టీడీపీ బస్సుయాత్రకు బ్రేక్?
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో తమకెదురైన చేదు అనుభవాలను ప్రజలకు వివరించి సానుభూతి పొందాలని భావించిన తెలంగాణ తెలుగుదేశం నేతల యత్నాలకు సొంత పార్టీ నుంచే చుక్కెదురైంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్ తమను అసెంబ్లీలోకి రానీయకుండా సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ బస్సు యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలన్న ఎమ్మెల్యేల యోచనకు సహచర సభ్యుల్లో టీడీఎల్పీకి సారథ్యం వహిస్తున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రచారార్భాటం కోసం తమను అసెంబ్లీకి వెళ్లకుండా చేశారని కొందరు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అందుకే అసెంబ్లీ ముగియగానే బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించినా తోటి ఎమ్మెల్యేల నుంచి సరైన స్పందన రాలేదు. .
సిటీ ఎమ్మెల్యేల ఆగ్రహం
టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరారు. మిగిలిన 12 మందిలో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లోనే గడుపుతున్నారు. మిగతా 11 మందిలో ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, సండ్ర , సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లే సీనియర్లు. మిగతా 5గురు కొత్తగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఇప్పటికి 3సార్లు సమావేశం కాగా, టీఎమ్మెల్యేలు కేవలం తొలి సమావేశాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో కనిపించారు. రెండో విడతలో సగం రోజులు సస్పెన్షన్లోనే గడిపారు. తాజాగా బడ్జెట్ సమావేశాల్లోనైతే కేవలం తొలిరోజు మా త్రమే అసెంబ్లీలో కనిపించారంతే!.
అందుకే, బస్సు యాత్ర ప్రస్తావనకు రాజధాని ఎమ్మెల్యేలు స్పంది ంచలేదని తెలిసింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా కొందరు ఎమ్మెల్యేల వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక, టీడీపీలో ప్రస్తుతం నెల కొ న్న ఆధిపత్య పోరు నేపథ్యంలో... పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 23న తలపెట్టిన మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనపై కూడా అనుమా నం నెలకొంది. పార్టీలో పైచేయి కోసం పోటీ పడుతున్న రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకుంటేనే బాబు పర్యటన ఖరారయ్యే అవకాశముందంటున్నారు.