సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కరోనా బారిన పడ్డారు. ఆర్‌టీపీసీఆర్ టెస్టులో తనకు కోవిడ్ నిర్ధారణ అయ్యిందని ఆమె ఆదివారం రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హోం ఐసోలేషన్‌తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
అయితే ఈనెల 20న వాణి దేవి సీఎం కేసీర్‌ను కలిశారు. హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం కృతజ్ఞతలు తెలిపేందుకు కేసీఆర్‌ను కలిశారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరుపున సురభి వాణిదేవి గెలుపొందిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో మాజీ ప్రధాని పీవీ కూతురును టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ బరిలోకి దింపిన కేసీఆర్. అనుకున్నట్టే ఆమెను గెలిపించి హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో తమకు పట్టు సడలలేదని నిరూపించారు.
చదవండి:
మా గ్రామ ప్రజలు నోటుకు అమ్ముడుపోరు!
నేను పక్కా పల్లెటూరి వాడిని..: ఐఏఎస్
Comments
Please login to add a commentAdd a comment