నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేవి అవాస్తవాలని టీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ చెప్పేవి అసత్యాలు అని కొట్టిపారేశారు. వెంటనే మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నాబార్డు మధ్య ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశారు.