TTDP Leaders
-
టీఆర్ఎస్ను భూస్థాపితం చేసేందుకే బీజేపీలో చేరిక
సాక్షి, నల్లగొండ: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసేందుకే బీజేపీలో చేరుతున్నట్లు టీడీపీ నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి రజినీ కుమారి పేర్కొన్నారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో దొరల పెత్తనం లేని రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ దొర పెత్తనంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లో జరిగే బీజేపీ సభలో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా, డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నియోజకవర్గ ఇన్చార్జిలంతా బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ చేపడుతున్న అభివృద్ధిని చూసి దేశ వ్యాప్తంగా ప్రజలు మరోసారి ఆదరించి 330 స్థానాలు అప్పగించారన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల తరపున తగిన గుణపాఠం చెప్తామన్నారు. టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ఆంధ్రాపార్టీగా ముద్ర వేశారని, తిప్పి కొట్టడంలో నాయకత్వం విఫలమైందన్నారు. అనంతరం రాజీనామా లేఖలను విడుదల చేశారు. ఈ సమావేశంలో సాగర్, దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి కడారి అంజయ్య, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి సాధినేని శ్రీనివాస్‌రావు, ఎస్టీ సెల్‌రాష్ట్ర నాయకులు బాబూరావు, వెంకటేశ్వర్రావు, పోలె రామచంద్రం, ఐతరాజు మల్లేశ్ పాల్గొన్నారు. -
ప్రచారానికి రండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టీటీడీపీ నేతలు కోరారు. ఈమేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌లు గురువారం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఆయన్ను కలిశారు. ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘కథానాయకుడు’సినిమా షూటింగ్లో ఉన్న బాలయ్యతో గంటకు పైగా చర్చించారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించాలని, టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటు చేయనున్న కూటమి ప్రయత్నాలను కూడా ఆయనకు వివరించారు. -
సీఎం పర్యటన: టీడీపీ నాయకుల నిర్బంధం
సాక్షి, యాదగిరిగుట్ట: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్ట మండలం కాచారంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి, మల్లాపురంలో టీడీపీ ఉమ్మడిజిల్లా కార్యదర్శి పల్లెపాటి బాలయ్య, పలువురు టీడీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దందమల్ల నీటి తరలింపు విషయంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వకపోతే సీఎం పర్యటనను అడ్డుకుంటాని ఇటీవల శోభారాణి ప్రకటించారు. కాగా, సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్నఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. -
రేవంత్ ఎఫెక్ట్.. టీటీడీపీ కీలక సమావేశం!
-
రాజీనామాలు చేశాకే రాజ్‌భవన్‌కు!
-
ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ధర్నా
రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలి ఓరుగల్లు ప్రజలే కేసీఆర్ మెడలు వంచుతారు నకిలీ విత్త్తన కంపెనీలపై చర్యలేవి టీటీడీపీ నేతలు వరంగల్: రాష్ట్రంలో అకాల వర్షాలతో, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ అధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ధర్నా, ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు కష్టాలు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయ నిర్లక్ష్యం, విత్తన కంపెనీలపై ప్రభుత్వ అజామారుుషీ లేక పోవడంతోనే హైబ్రిడ్ పేరుతో నాణ్యతలేని నకిలీ మిర్చి విత్తనాలను డీలర్లు రైతులకు అంటగడుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలపై పూర్తి స్థారుులో విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అధికారులు నకిలీ విత్తనాలపై అందజేసిన నివేదకలను ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. అనంతరం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట ఏర్పాటు ఉద్యమంలో ముందుండి పోరాడిన ఓరుగల్లు ప్రజలే హామీలతో గద్దెనెక్కి పట్టించుకోని సీఎం కేసీఆర్ వంచుతారన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ చెబుతున్నారని ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను అపహాస్యం చేయడం తగదు...రేవూరి రైతు సమస్యలు. ఇతర విషయాలపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను అపహస్యం చేయడం సీఎంకు తగదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాల కంపెనీలపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకోవాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సీతక్క డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో దెబ్బతిన పంటలకురూ.25వేల చొప్పున, నకిలీ విత్తనాలతో మోస పోరుున రైతులకు ఎకరాలకు రూ.40వేల చొప్పున పరిహారం అందించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కార్యక్రమంలో వేం నరేందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, చిలుక మధుసూదన్, జాటోతు ఇందిర, గట్టు ప్రసాద్‌బాబు, గన్నోజు శ్రీనివాసచారి, రాంచంద్రునాయక్, తుళ్లూరు బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ హామీలపై పోరాడాలి
టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా అంతకుముందు టీఆర్ఎస్ నేతగా కేసీఆర్ ఇచ్చిన హామీలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని టీటీడీపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ నిర్వహించిన భూమికను ఆధారాలు, వివరాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న 27 జిల్లాలకు అవసరమైన నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర నాయకులను ఆదేశించారు. ఇకపై పార్టీ కార్యాలయాల్లోనే సమావేశాలు పెట్టుకుందామన్నారు. శనివారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చంద్రబాబుతో టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీ గరికపాటి రామ్మోహనరావు, ఇ.పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావు సమావేశమయ్యారు. తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేసేలా, వాటిలో గెలిచేలా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు. ఇటీవల సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలను గురించి చంద్రబాబుకు పార్టీ నాయకులు తెలియజేశారు. ఉప ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలకు పార్టీ ఎందుకు పోటీచేయలేదని వారిని ఆయన ప్రశ్నించారు. మోత్కుపలి నర్సింహులు గవర్నర్ అవుతున్నారంటే బలహీనవర్గాల అభ్యున్నతికి టీడీపీ తీసుకుంటున్న చొరవ, ప్రోత్సాహమే కారణమన్నారు. -
ప్రజాసమస్యలపై పోరాటాలు సాగించాలి
టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి * రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా విభాగం పోరాటాలను సాగించాలని తెలంగాణ టీడీపీ నాయకులు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వం మెడలు వంచాలని, గతంలో మహిళా విభాగం చేసిన పోరాటాలు ఫలప్రదం అయ్యాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ బతుకమ్మ, బోనాలకే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంతవరకు మహిళలకు ప్రాతినిధ్యమే కల్పించకపోవడం దారుణమన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళా నేతలు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి మాట్లాడుతూ మహిళా విభాగాన్ని బలోపే తం చేసి, సమస్యలపై సమరాన్ని సాగించడానికి సమాయత్తమవుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. కాగా, శాసనసభ్యులకు లక్షల్లో జీతాలు చెల్లిస్తూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాల చెల్లింపు నిలిపివేయడం సిగ్గుచేటని టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. -
'విజయవాడ వెళ్లిపోవాలి.. లేదా టీడీపీ వీడాలి'
నిజామాబాద్ : రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు. గురువారం నిజామాబాద్‌లో హరీష్‌రావు విలేకర్లతో మాట్లాడుతూ... టీటీడీపీ నేతలు విజయవాడ వెళ్లిపోవాలి... లేదా టీడీపీని వీడాలని సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు చెరువు పనుల పేరుతో... కాంట్రాక్టుల జేబులు నింపారని విమర్శించారు. -
'పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేను'
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. నాయకులు పోయినా పార్టీ మాత్రం పోదని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీని వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి... అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నామని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకరిద్దరు పోయినంత మాత్రన పార్టీకీ ఏమాత్రం నష్టం ఉందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటేనే నాయకత్వం ఎదుగుతోందన్నారు. జరుగుతున్న పరిణామాలకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తెలిపారు. సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొనే పార్టీ టీడీపీ ఒక్కటే అని చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. -
కళ్లు మూసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతోందని, తెలంగాణ పట్ల ఇది మరో బాబ్లీ కానుందని టీటీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు మరో 5 మీటర్లు పెరిగిందంటే చాలు, కృష్ణా నదిలో చుక్క నీరు తెలంగాణకు అందందని, ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని పేర్కొన్నారు. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకున్నారని విమర్శించారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై టీఆర్ఎస్ నేతలు నోరు కూడా మెదపడం లేదని ఆరోపించారు. దీనిపై త్వరలోనే ప్రధానిని కలుస్తామని చెప్పారు. -
ఉనికి కోసం టీటీడీపీ పాట్లు!
'ఓటుకు కోట్లు'పై నష్ట నియంత్రణ చర్యల్లో నేతల పిల్లిమొగ్గలు జిల్లాల పర్యటనలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం పర్యటనలకు దూరంగా కొందరు నేతలు సాక్షి, హైదరాబాద్: వలసలతో చిక్కి శల్యమైన తెలంగాణ టీడీపీ ఉనికి కోసం నానా తంటాలు పడుతోంది. 'ఓటుకు కోట్లు' కేసుతో పార్టీ పరువు బజారున పడటం, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికార టీఆర్ఎస్లోకి వరుస కట్టడంతో క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినడం వంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు టీటీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టింది. తద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆయా సమస్యలపై జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించడం లేదని, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడంలేదని వరంగల్‌లో టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఒక రోజు దీక్ష చేశారు. తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో సైతం పర్యటించారు. తోట పల్లి రిజర్వాయరు నిర్మాణం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ముగ్గురు నాయకులే యాత్ర చేసి వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ‘ పాలమూరు - రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం చెబుతూ ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తమ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల గురించి టీడీపీ ఊదరగొట్టింది. అయినా పాలమూరు జిల్లా ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడిందని భావించిన టీటీడీపీ నాయకులు గురువారం ఆ జిల్లాలో కూడా పర్యటించారు. ఒక వైపు ప్రభుత్వ తీరును విమర్శిస్తూనే, తాము చేపట్టిన ప్రాజెక్టులు, వెచ్చిం చిన నిధుల వివరాలను వల్లెవేయడం మొదలు పెట్టారు. అయితే ఇంతా చేస్తున్నా, తెలంగాణ నాయకత్వానికి సొంత పార్టీలోని సీనియర్ల నుంచే ఆదరణ కరువైంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నేత మోత్కుపల్లి నర్సింహులు , ఇతర నేతలు వీరి పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో తెలంగాణకు కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ నేతలు వేస్తున్న పిల్లిమొగ్గలు ఆసక్తి కలిగిస్తున్నాయని అభిప్రాయ పడుతున్నారు. -
బాబు గల్ల పట్టుకోకుండా.. మాపై విమర్శలా!
టీటీడీపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు గల్లపట్టుకుని ప్రశ్నించకుండా.. తెలంగాణ టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతూ చంద్రబాబు లేఖలు రాశారని, మరోవైపు టీటీడీపీ నేతలు పాద యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా, సూచనలు చేయకుండా విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. కేవలం తమ ఉనికి చాటుకోవడానికే ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు దాచిపెట్టి పాదయాత్రలు చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వీరికి తోడు మరో వైపు కాంగ్రెస్ నాయకులు కూడా వాస్తవాలు మరిచిపోయి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయి, తట్టుకోలేక పోతున్న కాంగ్రెస్ నేతలంతా తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. -
ఆగస్టు 5న వరంగల్‌లో దీక్ష: టీటీడీపీ నేతలు
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై టీ టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి గురువారం హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణాలు మాఫీ కాక, వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదని వారు ఆరోపించారు. రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్... పేదల ఇళ్లు నిర్మాణాల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఏడాదిగా బిల్లులు చెల్లించకపోవడంతో పేదలు అప్పుల బారిన పడుతున్నాని ఎర్రబెల్లి, రమణ, రావుల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5వ తేదీన వరంగల్‌లో దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా ప్రజా సమస్యలపై దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని ఎర్రబెల్లి, రమణ, రావుల స్పష్టం చేశారు. -
కేసీఆర్ సర్కారుపై పోరాడండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో అన్నారు. బుధవారం టీటీడీపీ నాయకులతో చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై పోరాడాలని వీరికి సూచించారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తలపెట్టిన ఆందోళనల మీద విస్తృతంగా చర్చ జరిగింది. వచ్చే నెల 12న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ విస్తృత సమావేశం నిర్వహించాలని, అన్ని స్థాయిల్లో కమిటీల నియామకాలు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసి, ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని సీఎం కేసీఆర్, మంత్రులు చేస్తున్న ఆరోపణలను టీటీడీపీ నేతలు బాబు దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆయన, కేసీఆర్ ప్రతీ అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని, ఎన్టీఆర్ హైదరాబాద్‌కు ఉదయం నిద్రలేవడం నేర్పారని చేసిన వ్యాఖ్యలనూ ఇదే రీతిలో వివాదం చేశారని, తాను మాట్లాడిన మాటల్లో తప్పేముందని పేర్కొన్నట్లు సమాచారం. హైదరాబాద్ అభివృద్ధిలో అసలు కేసీఆర్ పాత్ర ఏముందని కూడా బాబు ప్రశ్నించినట్లు తెలిసింది. తెలుగుదేశం పాలనలోనే తెలంగాణలో వివిధ దశల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్లు ఊడ్పించడం తన హయాంలోనే మొదలైందని అన్నట్లు సమాచారం. కాగా, త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటు, వరంగల్ లోక్‌సభా స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని బాబు సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలిపోతుందని, ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందని కూడా బాబు అభిప్రాయ పడినట్లు తెలిసింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి తదితరులు భేటీలో పాల్గొన్నారు. -
'తలసాని వ్యవహారంలో చర్యలు తీసుకుంటా'
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారంలో చర్యలు తీసుకుంటానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, తలసాని మంత్రి పదవి రెండు అంశాలు ఉన్నాయన్నారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని గవర్నర్ వారికి వివరించారు. టీటీడీపీ నేతలు తలసాని, ఇతర ఎమ్మెల్యేల వ్యవహారం అంశాలపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ ను కలిశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై వెంటనే చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని టీటీడీపీ నేతలు గవర్నర్ నరసింహిన్ ను కోరారు. టీటీడీపీ నేతలు తలసాని వ్యవహారంపై ఫిర్యాదుచేయడానికి గవర్నర్ వద్దకు వెళ్లారు. తన పదవికి రాజీనామా చేశానని తలసాని చెబుతున్నారని, రాజీనామా తమ వద్దకు రాలేదని అసెంబ్లీ కార్యదర్శి స్పష్టంచేశారని వారు గవర్నర్ కు వివరించారు. అబద్దాలు చెప్పి మిమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించి తలసాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కోరినట్లు టీడీపీ నేతల బృందం తెలిపింది. -
'టీటీడీపీ నేతలు తోక ముడిచారు'
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై చర్చకు రాకుండ టీడీపీ నేతలు తోక ముడిచారని తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ నేతల రాకకోసం జూపల్లి కృష్ణారావు బుధవారం దాదాపు గంటపాటు నిరీక్షించారు. అయినా టీటీడీపీ నేతలు రాకపోవడంతో జూపల్లి కృష్ణారావు స్పందించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తమని ఆయన స్పష్టం చేశారు. పాలమూరులోని నాలుగు ప్రాజెక్టులకు చంద్రబాబు హయాంలో రూ. 10 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. టీడీపీ నేతలు బహిరంగ చర్చకు వస్తే ఈ అంశాలు నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో లేదా హైదరాబాద్‌లోని ఏ ఫంక్షన్ హాల్లోనైనా మీడియా సమక్షంలో టీటీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కలసి రాని టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిలో అడ్డుపడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వేళ టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రాకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం లేదని చంద్రబాబుతో లేఖ రాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఉంటా ... నేతలెవరొచ్చినా...
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి అసెంబ్లీ కమిటీ హాల్లో ఉంటానన్నారు. టీడీపీ నేతలెవరొచ్చినా తాను చర్చకు సిద్ధమని జూపల్లి వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు తాను కట్టుబడి ఉంటానని గతంలో తాను పేర్కొన్న విషయాన్ని జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిధులు వెచ్చించినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జూపల్లి కృష్ణారావు ఆదివారం బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ కమిటీ హాలులో జులై 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ తేదీలు, ఈ సమయం ఓ వేళ మీకు అసౌకర్యంగా ఉంటే మీరు నిర్ణయించే సమయానికి ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటామని జూపల్లి తెలిపారు. కాగా పాలమూరు ప్రాజెక్టుల విషయంలో మంత్రి జూపల్లి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
టీటీడీపీ నేతలు.. గప్‌చుప్
-
టీటీడీపీ నేతలు.. గప్‌చుప్
తాజా పరిణామాలపై ఆందోళన ఏపీ మంత్రుల తీరుపై అసంతృప్తి అధినేత చంద్రబాబుతో భేటీ అంతర్మథనంలో తెలంగాణ టీడీపీ నేతలు సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' వ్యవహారం బయటపడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలకు ఎటూ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గెలుపు అవకాశమే లేని మండలి ఎన్నికల బరిలోకి దిగి బొక్కాబోర్లా పడిన ఆ పార్టీ నేతలు దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సైతం తెలంగాణ టీడీపీని బలోపేతం చేయడంపై కాకుండా.. తన ఇమేజ్ను కాపాడుకునేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తుండడం వారికి మింగుడు పడడం లేదు. దీంతో వారు తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారం, తాజా రాజకీయ పరిణామాలపై తమ అనుమానాలను నివృత్తి చే సుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు టీటీడీపీ నేతలు కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ రాలేదు. చివరకు మరోసారి గట్టిగా ప్రయత్నించి సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తారస్థాయికి అసంతృప్తి..! బాబుతో పాటు, ఏపీ మంత్రులెవరూ కూడా తెలంగాణ టీడీపీ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తుండడంపై టీటీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఓటుకు కోట్లు' కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేస్తున్న పనులు, లేవనెత్తుతున్న అంశాలు తమకు సమస్యగా మారాయన్న అభిప్రాయం వారిలో నాటుకుపోయింది. అసలు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారుచేసే సమయంలోనే తెలంగాణ టీడీపీలోని రెండు వర్గాలు ఎలా గెలుస్తామంటూ వాదులాడుకున్నాయని ప్రచారంలో ఉంది. అలాంటిది గెలవని సీటు కోసం అభ్యర్థిని పెట్టడం, బాబు స్టీఫెన్ సన్తో ఫోన్లో మాట్లాడి దొరికిపోవడంతో టీ టీడీపీ నేతలు ఇరకాటంలో పడిపోయారు. ఈ పరిణామాలపై నోరు విప్పలేక మౌనం పాటిస్తున్నారు. దీనికితోడు బాబు సెక్షన్-8 వివాదాన్ని లేవనెత్తడంతో దాన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియక ఆత్మరక్షణలో పడిపోయారు. ఏమంటే ఏమవుతుందో? తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు, ఇష్టానుసారం మాట్లాడుతున్న తీరు తమకు ఇబ్బందికరంగా మారిందని టీటీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇక్కడ తెలంగాణలో తమ పరిస్థితి, పార్టీ భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు 'ఓటుకు కోట్లు' కేసులో రేవంత్‌ను, బాబును వెనకేసుకొచ్చేందుకు టీటీడీపీ నాయకులు కొంత ప్రయత్నించారు. తమను పార్టీ మారాల్సిందిగా టీఆర్ఎస్ నాయకత్వం బెదిరించిందంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు కూడా. కానీ ఈ కేసులో ఎమ్మెల్యేను ఏపీ ప్రభుత్వం రక్షిస్తున్న తీరు, నిందితుడు మత్తయ్యకు ఏపీలో షెల్టర్ ఇవ్వడం వంటి చర్యలతో తామేమీ మాట్లాడలేకపోతున్నామని తెలంగాణ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ కేసులో పరిణామాలు తమకు చుట్టుకుంటాయేమోనన్న ఆందోళనలోనూ కొంద రు నేతలు ఉన్నారు. ఇలా మొత్తంగా తెలంగాణ టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబుతో టీ టీడీపీ నేతల భేటీ తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేతలు సోమవారం భేటీ అయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర నేతలు బాబుతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వీరి మధ్య ప్రధానంగా 'ఓటుకు కోట్లు' కేసుతో పాటు ప్రస్తుత పరిణామాలు, వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ స్థానం ఎన్నికపై టీ టీడీపీ నేతలు ఇప్పటికే తమ మిత్రపక్షం బీజేపీ నేతలతో చర్చించిన నేపథ్యంలో.. ఆ చర్చల సారాంశాన్ని సోమవారం బాబుకు వివరించినట్లు సమాచారం. అయితే ఆదివారమే వారు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోమవారం కలసి వివిధ అంశాలపై చర్చించారు. -
టీటీడీపీ నేతలతో బాబు భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో చంద్రబాబు టీటీడీపీ నేతలతో చర్చలు జరిపారు. ఓటుకు కోట్లు కేసు బయటపడిన తర్వాత చంద్రబాబు తరచూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. -
చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. శనివారం రాత్రి సచివాలయంలో చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో ఎమ్మెల్యేలు గాంధీ, వివేక్, ప్రకాశ్ గౌడ్, ఎంపీ మల్లారెడ్డితో తదితరులు ఉన్నారు. ఓటుకు కోట్లు కేసు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఉన్నతాధికారులు, పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
'కొత్త ప్రాజెక్టులంటూ టీఆర్ఎస్ పబ్బం'
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రాజెక్టులంటూ పబ్బం గడుపుతోందని టీటీడీపీ నేతలు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బాబ్లీ ప్రాజెక్టు ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులపై టీఆర్ఎస్ శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 75 శాతం పూర్తి అయని ప్రాజెక్టులకు ముందుగా నిధులు కేటాయిస్తే.. ఏడాదిలో పూర్తయి లక్ష ఎకరాలకు నీరందే అవకాశం ఉందని వారు సూచించారు. వాటన్నింటిని గాలికి వదిలేసి కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని.. ఆ నెపంతోనే టీఆర్ఎస్ కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా తెచ్చి ఐదేళ్లలో పూర్తి చేస్తామని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని గాలికొదిలేశారని మండిపడ్డారు. వాటర్ గ్రిడ్, ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్సీ ప్రాజెక్టు ఎడారి అయ్యేందుకు సీఎం కేసీఆరే కారణమని వారు ఆరోపించారు. ప్రాజెక్టుల పని ఆగితే వాటిని టీడీపీ అడ్డుకుంటోందని మాట్లాడటం సమంజసం కాదన్నారు. -
డీజీపీతో టీటీడీపీ నేతల భేటీ
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు డీజీపీ అనురాగ్ శర్మతో సమావేశమయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర టీడీపీ నేతలు డీజీపీని కలిశారు. రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసులో ఇరికించారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్‌ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో స్టీఫెన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. -
'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలి'
హైదరాబాద్: అసెంబ్లీ కార్యదర్శి అధికార పార్టీ టీఆర్ఎస్కి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీటీడీపీ నేతలు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఎమ్మెల్యేల జాబితాలో నామినేటెడ్ ఎమ్మెల్యేను ఎలా చేరుస్తారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెన్నమనేని రమేష్‌కు ఓటు హక్కులేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ గురువారమే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రిటర్నింగ్ అధికారికి డైరెక్షన్స్ ఇవ్వాలంటూ ఈసీని కోరినట్లు తెలంగాణ టీడీపీ నేతలు వెల్లడించారు. -
'టీడీపీ నేతలకు మురికి పట్టింది.. క్లీన్ చేస్తాం'
హైదరాబాద్: టీ టీడీపీ నేతలకు మురికి పట్టింది.... స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వారిని కూడా క్లీన్ చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేతలకు హితవు పలికారు. సాగునీటిపై త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పథకం ప్రకటిస్తారని తెలిపారు. జూన్ 2 లోగా రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమంపై టీ టీడీపీ నేతలు విమర్శులు గుప్పిస్తున్నారు. -
ఆర్టీసీ సమ్మెపై టీడీపీ రెండు నాల్కల దోరణి
-
'టీటీడీపీ సభ్యులకు క్లారిటీ లేదు'
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలవి అంతా డ్రామాలేనని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ...టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని తెలిపారు. టీడీపీ సభ్యులకు క్లారిటీ లేదని ఆరోపించారు. సభ ప్రారంభానికి ముందే తీర్మాన నోటీసు ఇవ్వాలని తెలియదా అని ఆయన టీటీడీపీ సభ్యులను ప్రశ్నించారు. టీటీడీపీ నేతలు... సీఎల్పీనేత జానారెడ్డి వద్దకు వెళ్లి అభాసుపాలైయ్యారని విమర్శించారు. -
స్పీకర్ కార్యాలయంలో టీడీపీ నేతల బైఠాయింపు
తెలంగాణ స్పీకర్ కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం 9 గంటల నుంచి నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా 3 అంశాలపై స్పష్టత ఇవ్వాలని తాము స్పీకర్ మధుసూదనాచారిని కోరామని టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపు, పార్టీ మారిన నేతలపై అనర్హత వేటుతో పాటు.. గవర్నర్ ప్రసంగం సమయం నాటి అసెంబ్లీ ఫుటేజి ఇవ్వాలని తాము స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. సీట్ల కేటాయింపుపై బుధవారం నాడు స్పష్టత ఇస్తామని స్పీకర్ తెలిపారని, అయితే ఫుటేజి మాత్రం ఇచ్చేది లేదన్నారని ఆయన వివరించారు. అనర్హత విషయం తేల్చేందుకు సమయం పడుతుందని స్పీకర్ సమాధానం ఇచ్చినట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ రెండు అంశాలపైనా కూడా స్పష్టత ఇచ్చేంతవరకు తాము స్పీకర్ కార్యాలయంలోనే బైఠాయిస్తామన్నారు. -
అల్లుడు, కొడుక్కి పెద్దపీట: ఎర్రబెల్లి
-
స్వైన్‌ఫ్లూను అరికట్టలేదు కాని... హెలికాప్టర్ అంబులెన్స్‌లలో...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై టీటీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా వాస్తవాలు బయటపడ్డాయన్నారు. రాష్ట్రంలో విజృంభించిన స్వైన్ ఫ్లూను అరికట్టలేదు కాని... హెలికాప్టర్ అంబులెన్స్‌లో వైద్యం అందిస్తామని అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామనే... జాతీయగీతం అడ్డంపెట్టుకుని మా గొంతు నొక్కారని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ... కేబినెట్లోనే కాదు నిధుల కేటాయింపులో కూడా మహిళలకు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించిన ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మండలిలో టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశామనడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షపార్టీ లేకుండా గతంలో ఎన్నడూ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టి అల్లుడు, కొడుక్కి పెద్దపీట వేశారని ఆరోపించారు. డబ్బులు రావని పాత ప్రాజెక్ట్‌లు పక్కన పెట్టి... కొత్త ప్రాజెక్టులు బడ్జెట్లో చేర్చారని విమర్శించారు. కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ ఉందని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. విద్యార్థులు, అమరవీరులు, రైతు ఆత్మహత్యలపై బడ్జెట్లో ప్రస్తావనే లేదని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. -
'కేసీఆర్ సీఎం కావడమే తెలంగాణకు దోషం'
-
'కేసీఆర్ సీఎం కావడమే తెలంగాణకు దోషం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వాస్తు దోషం లేదని.. కేసీఆర్ సీఎం అవ్వడమే పెద్ద దోషమని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నిజాం వారసునిగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం టీటీడీపీ నేతలంతా హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని సందర్శించారు. సచివాలయానికి వాస్తు దోషం ఉందంటూ చెస్ట్ ఆస్పత్రిని తరలించటం సబబు కాదని వారు మండిపడ్డారు. ఈ ఆస్పత్రిని ఎర్రగడ్డలోనే ఉంచాలని లేదంటే ఉద్యమానికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలాంటి ప్రకపంపనలు సృష్టిస్తున్నారని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆస్పత్రి తరలించటానికి ఒప్పుకునేది లేదని టీటీడీపీ నేత ఎల్. రమణ అన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజూ 50 వేల మందికి పైగా రోగులు వస్తారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. -
ముఖేష్ గౌడ్ చేరికపై టీ టీడీపీ నేతల భేటీ
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో వలసలు జోరు నేపథ్యంలో ఆపార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, ఉమా మాధవరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కృష్ణయాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల వలసలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ చేరికపై చర్చించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే తెలంగాణలో పలువురు టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. కాగా ముఖేష్ గౌడ్ పార్టీలో చేరే అంశంపై తెలుగు తమ్ముళ్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకు వచ్చేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం. -
తలసానిపై గవర్నర్‌కు ఫిర్యాదు!
-
'పెద్ద మాదిగనని బాబు గతంలో చెప్పారుగా'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షడు మందకృష్ణ మాదిగ టీటీడీపీ నేతలను డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీడీఎల్పీలో ఎర్రబెల్లి, మోత్కుపల్లి, ఎల్ రమణతో మందకృష్ణమాదిగ భేటీ అయ్యారు. అనంతరం మందకృష్ణ విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు టీడీపీ డిమాండ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే తాను పెద్ద మాదిగనని ఏపీ సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా మందకృష్ణ టీడీపీ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. తన డిమాండ్‌ను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని టీ.టీడీపీ నేతలు తనకు హామీ ఇచ్చారని మందకృష్ణ తెలిపారు. -
హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్
హైదరాబాద్: తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన తన విన్నపాన్ని పెడచెవిన పెట్టిన స్పీకర్‌పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఒకానొక దశలో ఆగ్రహంతో ఊగిపోతూ.. హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ విషయాన్ని గ్రహించిన స్పీకర్ మధుసూదనచారీ లంచ్ బ్రేక్ అంటూ సభను అరగంట పాటు వాయిదా వేశారు. దీంతో రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి మిగతా టీటీడీపీ సభ్యులతో భోజనానికి వెళ్లిపోయారు. -
'ఆత్మగౌరవాన్ని చంపుకుని ధర్నాలు చేస్తున్నారు'
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్‌కు పేరు మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీలు బి.సుమన్, బి.నర్సయ్య గౌడ్లు విలేకర్లతో మాట్లాడుతూ... కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. టెర్మినల్ పేరు విషయంలో టి.టీడీపీ నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకుని ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని సుమన్, నర్సయ్య గౌడ్ వెల్లడించారు. -
'సస్పెండ్ చేసైనా సరే సభ జరిపి తీరుతాం'
హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని జరిపి తీరుతామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపినా.. కొంతమంది పదే పదే అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే సభలో గందరగోళం సృష్టించేవారిని సస్పెండ్ చేసైనా సభ జరిపి తీరుతామని హరీశ్ అన్నారు. టీటీడీపీ నేతలు తెలంగాణ గాలి పీలుస్తూ, ఇక్కడి తిండి తింటూ చంద్రబాబు పాటపాడుతున్నారని విమర్శించారు. కావేరి జలాల కోసం తమిళనాడు అంతా ఏకమైన సంగతి టీటీడీపీ నేతలు గుర్తు తెచ్చుకోవాలని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం గురవింద చందమేనన్నారు. గతంలో అసెంబ్లీలో తెలంగాణ పదం నిషేధించినప్పుడు జానారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఎందుకు మాట్లాడలేదని హరీశ్ ప్రశ్నించారు. -
'సఖ్యతతో ఉండక... చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు'
హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ వివాదంపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టీటీడీపీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్ రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని తెలంగాణ సర్కార్‌కు హితవు పలికారు. కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వైఖరీతో నష్టపోయేది తెలంగాణే అని వారు స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులందర్నీ కలిశామని తెలిపారు. ఏపీ నుంచి తమకు నిర్దిష్ట ప్రతిపాదనలు వస్తున్నాయి.... కానీ తెలంగాణ నుంచి మాత్రం ప్రతిపాదనలేవీ రావడం లేదని సాక్షాత్తూ కేంద్రమంత్రులే అంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా మేల్కోవాలని టీటీడీపీ నేతలు కేసీఆర్ సర్కార్‌కు హితవు పలికారు. -
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలసిన టీటిడిపి
-
'అజాంఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి'
హైదరాబాద్: సంక్షేమ పథకాలు అమలులో అర్హులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు తమ వివరాలు ఇస్తున్నారు... ఇప్పుడేమో దరఖాస్తులంటూ ప్రజలకు సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వెళ్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మంగళవారం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అజంఖాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సైదాబాద్ మండల పరిధిలోని స్వామి వివేకానంద స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన సపోటాబాగ్‌కు చెందిన ఆజమ్‌ఖాన్(65) క్యూలోనే స్పృహ తప్పి పడిపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. -
బస్సు యాత్రను విజయవంతం చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులకు అండగా ఉన్నామనే విశ్వాసం కలిగించేలా బస్సుయాత్ర నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆపార్టీ నేతలకు సూచించారు. ఈనెల 10 నుంచి టీటీడీపీ నేతలు చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 4 మాసాల్లోనే 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని వివరిస్తూ, రైతులకు మనోైధెర్యం నింపేలా జిల్లాల్లో యాత్ర సాగాలని సూచించారు. బస్సు యాత్ర సందర్భంగా జిల్లాల్లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో పాటు ఎండిన పంటలను పరిశీలించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చాలని చెప్పారు. 10న నల్లగొండ, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని ఆపార్టీ నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, టీడీఎల్పీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
టిటిడిపి నేతల బస్సు యాత్ర
-
టీ తమ్ముళ్లకు బాబు 'బిస్కెట్లు'
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు రింగరింగామంటూ దూసుకొస్తున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆ ఎన్నికల్లో 'కారు' బ్రేకులు కత్తిరించి, 'చెయ్యి'ని నేలమట్టం చేసి సైకిల్‌తో దూసుకుపోవాలని వ్యూహా రచన చేస్తున్నారు. అందుకోసం గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యేల (టి తమ్ముళ్లకు) తో గత వారంలో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 29 స్థానాలకు గాను15 స్థానాలు బీజేపీ పొత్తుతో కైవసం చేసుకున్నాం... ఇదే ఊపు ఉత్సాహంతో బీజేపీతో పొత్తు లేకుండా ముందుకు వెళ్లితే గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపు మనదేనంటూ తమ్ముళ్లను ఉత్సాహపరిచారు. బల్దియా పీఠం కైవసం చేసుకుంటే.... నజరానాలు ఎలా అందనున్నాయో కూడా బాబు గారు ఈ సందర్భంగా విశదీకరించి మరీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక దేవాలయాలు గల జిల్లా చిత్తూరు. ఆ జిల్లాలోని టీటీడీ దేవాలయం, కాణిపాకం వినాయక స్వామి దేవాలయాల మొదలు .... కర్నూలు జిల్లా శ్రీశైలం, విజయవాడలోకి శ్రీకనకదుర్గ దేవాలయ పాలకమండళ్లలో ఛైర్మన్ , సభ్యులుగా నియమిస్తానంటూ భరోసా ఇచ్చేశారు. దాంతో దేవుని సేవలో తరించి పోవచ్చని తెలంగాణలోని పచ్చ తమ్ముళ్లు తెగ సంబరపడిపోతున్నారు. అయితే బాబుగారు ఓ విషయం మాత్రం గమనించినట్లు లేదు.... తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలు తీసుకుని తిరుమలకు వెళ్తుంటే ... టీటీడీ అధికారులు 'ఆ సిఫార్సు' లేఖలను చించి బుట్టలో వేస్తున్నారు. అంతేందుకు సాక్షాత్తూ చంద్రబాబు కేబినెట్లోని దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు సిఫార్సు లేఖను తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు నాలుగు రోజుల కిత్రం ఊఫ్ మని గాలికి ఊదేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనతో మంచి కాక మీద సీమాంధ్రులు ఉన్నారు. అదికాక ఆంధ్రప్రదేశ్‌లోని పచ్చపార్టీ నిరుద్యోగులు ఆ దేవాలయాల్లోని పాలక మండలి పదవుల కోసం కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లోని పాలక మండళ్లలో తెలంగాణ పచ్చ తమ్ముళ్లను నియమిస్తే ఉరుకుంటారా అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుతమ్ముళ్లు తెగ చెవులు తెగ కోరికేసుకుంటున్నారు.