ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ధర్నా | ttdp leaders takes on kcr | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ధర్నా

Published Sat, Oct 15 2016 10:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

ttdp leaders takes on kcr

  • రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలి
  • ఓరుగల్లు ప్రజలే కేసీఆర్ మెడలు వంచుతారు
  • నకిలీ విత్త్తన కంపెనీలపై చర్యలేవి
  • టీటీడీపీ నేతలు
  •  
    వరంగల్: రాష్ట్రంలో అకాల వర్షాలతో, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ అధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ధర్నా, ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు కష్టాలు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
     
    వ్యవసాయ నిర్లక్ష్యం, విత్తన కంపెనీలపై ప్రభుత్వ అజామారుుషీ లేక పోవడంతోనే  హైబ్రిడ్ పేరుతో నాణ్యతలేని నకిలీ మిర్చి విత్తనాలను డీలర్లు రైతులకు అంటగడుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలపై పూర్తి స్థారుులో విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
     
    అధికారులు నకిలీ విత్తనాలపై అందజేసిన నివేదకలను ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. అనంతరం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట ఏర్పాటు ఉద్యమంలో ముందుండి పోరాడిన ఓరుగల్లు  ప్రజలే హామీలతో గద్దెనెక్కి పట్టించుకోని సీఎం కేసీఆర్ వంచుతారన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ చెబుతున్నారని ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.    
     
    ప్రతిపక్షాలను అపహాస్యం చేయడం తగదు...రేవూరి
    రైతు సమస్యలు. ఇతర విషయాలపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలను అపహస్యం చేయడం సీఎంకు తగదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. నకిలీ విత్తనాల కంపెనీలపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకోవాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సీతక్క డిమాండ్ చేశారు.
     
    అకాల వర్షాలతో దెబ్బతిన పంటలకురూ.25వేల చొప్పున, నకిలీ విత్తనాలతో మోస పోరుున రైతులకు ఎకరాలకు రూ.40వేల చొప్పున పరిహారం అందించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కార్యక్రమంలో వేం నరేందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, చిలుక మధుసూదన్, జాటోతు ఇందిర, గట్టు ప్రసాద్‌బాబు, గన్నోజు శ్రీనివాసచారి, రాంచంద్రునాయక్, తుళ్లూరు బ్రహ్మయ్య,  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement