తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ పార్టీ మారడంపై వస్తున్న వదంతులపై చర్చించేందుకు సమావేశం కావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం టీటీడీపీ పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరైనా పార్టీని వీడనున్నారా అనే దానిపై ముఖ్యంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.