వాకర్స్‌తో మంత్రి హరీశ్ రావు | minister T.Harishrao with Walkers in jalagam vengalrao park | Sakshi
Sakshi News home page

వాకర్స్‌తో మంత్రి హరీశ్ రావు

Published Mon, Apr 6 2015 8:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

minister T.Harishrao with Walkers in jalagam vengalrao park

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జలగం వెంగళరావు పార్కు.. సమయం ఉదయం ఆరు గంటలు..
అప్పుడే కప్పుకున్న మంచుదుప్పటిని తొలగించుకుంటూ నిద్రలేస్తున్న సూర్యుడు..
పాదచారుల అడుగుల సవ్వడితో పార్కంతా సందడి సందడిగా ఉంది.. అంతలోనే అక్కడికి ఒక వాహనం వచ్చి ఆగింది..
అందులోంచి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దిగారు.
దిగడంతోనే పార్కులోని చెరువును పరిశీలించిన ఆయన ఆ తర్వాత పాదచారులతో కలిసి సరదాగా కాసేపు వాకింగ్ చేశారు. ఇదంతా ఎక్కడో కాదు.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌నంబరు 1లోగల జలగం వెంగళరావు పార్కులో సోమవారం ఉదయం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement