బాబు గల్ల పట్టుకోకుండా.. మాపై విమర్శలా! | trs leaders fires on ap cm chandrababu | Sakshi
Sakshi News home page

బాబు గల్ల పట్టుకోకుండా.. మాపై విమర్శలా!

Published Tue, Aug 11 2015 12:45 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

బాబు గల్ల పట్టుకోకుండా.. మాపై విమర్శలా! - Sakshi

బాబు గల్ల పట్టుకోకుండా.. మాపై విమర్శలా!

టీటీడీపీ నేతలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు గల్లపట్టుకుని ప్రశ్నించకుండా.. తెలంగాణ టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతూ చంద్రబాబు లేఖలు రాశారని, మరోవైపు టీటీడీపీ నేతలు పాద యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ..

తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా, సూచనలు చేయకుండా విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. కేవలం తమ ఉనికి చాటుకోవడానికే ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు దాచిపెట్టి పాదయాత్రలు చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వీరికి తోడు మరో వైపు కాంగ్రెస్ నాయకులు కూడా వాస్తవాలు మరిచిపోయి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయి, తట్టుకోలేక పోతున్న కాంగ్రెస్ నేతలంతా తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement