సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులకు అండగా ఉన్నామనే విశ్వాసం కలిగించేలా బస్సుయాత్ర నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆపార్టీ నేతలకు సూచించారు. ఈనెల 10 నుంచి టీటీడీపీ నేతలు చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 4 మాసాల్లోనే 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని వివరిస్తూ, రైతులకు మనోైధెర్యం నింపేలా జిల్లాల్లో యాత్ర సాగాలని సూచించారు.
బస్సు యాత్ర సందర్భంగా జిల్లాల్లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో పాటు ఎండిన పంటలను పరిశీలించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చాలని చెప్పారు. 10న నల్లగొండ, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని ఆపార్టీ నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, టీడీఎల్‌పీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
బస్సు యాత్రను విజయవంతం చేయండి
Published Thu, Oct 9 2014 2:33 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
Advertisement
Advertisement