ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టారు. పల్లెసీమలను కుంచె నుంచి ముంచెత్తారు. చిత్రకారులు దృశ్య మాలికలను గుదిగుచ్చారు. చూపరుల కళ్లను మురిపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సాలార్‌జంగ్ మ్యూజియం, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సంయుక్తాధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ ద హార్ట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రారంభించారు.
ఇక్కడ 140 విభిన్నమైన చిత్రాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సాలార్‌జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి, సీఐఎస్‌ఎఫ్ డీఐజీ శ్యామల, జేఎన్‌ఏఎఫ్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కవిత, ఇంటాక్ కన్వీనర్ అనురాధ రెడ్డి, ఆర్గనైజింగ్ అధ్యక్షులు రమణా రెడ్డి, అనిత, మ్యూజియం కీపర్లు నరేందర్, డాక్టర్ కుసుం, చింతమల శ్రీనివాస్ పాల్గొన్నారు.
– బహదూర్‌పురా
Comments
Please login to add a commentAdd a comment