రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు.
నిజామాబాద్ : రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆరోపించారు. గురువారం నిజామాబాద్లో హరీష్రావు విలేకర్లతో మాట్లాడుతూ... టీటీడీపీ నేతలు విజయవాడ వెళ్లిపోవాలి... లేదా టీడీపీని వీడాలని సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు చెరువు పనుల పేరుతో... కాంట్రాక్టుల జేబులు నింపారని విమర్శించారు.