telangana minister
-
తెలంగాణ మంత్రి సీతక్కతో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ముదిరిన మేడిగడ్డ వివాదం
-
TS:రూ.500కే గ్యాస్ సిలిండర్..మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మంగళవారం సివిల్ సప్లై అధికారులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం. ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బియ్యం తీసుకునే లబ్ధిదారులు రాష్ట్రంలో 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. వడ్ల కొనుగోలుకు సివిల్ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బు వెంటనే అందాలి’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి మనం సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. మొక్కుబడిగా బియ్యం పంపిణీ కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. బియ్యం లబ్దిదారులను ర్యాండమ్ చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి’ అని ఉత్తమ్ అధికారులకు సూచించారు. ‘గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. రూ.11 వేల నష్టాల్లో శాఖ కూరుకుపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలున్నాయి.రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తా’ అని ఉత్తమ్ తెలిపారు. ఇదీచదవండి..జనార్ధన్ రెడ్డి రాజీనామా.. మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన తమిళిసై -
పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి
‘‘దాదాపు 16 ఏళ్లుగాపాపారావుగారితో నాకు పరిచయం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా చేశారాయన.పాపారావుగారు ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీస్తున్నారని న్యూస్‌పేపర్స్‌లో చూసి తెలుసుకున్నాను. మంచిగా సినిమా చేయాలని కోరుకున్నాను. మ్యూజిక్ స్కూల్ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టైటిల్ ‘మ్యూజిక్ స్కూల్’. కానీ నాకు ఇప్పుడు మ్యూజిక్ యూనివర్సిటీ (ఇళయరాజాని ఉద్దేశించి) పక్కన నిలబడే అవకాశం కలిగింది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. శ్రియా శరన్, శర్మాన్ జోషి, షాన్ ప్రధాన ప్రాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యంలోపాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. తెలుగురాష్ట్రాల్లో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇళయరాజా సంయుక్తంగా ‘మ్యూజిక్ స్కూల్’ ఆడియోను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘అయితే ఇంజనీర్ కావాలి.. లేకపోతే డాక్టర్ కావాలి అంటూ పిల్లల్లో ఆర్ట్స్ పట్ల ఉండే సృజనాత్మకను చంపేస్తున్నాం. అలా చేయకూడదు’ అనే అంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీశామనిపాపారావుగారు చెప్ప్రారు. నా కొడుకుకి 17 ఏళ్లు. ఒక ప్రాట ప్రాడానని, రిలీజ్ చేస్తున్నానని మూడు నెలల క్రితం ‘గోల్డెన్ ఆర్’ అనే ఆల్బమ్ కవర్ చూపించాడు. మ్యూజిక్‌లో శిక్షణ తీసుకోనప్పటికీ తన స్కిల్స్, వాయిస్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలా చాలా మంది పిల్లల్లో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం తొక్కేయకుండా వారి (పిల్లలు) మనసుకు నచ్చింది చేసేలా ప్రోత్సహించాలంటూ ఈ ‘మ్యూజిక్ స్కూల్’ తీసినందుకుపాపారావుగారికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం ఓ డాక్యుమెంటరీ తీశాను. అది చూసి రమేష్ ప్రసాద్‌గారు నాకు జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఆరు నెలల తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి అవార్డు వచ్చింది. ఇళయరాజాగారి వద్దకు ‘మ్యూజిక్ స్కూల్’ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లి, ‘ఈ సినిమాలో 11 ప్రాటలు ఉన్నాయి సార్’ అనగానే.. పది నిమిషాల్లో ఓకే అన్నారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి రాకపోయి ఉంటే నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్లాగే ఈ కథని కూడా పక్కన పెట్టేవాడిని’’ అన్నారుపాపారావు. ‘‘ఓ సినిమాకు, ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు సంబంధం లేదు. ఎంతో ఫ్యాషన్ ఉండబట్టిపాపారావుగారు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశంలాంటిది. ‘మ్యూజిక్ స్కూల్’ను స్కూల్స్‌లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
హరీష్ మాటలతో బీఆర్ఎస్కే నష్టం! ఆయన కేటీఆర్‌లా చేస్తే బాగుండేది..
తెలంగాణ సీనియర్ మంత్రి హరీష్ రావు తొందరపడుతున్నారు. కారణం ఏమో కానీ, ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన దుందుడుకుగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా అదంతా ఉద్యమంలో భాగమని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన బాధ్యత కలిగిన మంత్రిగా ఉన్నారు. దానికి తగినట్లు ఆయన హుందాగా ఉండాలి. అందులోను పొరుగు రాష్ట్రం గురించి , పక్క రాష్ట్రం ప్రజల గురించి మాట్లాడేటప్పుడు మరింత పద్ధతిగా వ్యవహరించాలి. దురదృష్టవశాత్తు హరీష్ రావు అందుకు భిన్నంగా మాట్లాడి ఆంధ్ర నేతలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనిపిస్తుంది. హరీష్ రావు సమర్ధనేతగా గుర్తింపు పొందారు. టాస్క్ మాస్టర్ గా కూడా పేరొందారు. అయినా అక్కడి రాజకీయ కారణాలతో కొన్నిసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చరిత్ర అవసరం లేదు. కానీ హరీష్ ఎందుకో అప్పుడప్పుడు ఆంధ్రనేతలను గిల్లుతుంటారు. తాజాగా కూడా ఆయన అదే పనిచేశారు. దానికి అదే రీతిలో ఏపీ మంత్రులు కూడా స్పందించారు. వీరిలో కూడా ఒకరు కొంచెం ఎక్కువగానే మాట్లాడి ఉండవచ్చు. కానీ అందుకు హరీష్ అవకాశం ఇచ్చారు. హరీష్ ఆంధ్ర పాలన గురించి, ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితుల గురించి తనదైన భాషలో మాట్లాడారు. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతం వారిని అవమానించేలా ఉన్నాయి. తెలంగాణలో పనులు చేసుకుంటున్న వలస కూలీలను ఉద్దేశించి అక్కడే ఓటర్లుగా మారాలని కోరారు. అంతవరకు తప్పు లేదు. కానీ ఆంధ్రలో అసలు ఏమీ లేనట్లు, ఇక్కడ రోడ్లు లేనట్లు, పాలనే సాగనట్లు, ఏపీలో సంక్షేమ స్కీములు లేనట్లు ఏవేవో అనవసరంగా మాట్లాడారు. ఆయన కాకతాళీయంగా మాట్లాడానని అన్నప్పటికి, అవి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజలను అవమానించేలా ఉన్నాయి. ఎదుటివారు హర్ట్ అయ్యారని తెలిసిన వెంటనే సారీ అంటే సరిపోయేది.. అలాకాకుండా మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడారు. 'ఆంధ్రనేతలారా! మా జోలికి రావద్దు. మా గురించి మాట్లాడకపోతేనే మీకు మంచిది "అని హెచ్చరించారట. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. తెలంగాణలో అమలు అవుతున్న స్కీములు ఎపిలో లేవని అన్నారట. అసలు రెండు రాష్ట్రాల మధ్య పోల్చి చూడవలసిన అవసరం ఏముంది?హైదరాబాద్ నగరం ద్వారా వచ్చిన అడ్వాంటేజ్ ను అనుభవిస్తున్న తెలంగాణ నేతలు, ఏపీని అగౌరవపరిచేలా మాట్లాడనవసరం లేదు. ఎంత టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా హరీష్ రావు పాత తత్వం మారలేదని దీనిద్వారా అర్ధం అవుతుంది. ఆయనకు ఆంధ్ర వాసులు అంటే ద్వేషం కొంచెం ఎక్కువే. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో సిద్దిపేట సమీపంలోని లక్ష్మీపురం అనే గ్రామం అనుకుంటా. అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్లినవారు ఎక్కువ మంది స్థిరపడ్డారు. వారిపై ఆయన ఆద్వర్యంలో దాడి జరిపే యత్నం వార్త అప్పట్లో పెద్ద సంచలనం అయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా హరీష్ రావు, మరో మంత్రి ప్రశాంతరెడ్డి వంటి కొద్ది మంది ఆంధ్రపై నోరు పారేసుకున్నారు. తద్వారా తీవ్ర విమర్శలకు గురి అయ్యారు. ఏ రాష్ట్రంలో ఉండే పాజిటివ్ అంశాలు అక్కడ ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఉండే నెగిటివ్ పాయింట్లు అక్కడ ఉంటాయి. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఏదైనా ఎన్నికల సమయం అయితే అదో రకం. అలాంటిదేమీ లేకుండానే హరీష్ మాట్లాడడం ఏపీ మంత్రులకు ఆగ్రహం తెప్పించింది. వారు ఏపీలో జరుగుతున్న అమ్మ ఒడి, స్కూళ్ల నాడు-నేడు, చేయూత, కాపు నేస్తం, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ , రైతు భరోసా కేంద్రాలు తదితర స్కీముల గురించి ప్రస్తావించి అవి తెలంగాణలో ఉన్నాయా అని అడిగారు. ఏపీలో ఆయన ఎప్పుడుపర్యటించారు కనుక రోడ్లు బాగోలేదని అంటారు. నిజానికి ఈ మధ్య రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుపడ్డాయి. అయినా అదొక నిరంతరం ప్రక్రియ. హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలలో రోడ్లు సరిగా ఉండవు. డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంటుంది. వీటికి సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు డెక్కన్ క్రానికల్ వంటి పత్రికలలో ఒక పేజీలో ప్రత్యేకంగా వస్తుంటాయి. వర్షం పడితే పలు చోట్ల రోడ్లు ఎలా మారతాయో అందరికీ తెలుసు. సరూర్ నగర్ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడింది చూశాం .తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు( ప్రస్తుతం బీఆర్ఎస్)పలు హామీలు ఇచ్చారు. వాటిలో పలు హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ఆ విషయాలను అక్కడి ప్రతిపక్షాలు ప్రస్తావిస్తుంటాయి. వాటి గురించి హరీష్ ఏమి చెబుతారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని చమత్కారంగా మాట్లాడుతూ మామ కేసీఆర్ పై కోపం వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్లను హరీష్ తిడుతుంటాడని, చంద్రబాబు మాదిరి ఎప్పుడోసారి మామకు ఈయన కూడా పోటు పొడవవచ్చని వ్యాఖ్యానించారు. మంత్రులు కారుమూరి, బొత్స, సిదిరి అప్పలరాజు లు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు. సిదిరి మాత్రం కొన్ని పదాలు అతిగా వాడారు. ఆయన అలాంటి పదాలు వినియోగించి ఉండాల్సింది కాదు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్ల రాజకీయంగా ఆయన పార్టీకే నష్టం కలిగించవచ్చు. ఎంతకాదన్నా తెలంగాణలో హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాలలో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఇటీవలికాలంలో వారిలో పలువురు బీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉన్నారు. వారిలో చాలామంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ మద్దతుదారులు కూడా ఉండవచ్చు. వారందరిలో అసంతృప్తి కలిగితే బీఆర్ఎస్ కే నష్టం అన్న సంగతి హరీష్ గమనించాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల కళ్లలో సంతోషం చూడడానికి హరీష్ అలాంటి మాటలు మాట్లాడారేమో తెలియదు. ఇకనైనా ఆయన తన ధోరణి మార్చుకుంటే మంచిది. గతంలో మంత్రి కేటీఆర్ కూడా ఇలాగే మాట్లాడి ఆ వెంటనే సరిదిద్దుకున్నారు. హరీష్ అలా చేయకపోవడం బాధాకరం. రెండు రాష్ట్రాలు కలిసి,మెలిసి ఉండవలసిన తరుణంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు స్వాగతించవలసిన పరిణామం కాదని చెప్పాలి. మరో సంగతి ఏమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఆంధ్ర నేతలను తప్పుపట్టారు కానీ, తెలంగాణ మంత్రి హరీష్ రావును ఒక్క మాట అనలేకపోయారు. ఎంత హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నా, ఏపీలో రాజకీయాలు చేస్తున్న విషయాన్ని ఆయన విస్మరించరాదు. ఇక విశాఖ ఉక్కు గురించి కూడా హరీష్, కేటీఆర్ లు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. వారితో పోటీపడి పవన్ కళ్యాణ్ తాను కేంద్రంతో మాట్లాడి రావడం వల్లే అంతా ఆగిపోయిందని చెప్పేసుకున్నారు. కేంద్ర మంత్రి విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేయడం లేదన్నట్లుగా మాట్లాడగానే ఇదంతా తమ ఘనతేనని వారు అన్నారు. ఆ వెంటనే ఆ కేంద్ర మంత్రి మాట మార్చారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపలేదని స్పష్టం చేసింది. దాంతో వీరు తీసుకున్న క్రెడిట్ ఉత్తిదే అని తేలింది. ఆ తర్వాత వీరు ఆ ఊసెత్తలేదు. ఒక పక్క తెలంగాణలో నిజాం షుగర్స్ ను తెరిపించడంలో వైఫల్యం చెందిన తెలంగాణ మంత్రులు విశాఖ ఉక్కు గురించి భారీగా ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగానే అంత డబ్బు ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ ను వారే ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. అన్నిటికి మించి ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల మొదటి తేదీన జీతాలు ఇచ్చి శభాష్ అనిపించుకోవచ్చు కదా! -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
Telangana: మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు తెలియజేశారు. మెడికల్ విద్యార్థులకు ఓరియెంటేషన్ డే సందర్భంగా తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయన ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు. తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆ కోడలు కిట్టీ పార్టీలు, పిక్నిక్లు అంటూ తిరిగేదని, అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు తన మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ అయ్యిందని, మీరు(విద్యార్థులను ఉద్దేశించి..) కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి కాలేజ్ ఈవెంట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో.. ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రసంగంలో ఏదో ఫ్లోలో అలా మాట్లాడానని, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు ఆయన వీడియోలో వెల్లడించారు. సక్సెస్ కోసం కష్టపడితే.. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారంటూ విద్యార్థులకు హితబోధ చేసే సమయంలో చామకూర మల్లారెడ్డి పైవ్యాఖ్యలు చేశారు. -
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన అధికారులు, రూ.8.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు, రియల్ ఎస్టేట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు గుర్తించినట్లు సమాచారం. చదవండి: (టార్గెట్ మల్లారెడ్డి.. మంత్రి ఆస్తులు లక్ష్యంగా ఐటీ దాడులు) -
మంత్రి మల్లారెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సుచిత్రలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ. 2కోట్లు సీజ్ చేశారు. త్రిశూల్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతుండగా ఉదయం నుంచి ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం కాగా మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏక కాలంలో మొత్తం 50 బృందాలుగా అధికారులు. మంత్రితోపాటు ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లోనూ విస్త్రృత దాడులు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు, సోదరుడు, వియ్యంకుడు ఇళ్లల్లో తనిఖీలు జరుపుతున్నారు. మంత్రి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కొత్త విషయాలు వెలుగులోకి మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుపుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. జైకిషన్, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు. సీఎంఆర్ స్కూల్స్‌లో నరసింహ యాదవ్, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహయాదవ్, జైకిషన్ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుపుతోంది. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో ఐటీ సోదాలు జరుపుతున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలు గుర్తించారు. అలాగే కన్వీనర్ కోటా సీట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు మెడికల్ కాలేజీల లావాదేవీల పరిశీలిస్తున్నారు. సంబంధిత వార్త: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో.. -
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
-
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు, అల్లుడి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి సోదరుడు, వియ్యంకుడి నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ లావాదేవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్రాంతి బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్‌రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. చదవండి: (బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు?) -
ఎత్తిపోసే పనిలో మేం.. ఎత్తుకెళ్లే పనిలో బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కృష్ణా, గోదావరి జలాలను ఎత్తిపోసే పనిలో టీఆర్ఎస్ ఉంటే.. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే పని లో ఉందని మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటివి కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయనే విషయాన్ని బీజేపీ నేతలే పరోక్షంగా అంగీకరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో దూతలను కోన్‌కిస్కా గాళ్లు అంటూ మాట్లాడిన బీజేపీ.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు, చేనేతపై జీఎస్టీ విధింపునకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందంటూ బీజేపీ నేతలు పచ్చి అబ ద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో తమ కు సంబంధం లేదనే ఆధారాలను మీడియాకు అందజేశారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నకిలీ మాటలతో వెకిలి చేష్టలు చేస్తున్నారు, వారిస్థాయి ఏమిటో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఢిల్లీ దూతలే చెప్పారు. చండూరులో టీఆర్ఎస్ సభ విజయవంతమవడంతో బీజేపీ నాయకుల కు కంటి మీద కునుకులేకుండా పోయింది..’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీజేపీ డీఎన్ఏలోనే అబద్ధాలు: బీజేపీ డీఎన్ఏలోనే పచ్చి అబద్ధాలు ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎస్లో ఇతర పార్టీల విలీనాన్ని ప్రస్తావిస్తున్న బీజేపీ.. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరుల విషయంలో చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 65లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంలో రూ.30వేల కోట్లు ఇస్తామని తెలంగాణ ఆర్థిక శాఖకు కేంద్రం లేఖ రాసినా సీఎం కేసీఆర్ తిరస్కరించారని చెప్పారు. చేనేతపై జీఎస్టీని మినహాయించాలని 2017లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తరఫున నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. మిషన్ భగీరథకు రూ.19,200 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. కేంద్రం నయాపైసా ఇవ్వలేదన్నారు. ఫ్లోరైడ్ నిర్మూలనకు రూ.800 కోట్లు ఇచ్చామని కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మిషన్ భగీరథకు రూ.2,350 కోట్లు ఇవ్వాల్సి ఉందని హరీశ్‌రావు చెప్పారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి 20 ఉత్తరాలు రాసినా స్పందన లేదని, మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలే! బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం ఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో పశ్చిమ బెంగాల్లో బ్రిడ్జి కూలితే ప్రభుత్వ పతనానికి సంకేతం అంటూ మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇప్పుడు అదే విషయాన్ని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ‘‘బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలు. ప్రజల ప్రాణాలు నీళ్ల పాలు అన్నట్టుగా తయారైంది. సంక్షేమానికి టీఆర్ఎస్.. సంక్షోభానికి బీజేపీ నిర్వచనంగా మారాయి. మునుగోడు ఎన్నికలో ప్రజలు పాలు, నీళ్లకు తేడాను గుర్తించి ప్రజాస్వామ్య విలువలు పెంచేలా తీర్పునిస్తారన్న నమ్మకం ఉంది’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. హామీలను నిలబెట్టుకోలేకే మునుగోడులో జేపీ నడ్డా సభను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘మునుగోడు’ ముంగిటకు సర్కార్‌ను తెచ్చాం -
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ " స్ట్రెయిట్ టాక్ "
-
తెలంగాణను ఇబ్బందులపాలు చేయొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులపాలు చేయొద్దని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్నిరంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, కేంద్రం ప్రకటిస్తున్న అవార్డుల్లోనూ తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. ఇటీవల ఇచ్చిన సంసద్ ఆదర్శ్ గ్రామయోజన, స్వచ్ఛభారత్‌లో అవార్డులు గెలుచుకున్న తెలంగాణ మంగళవా రం కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చిన జాతీయ పర్యాటక అవార్డుల్లో మూడో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు అందుకున్నామని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశ జీడీపీలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఇప్ప టికైనా సీఎం కేసీఆర్ చేస్తున్న పనులను ప్రధాని మోదీ గుర్తించాలని కోరారు. తెలంగాణ పురోగమిస్తున్నందునే కేంద్రం అవార్డులు అందిస్తోందని, తాము చేస్తున్న పనులు తప్పు అయితే తెలంగాణకు ఇన్ని అవార్డులు ఎలా వస్తున్నాయో కేంద్రం ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణతో కేంద్రం పోటీపడాలని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే భారత్ నంబర్ వన్ అవుతుందన్నారు. -
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించే వారిని అణచి వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్న బీజేపీ నేతల మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేర న్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి సోమవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఒకరిద్దరు వ్యాపారుల కోసమే పనిచేస్తూ, ఏ వర్గానికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ద్వారా రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర పన్నిందని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండాగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే 2 రోజుల పర్యటనతో ఇదే విషయం స్పష్టమైందని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా స్థితిగతులు తెలుసుకోకుండా కేంద్ర మంత్రి విమర్శలు చేశారని, కేసీఆర్ పాలనలోనే పాలమూరు జిల్లా దశ మారిందని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో తెలుసుకునేందుకు బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటించాలని ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ఇదీ చదవండి: దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని -
దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): పండుగలు, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం తగదని, ఈ నెల 9న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వమే ఘనంగా చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదని, చేతకాకపోతే తామే నిర్వహిస్తామని.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవసమితి నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోమవారం ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేలసంఖ్యలో పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, రవా ణా, ఆర్అండ్బీ తదితర ప్రభుత్వ విభాగాలన్నీ కలసి చేసే కార్యక్రమం వారి వల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఉత్సవసమితి నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ జరుగుతాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనం చేయనివ్వకపోతే ప్రగతిభవన్‌లో నిమజ్జనం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఇటువంటి వ్యాఖ్యలు నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వింటున్నా’ అని (నవ్వుతూ) అన్నారు. కాగా, ఒకరి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారని, హిందువుల పండుగలు జరిపించడంలేదనే పిచ్చి మాటల నుంచి కొందరు వ్యక్తులు బయటకు రావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి అన్ని పండుగలూ సమానమేనన్నారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు
-
అఫిడవిట్ ట్యాంపరింగ్ ఆరోపణలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసిందని ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీని వాస్‌గౌడ్ తెలిపారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యా లయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో రాజకీయంగా ఎదుగుతున్న తనపై కొందరు కక్షకట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై జరుగుతున్న కుట్ర వెనుక మహ బూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మరో నాయ కుడు ఉన్నారని, వారి పేర్లు త్వరలో బయట పెడతానని చెప్పారు. ట్రాఫిక్ చలాన్లు, బ్యాం కు రుణాల వివరాలను అఫిడవిట్లో చేర్చలేదని తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పిటిషన్‌దారులను తప్పుబడుతూ తప్పుడు కేసులు వేయొద్దని కోర్టు హెచ్చరించినా.. కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, ఇళ్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడాన్ని కూడా కొందరు రాజకీ యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్ గౌడ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు తేలింది. అయితే లోపాలతో ఉన్న మొదటి అఫిడవిట్‌ను వెబ్సైట్ నుంచి తొలగించారని తేలింది. మళ్లీ సవరించిన అఫిడవిట్‌ను నెలన్నర తర్వాత అప్లోడ్ చేసినట్లు ఆరోపణ వచ్చింది. కాగా, స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎలక్షన్ కమిషన్ నివేదిక తెప్పించుకుంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే కేంద్రానికి సీఈవో శశాంక్ గోయల్ బదీలీపై వెళ్లారు. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపిస్తోంది. గతేడాది ఆగస్టులో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ట్యాంపరింగ్‌ను టెక్నికల్ బృందం ధృవీకరిస్తే ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అవకాశం కనిపిస్తోంది. -
మంత్రి వేముల పీఆర్వోపై కేసు
-
ఈటల రాజేందర్ బర్తరఫ్‌పై నిరసన
మంచిర్యాల: ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి ప్రభుత్వం బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆయనకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వర్రావు మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలోని అవినీతిపరులు, భూకబ్జాదారులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఒడ్డెపల్లి మనోహర్, ముత్తోజు రమేశ్, జిల్లా కార్యదర్శి గుండోజు రమేశ్, నాయకుడు రాజన్న పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగంలో ప్రగతికి పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ రంగంలో తక్కువ సమయంలో ప్రగతి సాధించిన రాష్ట్రంగా తెలంగాణను ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ‘స్టేట్ విత్ ర్యాపిడ్ అగ్రికల్చర్ గ్రోత్’పురస్కారాన్ని శనివారం ఢిల్లీలో అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడి తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమైక్య పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో విద్యుత్, సాగు నీరు లేక తెలంగాణలో వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్ రైతుల అవసరాలు తెలుసుకుని నాలుగేళ్లుగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. 23 లక్షల విద్యుత్ కనెక్షన్లకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూ.లక్షా 50 వేల కోట్లతో గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, సీతారామ, పాలమూరు, రంగారెడ్డి, డిండి వంటి చాలా ప్రాజెక్టులు చేపట్టామన్నారు. మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని వివరించారు. 2019 నాటికి అన్ని సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రైతుబంధుతో వారికే ఎక్కువ లబ్ధి.. రైతుబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని, ఈ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందుతోంది చిన్న, సన్నకారు రైతులేనని పోచారం చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణను చేపట్టామని, ఈ ఏడాది వరి నాటు యంత్రాలను అందించనున్నట్లు వెల్లడించారు. రైతులకు అండగా ఉంటూ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకే ఇండియా టుడే అవార్డు దక్కిందని పోచారం తెలిపారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బాహుబలి’ కలెక్షన్ల కంటే తక్కువే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హక్కుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని, విభజన చట్టంలోని అమలు చేయడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్లంత కూడా లేవని చమత్కరించారు. మిత్రపక్షాలను మెప్పించలేకపోయిన బీజేపీ ఇక ప్రజలను ఎలా మెప్పిస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న ఒక్క తెలంగాణ మంత్రి దత్తాత్రేయను తొలగించారని అన్నారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ అంబర్‌పేట దాటి మాట్లాడరని చెప్పారు. కోమటిరెట్టి తలుపు తట్టి వెళ్లారు.. గద్వాలలో చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నానని అన్నారు. గతంలో లాగే ఉత్తమ్ మళ్లీ వెనక్కు తగ్గారన్నారు. అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్ తప్పుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలను ఎప్పుడో ఛీ కొట్టారని, భవిష్యత్‌లో తమ బలం పెరుగుతుందన్నారు. కోమటిరెట్టి వెంకటరెడ్డి తమ తలుపు తట్టి వెళ్లారని, ఆయన చరిత్ర అందరికీ తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు. -
హరీష్‌రావు లేఖకు దేవినేని స్పందన
అమరావతి: ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల రాసిన లేఖకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ హరీష్‌రావుకు రాసిన లేఖలో దేవినేని పేర్కొన్నారు. మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీష్‌కు సూచించారు. -
మేడారం జాతరకు రండి
న్యూఢిల్లీ: మేడారం జాతరకు రావాల్సిందిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతిని ఈ ఉదయం కలిసిన ఆయన జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్నఈ మహా జాతరకు రావాల్సిందిగా కోరారు. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, పలువురు ఎంపీలు ఉన్నారు. -
మా ప్రమేయం లేదు: మంత్రి
నల్లగొండ: రెండు పడకల ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో తమ ప్రమేయం ఎంతమాత్రం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఇండ్ల నిర్మాణం జరగాల్సిన గ్రామాలను మాత్రమే తాము గుర్తిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అస్సలు ఇల్లు లేని వారితో పాటు పూర్తిగా పూరి గుడిసెల్లోనూ, రేకుల ఇండ్లలో ఉండే వారిని లబ్దిదారులుగా చేస్తే ఎంపిక సులభతరమవుతుందని సూచించారు. ఇండ్ల స్థలాల గుర్తింపులో గ్రామాల నాయకులను, పెద్దలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందన్నారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత పూర్తిగా అధికారులదేనన్నారు. దీనిపై ఆర్డీవోలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రావుతోపాటు అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి జగదీశ్‌రెడ్డికి తప్పిన ప్రమాదం
కాన్వాయ్కి అడ్డొచ్చిన ఇన్నోవాను తప్పించబోయి ప్రమాదం కట్టంగూర్: మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్కి అడ్డొచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మంత్రి సూర్యాపేట జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం స్టేజీ వద్దకు ఆయన కాన్వాయ్ రాగానే అదే సమయంలో గ్రామంలో నుంచి ఓ ఇన్నోవా కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చింది. దానిని తప్పించేందుకు కాన్వాయ్‌లో ముందున్న వాహన డ్రైవర్ పూర్తిగా కుడివైపునకు తిప్పాడు. దీంతో ఆ వాహనం హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు వైపునకు దూసుకెళ్లింది. ఇదే క్రమంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మంత్రి కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టింది. వాహనంలో ఉన్న మంత్రి అటెండర్ లింగయ్య, భద్రతాధికారి అవినాశ్‌రెడ్డి, మంత్రి బంధువు కరుణాకర్‌రెడ్డి, ఇన్నోవా డ్రైవర్ కృష్ణతో పాటు గరిడేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరెపూరి సత్యానికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరిలో లింగయ్య, సత్యం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు తరలించారు. -
తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం
-
హీరోయిన్ పై కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: చేనేతను ప్రోత్సహించేలా హీరోయిన్ సమంత ముందుడుగు వేయడం పట్ల తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు దుబ్బాక, పోచంపల్లిలో సమంత పర్యటించడం మంచి పరిణామమని ట్విటర్ లో కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చేనేత ప్రచారకర్తగా ఉన్న సమంత గత శుక్రవారం(మార్చి 10) సిద్దిపేటలో పర్యటించారు. పలు చేనేత సహకార సంఘాలను సందర్శించారు. చేనేత కార్మికులను కలసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు. తర్వాత దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి మగ్గాల మీద తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించారు. ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించారు. మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల ఇక్కత్ వస్త్రాలను, డిజైన్లను పరిశీలించారు. చేనేత సంఘం పనితీరు, నేత కార్మికుల నైపుణ్యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన కార్యక్రమానికి మద్దతు పలకడంతో సమంతకు గతంలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోచంపల్లి చీర, శాలువాను ఆమెకు బహూకరించారు. Good start @Samanthaprabhu2 Understanding the nuances & real issues faced by Handloom weavers with your field tours to Dubbak & Pochampalli pic.twitter.com/y3dcWk0tcf — KTR (@KTRTRS) 17 March 2017 -
కేసీఆర్ నిర్ణయాలు కూడా మారాయి: కేటీఆర్
హైదరాబాద్: పాలన ప్రజలకు మరింత చేరువయ్యేందుకే జిల్లాలు పెరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై విమర్శలు అర్థరహితమన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకుడుని, పాతఛత్రం నుంచి బయటపడనివారే ఆయనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం అనేకసార్లు నిర్ణయాలు మార్చుకుందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కూడా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. లక్ష అనుమానాల మధ్య పుట్టిన తెలంగాణ రాష్ట్రం రెండేళ్లలో ప్రగతివైపు వెళ్తోందని చెప్పారు. ఒకే ఒక్క రెవెన్యూ డివిజన్ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలకు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. అనేక ఏళ్లు అధికారంలో ఉండి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేనివాళ్లు తమను విమర్శించడం శోచనీయమన్నారు. సీఎంగా కేసీఆర్ ప్రతిరోజు ప్రజలను కలవాల్సిన పనిలేదని, ప్రజాదర్బార్ నిర్వహించడానికి మనం రాచరికంలో లేమని పేర్కొన్నారు. జీహెచ్ ఎంసీ పనితీరులో సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అధికారుల బదిలీలు, కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యాన్ని మారుస్తామన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మజ్లిస్ మతతత్వ పార్టీ కాదనీ, ప్రజలకు సేవ చేస్తుంది కాబట్టే ఎంఐఎం మళ్లీమళ్లీ గెలుస్తోందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందన్నారు. ఈ నెల 12న వారం రోజుల పర్యటనకు అమెరికా వెళ్తున్నానని వెల్లడించారు. సిలికాన్ వ్యాలీలో టి.బ్రిడ్జ్ ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్ లో ఫార్మాసిటీ కోసం అమెరికా కంపెనీలతో సంప్రదింపులు జరపనున్నట్టు కేటీఆర్ తెలిపారు. -
తెలంగాణ 11 ప్రాజెక్టులకు నాబార్డు నిధులు
-
పాతాళంలోకి తొక్కిన బుద్ది రాలేదు
-
చంద్రబాబు నన్ను కొట్టారు
♦ అసెంబ్లీలో మంత్రి పోచారం సంచలన వ్యాఖ్యలు ♦ నిజాం చక్కెర కర్మాగారం ప్రైవేటీకరించొద్దనటమే నా నేరం ♦ మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనే తొడపై గట్టిగా కొట్టారు ♦ గుండె మీద కొట్టారని చంద్రబాబుతో అన్నా ♦ మరి అప్పుడే రాజీనామా ఎందుకు చేయలేదు: కాంగ్రెస్ ♦ కిరణ్ తెలంగాణకు రూపాయి ఇవ్వనంటే మీరేం చేశారు: పోచారం ♦ కరువుపై చర్చలో ఆగ్రహావేశాలు.. సభ కాసేపు వాయిదా సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో కీలకమైన నిజాం చక్కెర పరిశ్రమను ప్రైవేటీకరించొద్దని గట్టిగా వ్యతిరేకించినందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నా తొడపై కొట్టారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనే నన్ను గట్టిగా కొట్టడంతో తొడ ఎర్రగా కమిలింది. ఇంతకాలం ఈ విషయాన్ని నేను బయటపెట్టలేదు..’’ అంటూ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాడు కొట్టింది తొడ మీద కాదు గుండె మీద అంటూ ఆవేదనతో చెప్పారు. దీంతో సభలో కాసేపు గంభీర వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లావాసినైన తాను స్థానికంగా ఉన్న నిజాం చక్కెర పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా చేసిన ప్రయత్నాలను చంద్రబాబు విఫలం చేశారని పోచారం పేర్కొన్నారు. బుధవారం సభలో కరువుపై చర్చ జరుగుతుండగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై తన వాదనను వినిపించే క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షం-రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటుచేసుకోవటంతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు మైక్ ఇవ్వకుండా స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. రైతు మంత్రి అయితే సాగు బాగుంటుందనుకున్నా.. కరువుపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ వచ్చాక కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. రైతు అయిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ మంత్రి అయితే మంచి రోజులు వస్తాయని ఆశించానని, కానీ తీరు మారలేదన్నారు. 2014లో కరువు సాయం కోసం కేంద్ర ంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడంతో టీడీపీ పక్షాన తామే కేంద్రమంత్రిని కలిశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రానిదే తామేం చేస్తామని ఆ మంత్రి వ్యాఖ్యానించారని, ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ కరువు వచ్చినా అదే తీరు కొనసాగుతోందని ఆరోపించారు. జిల్లాల వారీగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంబంధించి ఎన్సీఆర్బీ నివేదికను చదివిన ఆయ న... ప్రభుత్వం వారి సంఖ్య తగ్గించి సాయం చేసిందని విమర్శించారు. దీంతో మంత్రి పోచారం కలుగజేసుకుంటూ... 1998 నుంచి 2014 వరకు అదే ఎన్సీఆర్బీ నివేదికలోకి అంకెలు చదివి అప్పట్లో ప్రభుత్వ సాయం పొందిన రైతుల సంఖ్యను పోల్చి చెప్పారు. టీడీపీ హయాంలో రైతుల సంఖ్య ఎందుకు తగ్గించారని రేవంత్‌ను ప్రశ్నించారు. అందుకు రేవంత్ స్పందిస్తూ... నాడు ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను టీడీపీ ప్రభుత్వం తగ్గిస్తే, అప్పట్లో పోచారం, కడియం, తుమ్మల, తలసాని అక్కడ అధికారం చెలాయించినవారే కదా అంటూ ఎదురుదాడి చేశారు. దెబ్బ తగిలిన ప్రాంతం కమిలిపోయింది రేవంత్ ఆరోపణలతో మళ్లీ జోక్యం చేసుకున్న పోచారం మాట్లాడారు. ‘‘నాడు మేం అధికారాన్ని చలాయించి ఉండొచ్చు. ఎప్పుడైనా సీఎం నిర్ణయాలమీదే ఫలితాలుంటాయి. దీనికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణే ఉదాహరణ. దాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మంత్రిగా వ్యతిరేకించాను. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో స్థానికుడినైన నన్ను వేయకుండా యనమల రామకృష్ణుడు, విద్యాధరరావులను నియమించారు. అది మదర్ యూనిట్ అని, దానివల్ల పది యూనిట్లు ఏర్పడ్డాయన్నా. నష్టాల పేరుతో ప్రైవేట్‌పరం చేయొద్దని కోరా. తుది నిర్ణయం కోసం ఉపసంఘం భేటీ అయినప్పుడు వెళ్లి మళ్లీ కోరాను. దీంతో పక్కనే కూర్చున్న చంద్రబాబు కోపంతో నా తొడపై గట్టిగా కొట్టారు. ధోవతి కట్టుకుని ఉంటా కదా.. దెబ్బ తగిలి ఆ ప్రాంతం ఎర్రగా కమిలింది. ఆ తర్వాత ఆయన సారీ చెప్పి ఇరిటేషన్లో కొట్టానన్నారు. కానీ ఆయన కొట్టిన దెబ్బ గుండెల మీద తగిలిందని చంద్రబాబుతో అన్నాను. కానీ ఇప్పుడు కేసీఆర్ తీరు వేరు. ఆయన వద్ద పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా..’’ అని పోచారం అన్నారు. స్పీకర్ వివక్ష చూపుతున్నారు: కాంగ్రెస్ తాము మాట్లాడుతుంటే మధ్యలో మైక్ కట్ చేసి మంత్రులకు మాత్రం మాటిమాటికి అవకాశం ఇస్తూ స్పీకర్... ప్రతిపక్షంపై వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతుండగా మైక్ క ట్ చేయటంతో పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సభ గందరగోళంగా మారడంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. సీఎంలు కొడతారని ఇప్పుడే వింటున్నా ‘‘సీఎంలు మంత్రుల్ని కొడతారన్న విషయం ఇప్పుడే వింటున్నా. ఆ రోజు ఆ సీఎం కొట్టిన విషయాన్ని ఈ రోజు బయటపెట్టిన పోచారం.. మరి ప్రస్తుత సీఎం కొట్టే దెబ్బలు మరో సందర్భంలో బయటపెడతారా’’ అని రేవంత్ ప్రశ్నించారు. గత 102 రోజులుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని రైతులు ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. బాబు కొట్టినా పదవుల కోసం అక్కడే పడి ఉన్న మీరు కేసీఆర్ పాపాలను కూడా చూస్తూ పడి ఉంటారా అని ప్రశ్నించారు. నిజాం ఫ్యాక్టరీని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని... సీఎం కొడితే అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదు, ఇప్పుడెందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రశ్నించారు. ఆయన మాటలు పూర్తి కాకముందే స్పీకర్ మైక్ కట్ చేశారు. అందుకు ఇదే సభలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే మంత్రులుగా ఉన్న మీరెందుకు రాజీనామా చేయలేదని పోచారం ఎదురు ప్రశ్నించారు. -
చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు: తలసాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాలు తిరుగుతున్నప్పటికీ పెట్టుబడులైతే రావడం లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ఏం మాట్లాడారంటే.. 'పారిశ్రామిక వేత్తలెవరూ చంద్రబాబును నమ్మలేదనడానికి పెట్టుబడులు రాకపోవడమే నిదర్శనం. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ ప్రాంత స్నేహితులు నాకు చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడానికి మొత్తం మంత్రివర్గాన్ని వాడుకుంటున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వైఎస్ జగన్ ఒక్కరే కాదు.. ఇతర విపక్ష పార్టీ నేతలందరూ దూరంగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారు. ఇప్పుడు ఏపీలో మరోసారి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. కాపులు, బీసీల మధ్య పెడుతున్న చిచ్చు తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటుంది. హామీలు నెరవేర్చకపోవడంతోనే ఏపీలో కాపులు ఉద్యమ బాట పట్టారు. బడ్జెట్లో కాపులు కేటాయించిన రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తారనేది అనుమానమేనని' తలసాని దుయ్యబట్టారు. -
'చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు'
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ భవన్ లో మంగళవారం తలాసాని విలేకరులతో మాట్లాడారు. తాను టీఆర్ఎస్ లో చేరినప్పుడు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. ఆయన స్థాయికి తగని భాష వాడారని అన్నారు. చంద్రబాబు మాటలు తమకు బాధ కలిగించాయని చెప్పారు. ఆయన చేస్తే నీతి, వేరే వాళ్లు చేస్తే అవినీతా అని ప్రశ్నించారు. తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళుతున్నారో, లేదో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ఏ ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టాలని అన్నారు. సింగపూర్, మలేసియా కట్టిస్తున్నానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సత్యహరిశ్చంద్రుడు మాదిరిగా మాటలు చెప్పే చంద్రబాబు దారి తప్పారా అని ప్రశ్నించారు. -
పనికిరాని బోరుబావులను మూసేయండి
అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశం నల్లగొండలో శాన్వి మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా వల్లాల గ్రామంలోని బోరుబావిలో పడి రెండేళ్ల బాలిక శాన్వి మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. శాన్వి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శాన్వి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి కేటీఆర్.. నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారు. నిరుపయోగంగా ఉన్న, పనికిరాని బోరుబావులను మూసివేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ సంఘటన జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ప్రమాదకరమైన బోరుబావుల విషయమై ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యజమానిపై క్రిమినల్ కేసు పెట్టండి పనికి రాని బోరుబావులను మూసేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఈ ప్రమాదానికి కారణమైన భూమి యజమానిపై క్రిమినల్ కేసు పెట్టాలని మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. గతంలో పలుమార్లు అధికారుల ద్వారా, మీడియా ద్వారా బోరుబావుల విషయమై ప్రచారం నిర్వహించామని, అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. పనికిరాని బోరుబావుల మూసివేత కార్యక్రమాన్ని అవసరమైతే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. -
స్టేట్ ఫైట్ మాత్రమే..స్ట్రీట్ ఫైట్ కాదు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం స్టేట్ ఉద్యమమని, స్ట్రీట్ ఫైట్ కాదని తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ...దళితులకు, మైనార్టీలకు అందిస్తున్న కల్యాణలక్ష్మీ పథకాన్ని త్వరలోనే బీసీ సామాజిక వర్గాలకు కూడా వర్తింపు చేస్తామన్నారు. నగర ప్రజలు అన్ని పార్టీలకు మేయర్ అవకాశం కల్పించారని.... కానీ, నగర అభివృద్ధికి ఏ పార్టీ చిత్తశుద్ధితో పని చేయలేదని ఆయన అన్నారు. తమకు అవకాశమిస్తే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపిస్తామని కేటీఆర్ తెలిపారు. -
'అందుకే తోటపల్లి రద్దు చేశాం'
కరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం కరీంనగర్లో స్పందించారు. ఖర్చు అధికం ప్రయోజనం స్వల్పం కాబట్టే తోటపల్లి రిజర్వాయర్‌ను తమ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకే అప్పగిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తోటపల్లి చెరువును రూ. 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని హారీశ్ రావు వెల్లడించారు. -
వాళ్లేమీ చిన్న పిల్లలు కాదు
-
వాళ్లేమీ చిన్న పిల్లలు కాదు: కేటీఆర్
హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లోకి చేరుతున్న నేతలంతా చిన్న పిల్లలేమీ కాదని తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సచివాలయంలో శుక్రవారం మంత్రులు టి.పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాయకులను ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నామంటూ వస్తున్న వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులకు ఆకర్షితులై, ప్రజల అభిమతం మేరకే వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వస్తున్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే కోతలు లేని విద్యుత్ అందించామన్నారు. హైదరాబాద్ చుట్టూ 78 కిలోమీటర్ల పొడవునా 400కేవీ విద్యుత్ లైన్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి తలసాని మాట్లాడుతూ... స్వచ్చ హైదరాబాద్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. నగరంలో నీటి సమస్య కొత్తగా వచ్చినదేం కాదని, దీన్ని పరిష్కరించడం కోసం సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తలసాని చెప్పారు. -
'పార్టీ సత్తా ఏమిటో వచ్చే నెలాఖరున చూపిస్తాం'
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సత్తా ఏమిటో జనవరి నెలాఖరు నాటికి చూపిస్తామని తెలంగాణ ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కొత్తవారు చేరికతో పార్టీలో ఏర్పడే ఇబ్బందులు సాధారణమే అని కేటీఆర్ తెలిపారు. ఎవరిని ప్రలోభాలకు గురి చేయడం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడాది 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలు పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. రానున్న తరాలకు పవర్ కట్ అంటే ఏమిటో తెలియకుండా చేస్తామన్నారు. పరిశ్రమలకు పవర్ హాలీడే లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగూడెం ప్లాంట్‌లో 30 శాతం ఉత్పత్తి పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా వాడుతున్న హెలికాప్టర్ కేబిన్... హైదరాబాద్‌లోనే తయారు అయిందని చెప్పడానిక గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు. -
'టీడీపీ, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది'
వరంగల్ : టీడీపీ, బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డబ్బులిచ్చి ఓటర్లను కొనాలని ఆ రెండు పార్టీలు చూస్తున్నారని ఆరోపించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఆ క్రమంలో వరంగల్‌లో హరీష్‌రావు పర్యటిస్తూ... ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, టీడీపీ- బీజేపీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 28వ తేదీన వరంగల్ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలు తేదీ నవంబర్ 4తో ముగిసింది. నవంబర్ 21న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 24న ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. -
రైతుల రాష్ట్రంగా తెలంగాణ
నల్గొండ: ఫాలిహౌజ్ సబ్సిడీలకు రూ. 250 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండ జిల్లా భువనగిరిలో ఫాలిహౌజ్ను మంత్రి పోచారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుంట గుంటకు సాగు నీరు.... ఇంటింటికి మంచి నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. అప్పులు, ఆత్మహత్యలు లేని రైతుల రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్దుతామని పోచారం స్పష్టం చేశారు. -
రేవంత్ ఓ జోకర్, బ్రోకర్
ఆదిలాబాద్ : టీటీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్‌రెడ్డిపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న నిప్పులు చెరిగారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి ఓ జోకర్, బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. రైతుల ధర్నా పేరిట టీటీడీపీ నిర్వహించిన ధర్నాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. రేవంత్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు జోగు రామన్న వివరించారు. -
రైతుల పేరుతో రాజకీయాలా?: మంత్రి హరీశ్
రైతుల పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు రైతులు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్‌రెడ్డి లు అధికారంలో ఉన్న పదేళ్లలో ఏ ఒక్క రోజైనా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించారా అని అడిగారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు గత పాలకులే కారణమని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను విమర్శిస్తున్న టీడీపీ, బీజేపీ, సీపీఐ నాయకులు ఆంధ్రాలో రుణమాఫీ చేయని ఎందుకు అడగటం లేదన్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. -
దసరా తర్వాతే పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీ
-
హైదరాబాద్‌లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
-
వైద్య ఆరోగ్యశాఖలో మార్పులకు కమిటీ
మహబూబ్‌నగర్ : తన శాఖలో సమూల మార్పులకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అందులోభాగంగా బొమ్రాజ్పేట బ్రిడ్జి తోపాటు కొడంగల్, కోస్గిలో 100 పడకల ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా పరిగిలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే 60 నెల్లో రైతుల ఆత్మహత్యలు లేకుండా చూస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. -
'వాళ్లు అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల అన్ఎంప్లాయిమెంట్తో బాధపడుతున్నారని ఆ రాష్ట్ర వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎద్దేవా చేశారు. ఒక్క మున్సిపల్ కార్మికుడు కూడా వెంట లేకుండా సచివాలయం వద్ద ధర్నా ఎందుకు చేస్తున్నట్లు అంటూ ఆయన కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ నేతలు పేదల కోసం ఉద్యమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సచివాలయం ముట్టడి కోసం యత్నించడంపై తలసాని శ్రీనివాస యాదవ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో మున్సిపల్ కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అలాగే మున్సిపల్ కార్మికుల మిగిలిన సమస్యలు కూడా సానుభూతితో పరిష్కరిస్తామని తలసాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ధర్నాలు వద్దు దరఖాస్తు చేసుకుంటే చాలని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం చెబుతుందని ఆయన గుర్తు చేశారు. -
ఆర్థిక మంత్రి కారు ఉండేది ఇలాగా?
తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఉపయోగిస్తున్న వాహనం కండిషన్ మీద అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థికమంత్రి ఉపయోగించే వాహనానికి ఉన్న నాలుగు టైర్లూ బాగా అరిగిపోయినా వాటిని మార్చకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. రోడ్డు ప్రమాదంలో పల్టీలు కొట్టిన వాహనం వెనకవైపు టైరు బరస్ట్ అయినట్లు ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. ముందు టైర్లు, వెనక టైర్లు కూడా బాగా అరిగిపోయాయి. ఇదే వాహనం ఇంతకుముందు నెలరోజుల క్రితం ఒకసారి ప్రమాదానికి గురైంది. అప్పట్లో తాడిచెట్టును ఢీకొన్న ఈ వాహనం బాగా ధ్వంసమైంది. తర్వాత దానికి మరమ్మతులు చేయించారు. కనీసం ఆ సమయంలోనైనా వాహనం టైర్ల గురించి పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సుదూర పర్యటనలకు సైతం ఉపయోగించే అధికారిక వాహనం టైర్లు అరిగిపోయినా.. వాటిని మార్చాల్సిన సమయం మించిపోయినా పట్టించుకోకుండా వదిలేయడం వల్లనే అది అదుపుతప్పి బోల్తాపడిందా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పరామర్శ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్‌తో ఆయన మాట్లాడారు. కాగా, మంత్రి రాజేందర్‌కు తగిలినవి స్వల్ప గాయాలేనని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంపీ బోయినపల్లి వినోద్ తెలిపారు. -
'చంద్రబాబూ ఓ సారి అద్దంలో ముఖం చూసుకో'
హైదరాబాద్: మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి తన ఘనతేనంటున్న చంద్రబాబు ఓ సారి అద్దంలో ముఖం చూసుకోవాలని తలసాని సూచించారు. ఏపీకి సంపద మీరు సృష్టించుకోండని... పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అయ్యా, బాబులు ఎంత కొట్టేస్తున్నారో నాకు తెలుసునని తలసాని ఈ సందర్భంగా వెల్లడించారు. జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 7వ తేదీన ట్యాంక్ బండపై ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని తలసాని సూచించారు. -
'రాహుల్ గాంధీది ఇంపోర్టెడ్ పాదయాత్ర'
-
'రాహుల్ గాంధీది ఇంపోర్టెడ్ పాదయాత్ర'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది ఇంపోర్టెడ్ పాదయాత్ర అని తెలంగాణ న్యాయ, గృహనిర్మాణ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చేపట్టి కిసాన్ రైతు భరోసా యాత్రలో స్థానికులు ఎవరు పాల్గొన లేదని... ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే పాల్గొన్నారని ఆయన విమర్శించారు. రాహుల్ పాదయాత్రపై గాంధీభవన్‌లో వేలంవేసి డబ్బులు ఎవరు అధికంగా ఇస్తే వారి జిల్లాల్లోనే పాదయాత్ర ఏర్పాటు చేశారని విమర్శించారు. ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఆదిలాబాద్‌లోనే కాదు.... తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న అన్ని రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేయాలని రాహుల్ గాంధీకి ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నేపథ్యంలో వారిలో భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ శుక్రవారం కిసాన్ సందేశ్ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విధంగా స్పందించారు. -
సీఎం కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెపై చర్చించారు. అదికాక ఆర్టీసీ సమ్మెకు తన మద్దతు ఉంటుందని ఇటీవల హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా భేటీలో చర్చకు వచ్చాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి ఏడో రోజుకు చేరుకుంది. అయితే ఆర్టీసీ కార్మికలు తెలంగాణ మంత్రి వర్గ ఉప సంఘంతో సోమవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ రోజు కూడా కార్మికులు... మంత్రి వర్గ ఉప సంఘంతో భేటీ కానున్నారు. చర్చలు తుది దశకు చేరుకుంటాయని అంతా భావిస్తున్నారు. కాగా తమకు హరీష్ రావు మద్దతు ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసీఆర్... హరీష్ రావు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
తెలంగాణకు డల్లాస్‌లో విరాళాల గలగల
⇒ 2 లక్షల డాలర్ల విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్నారైలు ⇒ 150 ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ అమెరికాలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు రెండు లక్షల అమెరికన్ డాలర్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం డల్లాస్‌లో ఎన్నారైలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన మంత్రి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు ‘వైబ్రంట్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఐటీతో పాటు ఏరోస్పేస్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లో పేరుగాంచిన సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. టీ-హబ్‌తో యువత ఆశలకు రెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ-హబ్ ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి, వారి ఆశలు నెరవేర్చనున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. డల్లాస్‌లో 150 ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఐటీసర్వ్ అలయన్స్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సదుపాయాల గురించి ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం డల్లాస్‌లోని సిమా క్లబ్లో ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక పెట్టుబడుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సహకార ధోరణితో ముందుకు సాగుతుందన్నారు. కేటీఆర్ వెంట టిటా, టాటా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. -
'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి'
హైదరాబాద్: మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. యూఎస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆదివారం డల్లాస్‌లో నిర్వహించిన ఐటీ సర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ కంపెనీ ప్రతినిధులు, ఎన్నారైలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై కేటీఆర్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో కంపెనీలు పెడితే ప్రభుత్వపరంగా అన్నివిధాల సహకారం అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా ఎన్నారైలకు హామీ ఇచ్చారు. కేటీఆర్ రెండు వారాల అమెరికా పర్యటనలో మే 5వ తేదీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన మే 16వ తేదీన భారత్ తిరిగి ప్రయాణం అవుతారు. -
సీఎం ఏం మాయ చేశారో!
వచ్చే ఏడాది నుంచి కోతలుండవ్: హరీశ్‌రావు సిద్దిపేట రూరల్: సీఎం కేసీఆర్ ఏం మాయ చేశారోగానీ, వచ్చే ఏడాది నుంచి రెప్పపాటు కూడా కరెంటు పోదని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేసవిలోనే కరెంట్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని, ఇది సీఎం పట్టుదల, పాలనాదక్షతకు నిదర్శనమన్నారు. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌తోపాటు 24 గంటల సింగిల్ ఫేజ్‌లో నాణ్యమైన కరెంటు అందజేయనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ఎర్రబుగ్గలు లేకుండా విద్యుత్ వాడుకోవాలని, దీంతో కరెంటు ఆదాతోపాటు బిల్లు కూడా తగ్గుతుందన్నారు. మంచి నీటి కొరత తీర్చేందుకు ఫెయిర్వాల్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికీ నీటిని అందజేస్తామన్నారు. -
అవినీతిఆరోపణలపై ఆధారాలుంటే నిరూపించు!
-
వాకర్స్‌తో మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జలగం వెంగళరావు పార్కు.. సమయం ఉదయం ఆరు గంటలు.. అప్పుడే కప్పుకున్న మంచుదుప్పటిని తొలగించుకుంటూ నిద్రలేస్తున్న సూర్యుడు.. పాదచారుల అడుగుల సవ్వడితో పార్కంతా సందడి సందడిగా ఉంది.. అంతలోనే అక్కడికి ఒక వాహనం వచ్చి ఆగింది.. అందులోంచి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దిగారు. దిగడంతోనే పార్కులోని చెరువును పరిశీలించిన ఆయన ఆ తర్వాత పాదచారులతో కలిసి సరదాగా కాసేపు వాకింగ్ చేశారు. ఇదంతా ఎక్కడో కాదు.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌నంబరు 1లోగల జలగం వెంగళరావు పార్కులో సోమవారం ఉదయం జరిగింది. -
జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ
హైదరాబాద్: మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై లోకాయుక్త సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఉన్నతాధికారులు కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో నివేదిక సమర్పించడానికి 4 వారాల గడువు కోరిన ఉన్నతాధికారుల విఙ్ణప్తిని లోకాయుక్త తిరస్కరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాల్సిందేనని లోకాయుక్త, జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
'టీటీడీపీ సభ్యులకు క్లారిటీ లేదు'
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలవి అంతా డ్రామాలేనని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు మాట్లాడుతూ...టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిందని తెలిపారు. టీడీపీ సభ్యులకు క్లారిటీ లేదని ఆరోపించారు. సభ ప్రారంభానికి ముందే తీర్మాన నోటీసు ఇవ్వాలని తెలియదా అని ఆయన టీటీడీపీ సభ్యులను ప్రశ్నించారు. టీటీడీపీ నేతలు... సీఎల్పీనేత జానారెడ్డి వద్దకు వెళ్లి అభాసుపాలైయ్యారని విమర్శించారు. -
'జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టాలి'
హైదరాబాద్: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అవినీతిపై మార్చి2 తేదీ లోపల విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ అవినీతిని నిరూపించే ఆధారాలు ఉన్నాయని, వాటిని కమిషన్ కు అందజేస్తామన్నారు. ఒకవేళ కమిషన్ ఏర్పాటు చేయకుంటే ఏసీబీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్లో కమీషన్ తీసుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారని, అలాంటి వారికి ఎమ్ఎల్సీ టికెట్ ఇవ్వడం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. -
'అవినీతి వల్లే జగదీశ్ రెడ్డి శాఖ మార్పు'
తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన శాఖను మార్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. రెండు దఫాలుగా కాలేజీలకు విడుదల చేసిన రూ. 1,360 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్లో మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 5 శాతం చొప్పున కమీషన్లు తీసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీనిపై విచారణకు ఆదేశిస్తే.. ఈ వ్యవహారంలో జరిగిన మొత్తం అవినీతిని తాము నిరూపిస్తామని పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి సంపాదించిన నిధులతో కోళ్లఫారాలలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారని, అలాంటి 200 ఇంజనీరింగ్ కళాశాలలను కేసీఆర్ రద్దు చేశారని చెప్పారు. అయితే.. కేవలం కాలేజీల రద్దుతోనే సరిపెట్టేసిన సర్కారు.. వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ ప్రశ్నించారు. -
అధికారులపై నిప్పులు చెరిగిన హరీష్
హైదరాబాద్: మిషన్ కాకతీయ తొలి దశ వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చెరువుల పునరుద్దరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్బంగా హరీష్‌రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణలో పారదర్శకంగా నిధులను వినియోగిస్తామని చెప్పారు. మిషన్ కాకతీయలో రెవిన్యూ సిబ్బంది భాగస్వామ్యం కావాలి, చెరువులు కబ్జా కాకుండా చూడాలని తెలిపారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ ఇరిగేషన్ అధికారులు వ్యవహారంపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. పద్దతి మార్చుకోవాలంటూ అధికారులను హెచ్చిరంచారు. కుత్బుల్లాపూర్‌లో కబ్జాకు గురైన చెరువుల్లో నిర్మాణాలు తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఈటెల, మహేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. -
పొన్నాల వద్ద భూమి... నిబంధనలకు విరుద్ధం
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని... ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పలేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఆరోపించారు. ఆ భూముల్లో ఫౌల్ట్రీ ఫామ్‌ను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో పొన్నాల లక్ష్మయ్య భూములపై హరీష్‌రావు చర్చించారు. తక్కువ ధరకు విక్రయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుంటే తమకు అప్పగించాలని 2013లోల ఏపీఐఐసీ వెల్లడించిందని గుర్తు చేశారు. కానీ పొన్నాల మాత్రం ఆ భూములు అప్పగించలేదని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరాకు రూ. 25,500లకే కేటాయించారని హరీష్‌రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ.. విక్రయిచండ కాని చేయకుడదని ఆయన వెల్లడించారు. -
వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు: కేటీఆర్
హైదరాబాద్: వరంగల్ నగరంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ... సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాబోయేరోజుల్లో రాష్ట్రంలోని పరిశ్రమలకు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ప్రతి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. అంతకుముందు గీతారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం ఎప్పుడు వస్తుంది... ఆ విధానంలోని ప్రధాన అంశం ఏమిటీ... అని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా...ఎస్సీలు, ఎస్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని గీతారెడ్డి వెల్లడించారు. దాంతో కేటీఆర్ పై విధంగా స్పందించారు. -
నా మాటలు కొన్ని పత్రికలు వక్రీకరించాయి: పోచారం
నిజామాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు వాస్తవమేనని తాను చెప్పిన వాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌లో మాట్లాడుతూ... ఈ వ్యవహరంలో కొన్ని పత్రికల తీరును ఆయన ఖండించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తాను రైతు బిడ్డలమేనని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రంలో రైతుల రుణమాఫీనే చేయలేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. -
నీతులు చెబుతున్న హరీష్‌రావు: సండ్ర
హైదరాబాద్: గతంలో అసెంబ్లీలో వ్యవహరించిన తీరును మరిచిపోయి భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రస్తుతం నీతులు చెబుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎద్దేవా చేశారు. టీటీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత అసెంబ్లీ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని అధికార టీఆర్ఎస్ నేతలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అందులోభాగంగానే టీడీపీపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో వారి సంఖ్యను తగ్గించారని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా అమరవీరుల త్యాగాలను అవమానిస్తున్నారని సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల అవమానకరంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారంతో క్షమాపలు చెప్పించాలని అధికార పార్టీకి సూచించారు. ఆ తర్వాతే ఎలాంటి చర్చకైనా సిద్ధమని సండ్ర స్పష్టం చేశారు. ప్రతిపక్షంగా ఉండాల్సిన ఎంఐఎం అధికార పార్టీకి తొత్తుగా మారి భజన చేస్తుందని విమర్శించారు. తమపై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ను డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ టీటీడీపీ శుక్రవారం సభ కార్యక్రమాలకు అడ్డుతగిలింది. ఆ క్రమంలో టీటీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయాలని సభలో హరీష్ రావు తీర్మానం ప్రవేశ పెట్టారు. దాంతో స్పీకర్ టీటీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రోజు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావుపై సండ్ర వెంకట వీరయ్య పైవిధంగా స్పందించారు. -
'రైతు మరణాలను రాజకీయం చేస్తున్నారు'
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతు మరణాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ఆరోపించారు. రైతుల మరణాలన్నీ ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం జరగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యపై ఆర్డీవో స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. తాము కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడం లేదంటూ... టి.టీడీపీ నేతల దుష్ప్రచారం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారమిస్తూ అవసమైన సహకారం కోరుతున్నామని పోచారం తెలిపారు. -
'టీటీడీపీ నేతలు చిల్లరవేషాలు మానుకోవాలి'
న్యూఢిల్లీ: కృష్ణపట్నం, లోయర్ సీలేరులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎందుకివ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ... విద్యుత్ విషయంలో టీటీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చి విజ్ఞప్తి చేయకుండా... చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. ఇకనైనా చిల్లర వేషాలు మానుకోవాలని తెలంగాణ టీడీపీ నేతలకు కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా ఇప్పించాలని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రవిచంద్ర ప్రసాద్‌లకు కలసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అలాగే తెలంగాణకు సహకరించాలని కూడా కోరినట్లు... అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కరెంట్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా జవాబు చెప్పలేదని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'వాళ్లు... అందుకే మా పార్టీలో చేరుతున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమాశంలో మాట్లాడుతూ... ఆ రెండు పార్టీలు యాత్రలు, ధర్నాల పేరుతో మభ్యపెడుతున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయా పార్టీల నేతలే నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు సంధించాయి. అందులోభాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేందుకు ఆ రెండు పార్టీలు బస్సు యాత్రలు చేపట్టాయి. దీంతో ఆ పార్టీలపై అధికార టీఆర్ఎస్ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికకు మద్దతు కూడగడుతున్న టీఆర్ఎస్
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని చెబుతున్న టీఆర్ఎస్.. ఆ దిశగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు సమాయత్తమైంది. అందులోభాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో వామపక్షాలు సీపీఐ, సీపీఎం కార్యదర్శలు చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని హరీష్ రావు వారికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ శాసనసభ, మెదక్ పార్లమెంట్ స్థానాల నుంచి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిలను బరిలోకి దింపాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాత్రికిరాత్రే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. -
మెట్రో రైలును 250 కి.మీ పొడిగిస్తాం: కేటీఆర్
-
మెట్రో రైలును 250 కి.మీ పొడిగిస్తాం: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు కేవలం 72 కిలో మీటర్లకే పరిమితం చేయమని తెలంగణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2040 నాటికి రైల్వే సర్వీసును 250 కి.మీ మేర విస్తరిస్తామని చెప్పారు. శుక్రవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... మెట్రో రైలు నిర్మాణంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అవాంతరాలు వచ్చిన మెట్రో పనులు పూర్తి చేస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్న సాధ్యమైనంత తర్వలో వాటిని అధిగమిస్తామని చెప్పారు. భూగర్బ రైలు మార్గానికి సంబంధించి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మెట్రో రైలు కవర్ కానీ ప్రాంతాలలో బీఆర్టీఎస్,ఎల్ఆర్టీఎస్ రైలు సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెట్రో రైలు పనులు జరుగుతాయని తెలిపారు. -
'సమైక్యాంధ్ర పాలనలో రాష్ట్రం నాశనమైంది'
సమైక్యాంధ్ర పాలనలో రాష్ట్రం నాశనమైందని విద్యాశాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అలాగే వారి పాలనలో విద్యావవస్థ కూడా సర్వనాశనమైందని విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలన్నీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా జగదీశ్ రెడ్డిపై విధంగా స్పందించారు. తమకు పక్కా ఇళ్లు కేటాయించాలని, తమ పిల్లలకు ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు జగదీశ్ రెడ్డిని కోరరు. అందుకు మంత్రి జగదీశ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
అసెంబ్లీని అర్ధవంతంగా నడిపిస్తాం: హరీష్‌రావు
తెలంగాణ శాసనసభను అర్థవంతంగా నడిపిస్తామని మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సచివాలయంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని బోయనపల్లి కూరగాయల మార్కెట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్‌గా మారుస్తూ రూపొందించి దస్త్రంపై హరీష్ రావు తొలి సంతకం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. -
అసెంబ్లీని ప్రొరోగ్ చేయవద్దు-తెలంగాణ మంత్రులు
-
ఆరుగురు తెలంగాణ మంత్రులు సీఎంతో భేటీకి డుమ్మా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పద్నాల్గవ ఆర్థిక సంఘం పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మంత్రుల సమావేశానికి తెలంగాణకు చెందిన ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యూరు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రసాద్ కుమార్, దానం నాగేందర్, రామిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి అనేక సార్లు సమైక్య వాదం వినిపించడంవల్లనే రాజనర్సింహ, జానారెడ్డి గైర్హాజరయ్యూరని భావిస్తున్నారు. సవూవేశానికి18మంది సీవూంధ్ర మంత్రులు రాగా, వారిలో టీజీ వెంకటేశ్, గల్లా అరుణకుమారి, గంటా శ్రీనివాసరావు, శత్రుచర్ల విజయరామరాజు హాజరు కాలేదు. సుమారు 20 నిమిషాల ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,.. చాలా రోజులైనందున ఒకసారి అందరినీ కలిసి నమస్కారం పెడదామని పిలిచానని అన్నట్టు సమాచారం. 14వ ఆర్థిక సంఘం గురు, శుక్రవారాల్లో రాష్ర్ట ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రానికి అత్యంత కీలకమని, ఆర్థిక సంఘం ముందు అందరం కలిసి సమర్థవంతమైన వాదనలు వినిపించాలని, ఇందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సమర్థవంతంగా వాదనలతో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకుందావున్నారు. 20న కేబినెట్ భేటీ కాగా, ఈ నెల 20న వుంత్రివర్గ సవూవేశం ఏర్పాటు చేసుకుని, అదే రోజు అన్ని విషయూలు చర్చించుకుందావుని వుుఖ్యవుంత్రి ఈ సందర్భంగా వుంత్రులతో చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశం తరువాత సీఎం, మంత్రులు కలిసి క్యాంపు కార్యాలయం ఎదుట హోటల్ లో, ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డికి, సంఘం సభ్యులకు, కేంద్ర అధికారులకు విందు ఇచ్చారు.