
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టీటీడీపీ నేతలు కోరారు. ఈమేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌లు గురువారం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఆయన్ను కలిశారు.
ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘కథానాయకుడు’సినిమా షూటింగ్‌లో ఉన్న బాలయ్యతో గంటకు పైగా చర్చించారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించాలని, టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటు చేయనున్న కూటమి ప్రయత్నాలను కూడా ఆయనకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment