మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హక్కుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని, విభజన చట్టంలోని అమలు చేయడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్లంత కూడా లేవని చమత్కరించారు. మిత్రపక్షాలను మెప్పించలేకపోయిన బీజేపీ ఇక ప్రజలను ఎలా మెప్పిస్తుందని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న ఒక్క తెలంగాణ మంత్రి దత్తాత్రేయను తొలగించారని అన్నారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ అంబర్‌పేట దాటి మాట్లాడరని చెప్పారు.
కోమటిరెట్టి తలుపు తట్టి వెళ్లారు..
గద్వాలలో చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నానని అన్నారు. గతంలో లాగే ఉత్తమ్ మళ్లీ వెనక్కు తగ్గారన్నారు. అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్ తప్పుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలను ఎప్పుడో ఛీ కొట్టారని, భవిష్యత్‌లో తమ బలం పెరుగుతుందన్నారు. కోమటిరెట్టి వెంకటరెడ్డి తమ తలుపు తట్టి వెళ్లారని, ఆయన చరిత్ర అందరికీ తెలుసునని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment