
'టీడీపీ నేతలకు మురికి పట్టింది.. క్లీన్ చేస్తాం'
టీడీపీ నేతలకు మురికి పట్టింది.... స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వారిని కూడా క్లీన్ చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: టీ టీడీపీ నేతలకు మురికి పట్టింది.... స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వారిని కూడా క్లీన్ చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు.
సాగునీటిపై త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పథకం ప్రకటిస్తారని తెలిపారు. జూన్ 2 లోగా రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమంపై టీ టీడీపీ నేతలు విమర్శులు గుప్పిస్తున్నారు.