![Telangana Minister Mallareddy apologizes for Kitty Party comments - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/6/Mallareddy_Apology.jpg.webp?itok=a21qVAF5)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు తెలియజేశారు. మెడికల్ విద్యార్థులకు ఓరియెంటేషన్ డే సందర్భంగా తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయన ఈ పని చేస్తున్నట్లు వెల్లడించారు.
తన కొడుకుని తమ కులం అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆ కోడలు కిట్టీ పార్టీలు, పిక్నిక్‌లు అంటూ తిరిగేదని, అలా కాలేదు కాబట్టే ఇవాళ తన కోడలు తన మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు ఎండీ అయ్యిందని, మీరు(విద్యార్థులను ఉద్దేశించి..) కూడా అలా కష్టపడి చదివితేనే పైకి వస్తారు అంటూ మల్లారెడ్డి కాలేజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో.. ఆయన క్షమాపణలు చెప్పారు. ప్రసంగంలో ఏదో ఫ్లోలో అలా మాట్లాడానని, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు ఆయన వీడియోలో వెల్లడించారు. సక్సెస్ కోసం కష్టపడితే.. లైఫ్ పార్ట్‌నర్‌లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారంటూ విద్యార్థులకు హితబోధ చేసే సమయంలో చామకూర మల్లారెడ్డి పైవ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment