bus tour in Telangana
-
18న ములుగులో సభ.. 19న భూపాలపల్లిలో పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈనెల 18న కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభించేందుకు రానున్న ఆయన మూడు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ముందుగా కొండగట్టు నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద రాహుల్ కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు. ఏఐసీసీ వర్గాలు వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం 18, 19, 20 తేదీల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాదయాత్రలు చేయనున్న ఆయన పలువురు కారి్మకులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మూడు దశల్లో బస్సు యాత్ర ప్రతి రోజు మూడు నియోజకవర్గాల చొప్పున 12 రోజులపాటు రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడతలో రాహుల్ మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా, దసరా తర్వాత రెండో విడత ప్రారంభించనున్నారు. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని, ఈ యాత్రకు సోనియాతో సహా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది. -
ఓటుతో బుద్ధి చెబుతాం
కల్వకుర్తి మహబూబ్‌నగర్ : ఓటు అనే వజ్రాయుధంతో బీసీలు రానున్న 2019ఎన్నికలలో అగ్రవర్ణ కులాలకు తగిన బుద్ధి చెబుతామని, రాజకీయ గులాంగిరీ కోసం బీసీలను వాడుకుంటున్నారని.. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా శ్రీనివాస్‌గౌడ్ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా కల్వకుర్తి రఘుపతిపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏ ఉద్యమం చేసినా బీసీలే ప్రాణత్యాగాలు చేశారని, అన్ని ఉద్యమాలు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. గంపెడు శాతం ఉన్న బీసీలకు రాజకీయంలో పిడికెడు ఫలాలు మాత్రమే అందుతున్నాయని, అదే పిడికెడు శాతం ఉన్న అగ్రవర్ణ కులాల వారికి గంపెడు ఫలాలు దక్కుతున్నాయని అన్నారు. తనను ఎంతో ఆప్యాయంగా పలకరించి, బస్సుయాత్రకు స్వాగతం పలికిన ఉమ్మడి పామూరు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు నేను ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో బీసీని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని, అందుకొరకు నియోజకవర్గంలోని బీసీలందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అగ్రకులాల వారు ఎన్ని ప్రయత్నాలు చేసి, వారి కింద పనిచేసే వారిగానే బీసీలను గుర్తించారని వారందరికీ తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని, అప్పటి ముఖ్యమంత్రిని కాదని బీసీ నాయకుడైన చిత్తరంజన్ దాస్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన ఘనత కల్వకుర్తి ప్రజలకు దక్కుతుందని అన్నారు. ఇలాంటి చైతన్యవంతమైన కల్వకుర్తి ప్రాంతంలో 2019 ఎన్నికలలో బీసీ నాయకుడిని చట్ట సభలకు పంపించాల్సిన అవసరం నా కుల బాంధవులైన బీసీలపై ఉందని పిలుపునిచ్చారు.అనంతరం బీసీల ఐక్యతను చాటాలని బీసీ నాయకులందరితో కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఆచారి, బాలాజీ సింగ్, పురపాలిక చైర్మన్ రాచోటి శ్రీశైలం, బాలస్వామి గౌడ్, సదానందం, కానుగుల జంగయ్య, రాజేందర్, నాగేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్, కాశన్న యాదవ్, శ్రీను, బుగ్గయ్య గౌడ్, పెద్దయ్య యాదవ్, యుగంధర్, శేఖర్, బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు వెళ్లాలి తెలకపల్లి : బీసీలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో అడుగు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీల చైతన్య యాత్ర శుక్రవారం తెలకపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బీసీలు వారికి స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ చౌరస్తాలో మాట్లాడుతూ పిడికెడు జనాభా ఉన్న వారు రాజ్యమేలుతుంటే గుప్పెడు జనాభా ఉన్న వారు పాలితులుగా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలను ఆయా స్థానాలలో నిలబెట్టి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓట్ల ద్వారా వచ్చే ఎన్నికల్లో దొరలు, పటేళ్లకు బుద్ధి చెప్పాలని సూచించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, బీసీలంతా కలిసికట్టుగా రావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కాశన్న యాదవ్, రాముయాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ బస్సుయాత్రకు బ్రేక్?
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో తమకెదురైన చేదు అనుభవాలను ప్రజలకు వివరించి సానుభూతి పొందాలని భావించిన తెలంగాణ తెలుగుదేశం నేతల యత్నాలకు సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్ తమను అసెంబ్లీలోకి రానీయకుండా సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ బస్సు యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలన్న ఎమ్మెల్యేల యోచనకు సహచర సభ్యుల్లో టీడీఎల్పీకి సారథ్యం వహిస్తున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రచారార్భాటం కోసం తమను అసెంబ్లీకి వెళ్లకుండా చేశారని కొందరు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అందుకే అసెంబ్లీ ముగియగానే బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించినా తోటి ఎమ్మెల్యేల నుంచి సరైన స్పందన రాలేదు. . సిటీ ఎమ్మెల్యేల ఆగ్రహం టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్ఎస్లో చేరారు. మిగిలిన 12 మందిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లోనే గడుపుతున్నారు. మిగతా 11 మందిలో ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, సండ్ర , సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లే సీనియర్లు. మిగతా 5గురు కొత్తగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఇప్పటికి 3సార్లు సమావేశం కాగా, టీఎమ్మెల్యేలు కేవలం తొలి సమావేశాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో కనిపించారు. రెండో విడతలో సగం రోజులు సస్పెన్షన్‌లోనే గడిపారు. తాజాగా బడ్జెట్ సమావేశాల్లోనైతే కేవలం తొలిరోజు మా త్రమే అసెంబ్లీలో కనిపించారంతే!. అందుకే, బస్సు యాత్ర ప్రస్తావనకు రాజధాని ఎమ్మెల్యేలు స్పంది ంచలేదని తెలిసింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా కొందరు ఎమ్మెల్యేల వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక, టీడీపీలో ప్రస్తుతం నెల కొ న్న ఆధిపత్య పోరు నేపథ్యంలో... పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 23న తలపెట్టిన మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనపై కూడా అనుమా నం నెలకొంది. పార్టీలో పైచేయి కోసం పోటీ పడుతున్న రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకుంటేనే బాబు పర్యటన ఖరారయ్యే అవకాశముందంటున్నారు. -
బస్సు యాత్రను విజయవంతం చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులకు అండగా ఉన్నామనే విశ్వాసం కలిగించేలా బస్సుయాత్ర నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆపార్టీ నేతలకు సూచించారు. ఈనెల 10 నుంచి టీటీడీపీ నేతలు చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 4 మాసాల్లోనే 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని వివరిస్తూ, రైతులకు మనోైధెర్యం నింపేలా జిల్లాల్లో యాత్ర సాగాలని సూచించారు. బస్సు యాత్ర సందర్భంగా జిల్లాల్లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో పాటు ఎండిన పంటలను పరిశీలించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చాలని చెప్పారు. 10న నల్లగొండ, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించాలని ఆపార్టీ నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు రమణ, టీడీఎల్పీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.