ్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కరోనా బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో తనకు కోవిడ్ నిర్ధారణ అయ్యిందని ఆమె ఆదివారం రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హోం ఐసోలేషన్‌తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. అయితే ఈనెల 20న వాణి దేవి సీఎం కేసీర్‌ను కలిశారు. హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం కృతజ్ఞతలు తెలిపేందుకు కేసీఆర్‌ను కలిశారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున సురభి వాణిదేవి గెలుపొందిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో మాజీ ప్రధాని పీవీ కూతురును టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ బరిలోకి దింపిన కేసీఆర్. అనుకున్నట్టే ఆమెను గెలిపించి హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో తమకు పట్టు సడలలేదని నిరూపించారు. చదవండి: మా గ్రామ ప్రజలు నోటుకు అమ్ముడుపోరు! నేను పక్కా పల్లెటూరి వాడిని..: ఐఏఎస్ -
అతివేగం: అసెంబ్లీ గేట్‌ని ఢీకొట్టిన వాణి దేవి కారు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణి దేవి కారు ప్రమాదానికి గురయ్యింది. అసెంబ్లీ గేట్ నెం-8 వద్ద ఆమె కారు అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ను కలవడానికి వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేట్ నం 8 దగ్గర పార్కింగ్ ప్లేస్‌లో ఆమె ఇన్నొవా కారు కంట్రోల్ కోల్పోయి అతి వేగంగా వచ్చి గేట్‌ను గుద్దుకుంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో వాణి దేవి కారులో లేకపోవండతో ఆమెకు ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన గేటు వద్ద నిత్యం పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. డ్రైవర్ తీయాల్సిన వాహనాన్ని గన్‌మెన్ తీయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకాక గన్‌మెన్‌కి డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భద్రతా సిబ్బంది తెలిపారు. చదవండి: మేం నేర్పిన చదువు ఇదేనా: వాణిదేవి అసహనం