తెలంగాణ టీడీపీ నేతలవి అంతా డ్రామాలేనని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలవి అంతా డ్రామాలేనని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లో హరీశ్రావు మాట్లాడుతూ...టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని తెలిపారు. టీడీపీ సభ్యులకు క్లారిటీ లేదని ఆరోపించారు. సభ ప్రారంభానికి ముందే తీర్మాన నోటీసు ఇవ్వాలని తెలియదా అని ఆయన టీటీడీపీ సభ్యులను ప్రశ్నించారు. టీటీడీపీ నేతలు... సీఎల్పీనేత జానారెడ్డి వద్దకు వెళ్లి అభాసుపాలైయ్యారని విమర్శించారు.