రైతుల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు రైతులు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్‌రెడ్డి లు అధికారంలో ఉన్న పదేళ్లలో ఏ ఒక్క రోజైనా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించారా అని అడిగారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు గత పాలకులే కారణమని ఆరోపించారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న టీడీపీ, బీజేపీ, సీపీఐ నాయకులు ఆంధ్రాలో రుణమాఫీ చేయని ఎందుకు అడగటం లేదన్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.