హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. శనివారం రాత్రి సచివాలయంలో చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో ఎమ్మెల్యేలు గాంధీ, వివేక్, ప్రకాశ్ గౌడ్, ఎంపీ మల్లారెడ్డితో తదితరులు ఉన్నారు. ఓటుకు కోట్లు కేసు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఉన్నతాధికారులు, పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.