హైదరాబాద్:టీఆర్ఎస్ వ్యూహరచన కమిటీ సమావేశం ముగిసింది. నేటి అసెంబ్లీ సమావేశంలో రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా సభ్యులంతా సభలోనే ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఉదయం పది గంటలకు ఆరంభంకానున్న అసెంబ్లీ సమావేశంలో విపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధమయ్యింది. అసెంబ్లీ సమావేశానికి ముందుగానే సమావేశామైన టీఆర్ఎస్ వ్యూహరచన కమిటీ .. సభలో తమ వ్యూహాలను పకడ్భందీగా అమలు చేయాలని నిర్ణయించింది.
శుక్రవారం సభను విపక్షాలు అడ్డుకోవడంతో సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభంపై చర్చించనున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు పెరిగాయాంటూ నిలదీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి అధికారపక్షం వ్యూహ రచన చేస్తోంది.