టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు డీజీపీ అనురాగ్ శర్మతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు డీజీపీ అనురాగ్ శర్మతో సమావేశమయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర టీడీపీ నేతలు డీజీపీని కలిశారు. రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసులో ఇరికించారని ఎర్రబెల్లి ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. సికింద్రాబాద్లోని లాలాగూడలో స్టీఫెన్కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.