T.harishrao
-
రైతుల సంక్షేమమే లక్ష్యం
సాగునీరు అందించి తీరుతాం కోల్డ్‌స్టోరేజీలు, గోడౌన్ల నిర్మాణానికి పెద్దపీట రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు కరీంనగర్: రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, పథకాలను సద్వినియోగం చేసుకుని అన్నదాతలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడాలేని విధంగా మార్కెట్‌కమిటీ పాలకవర్గం నియామకాల్లో రిజర్వేషన్ విధానాన్ని పాటించామని చెప్పారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని, రైతులకు ఉపయోగపడేలా గోడౌన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టంచేశారు. జిల్లాలో 8 మార్కెట్‌యార్డుల్లో ఆన్లైన్ కోనుగోలు విధానం అమలుచేయనున్నట్లు వివరించారు. రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కోల్డ్‌స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఉత్తరాదిలో అమలు చేస్తున్న డ్రైయర్స్ విధానాన్ని జమ్మికుంట మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. జమ్మికుంట, హుజూరాబాద్ యార్డుల్లో ఆధునిక రైతు బజారులను ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. గోదావరి జలాలు తీసుకొస్తాం.. సాగు,తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రూ.25వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతీ ఎకరాకు గోదావరి జలాలను తీసుకొస్తామని హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి వంటి మెట్టప్రాంతాలకు కాలువల ద్వారా 1.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 12 నుంచి 16 నెలల్లో పూర్తిచేసి కరీంనగర్‌లోని ప్రతీపొలానికి రెండు పంటలు పండేలా నీరందిస్తామని అన్నారు. ముంపు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని స్పష్టంచేశారు. – ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అధికారాన్ని బాధ్యతగా స్వీకరించి రైతుల బాగోగులే లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఉత్తరతెలంగాణ జిల్లాల్లోనే గొప్పగా కరీంనగర్ మార్కెట్‌యార్డును తీర్చిదిద్దేలా పనిచేయాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, సింగిల్‌విండో చైర్మన్ మంద రాజమల్లు మాట్లాడారు. అనంతరం మార్కెట్‌కమిటీ పాలకవర్గం చైర్మన్ గోగూరి నర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్ ఎస్.రాజేశ్వర్‌రావు, 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్ఎండీలో రోడ్డు పనులకు శంకుస్థాపన ఎల్ఎండీ కట్టపైన రూ.1.60 కోట్ల విలువైన ఎల్ఎండీ కుడివైపు రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. లైటింగ్, వాకర్ట్రాక్ ఏర్పాటుకు మరో రూ.1.40కోట్లు మంజూరు చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జñ డ్పీటీసీలు శరత్‌రావు, సిద్దం వేణు, ఎడ్ల శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కన్నేపల్లిని దత్తత తీసుకుంటా... కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో నిర్మించే మేడిగడ్డ బ్యారేజీ ప్రధాన పంప్‌హౌస్ కన్నేపల్లిలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు కరీంనగర్లో భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును సోమవారం కలిశారు. భూములు కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎకరాకు రూ.15లక్షల పరిహారంతోపాటు కుటంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని వేడుకున్నారు. స్పందించిన మంత్రి హరీష్‌రావు అన్ని భూములకు ఒకే విధంగా పరిహారం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అర్హతకలిగిన యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కన్నేపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు తెలిపారు. కన్నేపల్లి ఉపసర్పంచ్ శనిగరం మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
వాకర్స్‌తో మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జలగం వెంగళరావు పార్కు.. సమయం ఉదయం ఆరు గంటలు.. అప్పుడే కప్పుకున్న మంచుదుప్పటిని తొలగించుకుంటూ నిద్రలేస్తున్న సూర్యుడు.. పాదచారుల అడుగుల సవ్వడితో పార్కంతా సందడి సందడిగా ఉంది.. అంతలోనే అక్కడికి ఒక వాహనం వచ్చి ఆగింది.. అందులోంచి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దిగారు. దిగడంతోనే పార్కులోని చెరువును పరిశీలించిన ఆయన ఆ తర్వాత పాదచారులతో కలిసి సరదాగా కాసేపు వాకింగ్ చేశారు. ఇదంతా ఎక్కడో కాదు.. నగరంలోని బంజారాహిల్స్ రోడ్‌నంబరు 1లోగల జలగం వెంగళరావు పార్కులో సోమవారం ఉదయం జరిగింది. -
నెలాఖరుకు అంచనాలన్నీ పూర్తిచేయండి
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం కేంద్ర సాయం కోసం నివేదికలు పంపండి అనుమతులు పొందిన చెరువులకు వెంటనే టెండర్లు పిలవండి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమం కింద ఈ ఏడాది చేపట్టే చెరువుల అంచనాలన్నీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి చేరిన అంచనాలకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా అనుమతులు వచ్చినా టెండర్లు పిలవడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించిన మంత్రి.. అనుమతులు పొందిన వాటికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోవడానికి 5 రోజుల్లో ముందుకు రాకపోతే నిబంధనల మేరకు టెండర్లను రద్దు చేసి రెండవ కాల్‌కు వెళ్లాలని సూచించారు. అగ్రిమెంట్‌కు రాని కాంట్రాక్టర్‌పై చర్యలకు ఉపక్రమించాలని, మూడేళ్లు వారి బిజినెస్‌ను సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ నెల 15 నుంచి వ్యవసాయాధికారులు రుణమాఫీ పత్రాల పంపకం చేపట్టిన దృష్ట్యా నీటి పారుదల ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలని, ముఖ్యంగా పూడికను పొలాల్లో వేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. ట్రాక్టర్లు, జేసీబీల లభ్యత లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర ఆర్థిక సాయానికి పంపాల్సిన సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి పంపాలని ఆదేశించారు. చెరువుల దత్తతకు, విరాళం ప్రకటించేందుకు ముందుకొచ్చిన వారిని వ్యక్తిగతంగా లేక ఈమెయిల్ ద్వారా సంప్రదించి వారికి తగు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, నారాయణరెడ్డి, సీఈలు రామకృష్ణారావు, రమేశ్, ఎస్పీడీ మల్సూర్ పాల్గొన్నారు. చెరువుల పురోగతి ఇలా.. మొత్తం చెరువులు : 46,447 ఈ ఏడాది చేపట్టనున్నవి : 9,662 సర్వే పూర్తయినవి : 7,212 అంచనాలు పూర్తయినవి : 5,635 పరిపాలనా అనుమతులు లభించినవి : 2,569 టెండర్లు పిలిచినవి : 1,143 -
తెలంగాణకు వచ్చి ఏం చెబుతావ్?
చంద్రబాబుపై హరీశ్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్‌కు వచ్చి ఏం చెప్తావ్? తెలంగాణ రాకుండా అడ్డుకున్నాను. కరెంట్ రాకుండా కుట్రలు చేశాను. పోలవరం విషయంలో ద్రోహం చేశాను. హైదరాబాద్‌లో ఉంటే పరాయి దేశంలో ఉన్నట్లుందని చెబుతావా?’ అని ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో చంద్రబాబు చేయనున్న పర్యటనపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఈ విధంగా స్పందించారు. తెలంగాణలో బాబు పర్యటనను తాము వ్యతిరేకించడం లేదని, అయితే పర్యటనకు కారణాలు చెప్పి రావాలన్నారు. సాగునీటి, మైనింగ్ ఉద్యోగుల విరాళం మిషన్ కాకతీయకు నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావుకు ఇరిగేషన్ ఉద్యోగుల తర పున టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దే వీప్రసాద్ మీడియా సమక్షంలో తెలియజేశారు. శుక్రవారం సచివాలయంలో నీటి పారుదల శాఖ ఉద్యోగుల డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మానికి మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే బాబూమోహన్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డిలతో పాటు నీటి పారుదల శాఖ ఉద్యోగుల సంఘం నేతలు జగదీశ్వర్, నరేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణలో మిషన్ కాకతీయకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఇదే సమావేశానికి హాజరైన మైనింగ్ శాఖ ఉద్యోగుల సంఘం నేతలు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మిడిదొడ్డి వెంకటయ్య రూపొందించిన మన ఊరు-మన చెరువు స్ఫూర్తి గీతాల పాటల సీడీని మంత్రి ఆవిష్కరించారు. -
‘మీ సేవ’లో ఇసుక!
చవకగా అందించేలా నూతన ఇసుక పాలసీ: హరీశ్‌రావు ఆన్లైన్ ద్వారా ఇంటికే ఇసుక విధానాన్ని అమలు చేస్తాం టన్నుకు రూ. 400లే.. రవాణా చార్జీలు అదనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా, చవకగా ఇసుకను అందుబాటులోకి తెచ్చేలా నూతన ఇసుక పాలసీని తీసుకొస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇసుక మాఫియాకు కళ్లెం వేస్తామని... పారదర్శకత కోసం ఆన్లైన్ విధానం ద్వారా నేరుగా ఇంటికే ఇసుక డెలివరీ జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. మార్కెట్ ధరకన్నా 50 నుంచి 60 శాతం తక్కువ ధరకే ఇసుకను అందించడం, ఓవర్‌లోడ్ రవాణాను నివారించడం, ఇసుక ట్రాక్టర్లు, లారీల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ తదితర లక్ష్యాలతో ఈ పాలసీని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. శుక్రవారం హరీశ్‌రావు సచివాలయంలో ఇసుక పాలసీ అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ప్రజా అవసరాల దృష్ట్యా పట్టా భూముల్లో మరో రెండు నెలల పాటు ఇసుక తవ్వకాలకు అనుమతించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే సీజ్ చేసిన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలం వేయనుందని తెలిపారు. టన్ను ఇసుకను కేవలం రూ. 400లకే అందిస్తామని, దీనికి అదనంగా రవాణా చార్జీలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ. 1,400 వరకు ఉందని.. అదే కొత్త విధానంతో రూ. 900 నుంచి రూ. 1,100 లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రజలు సైతం నేరుగా వచ్చి ఇసుక కొనుగోలు చేసేలా స్టాక్‌యార్డ్‌లు, మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ అమ్మకాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, రాష్ట్ర విజిలెన్స్‌తో పాటు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా విజిలెన్స్‌ల ఏర్పాటు, కాల్‌సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణపైనా మంత్రి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన భూసేకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆన్లైన్లో ‘మిషన్’
మిషన్ కాకతీయపై ‘సాక్షి’ టీవీ ముఖాముఖిలో హరీశ్ నాణ్యతకు పెద్దపీట.. పర్యవేక్షణకు పది బృందాలు సమస్త సమాచారంతో త్వరలో వెబ్సైట్ ఫిర్యాదుల సేకరణకు కాల్ సెంటర్ చెరువుల కోసం అవసరమైతే పట్టా భూముల సేకరణ హైదరాబాద్‌లో ఈ ఏడాది 26 చెరువుల పునరుద్ధరణ చెరువులపై ‘సాక్షి’ లేఖలకు స్పందించాల్సిందిగాఅధికారులను ఆదేశించామన్న మంత్రి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తామని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. పనుల నాణ్యతను పరీక్షించేందుకు ‘ఇంజనీర్ ఇన్ చీఫ్’ నేతృత్వంలో నాణ్యత విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పారదర్శకత కోసం ‘మిషన్ కాకతీయ’కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆన్లైన్లో పొందురుస్తామన్నారు. ‘‘చెరువు అంచనా వ్యయం, కాంట్రాక్టరు, పూర్తయిన పని, చెల్లించిన బిల్లులు, పెండింగ్ పని తదితర సమాచారాన్ని క్రోడికరించి వెబ్‌సైట్‌ను రూపొందిస్తాం. ఈ వెబ్సైట్ ఆధారంగా మిషన్ పనులను పర్యవేక్షిస్తాం’’ అని తెలిపారు. మిషన్ కాకతీయపై శుక్రవారం రాత్రి సాక్షి టీవీ నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రజల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి కూడా పాల్గొన్నారు. దేవులపల్లి అమర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈఎన్సీ నేతృత్వంలో తనిఖీ బృందాలు నాణ్యత విభాగంలో పది బృందాలుంటాయని, చెరువుల పనులను అకస్మికంగా తనిఖీ చేసి నివేదికలిస్తాయని హరీశ్ చెప్పారు. తనిఖీ చేయాల్సిన చెరువు వివరాలను కేవలం ఒక రోజు ముందు మాత్రమే ఈ బృందాలకు ఈఎన్సీ తెలుపుతారన్నారు. ‘‘నాణ్యతపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు త్వరలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. రైతులు, బెస్త, రజకులతో చెరువుల కమిటీలు ఏర్పాటు చేస్తాం. నాణ్యత పరిరక్షణలో వీటిని భాగస్వాముల్ని చేస్తాం. పునరుద్ధరణ పనులు దక్కించుకోవడానికి 10 శాతం, అంతకు మించి తక్కువకు టెండర్ దాఖలు చేస్తే అంత మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద అదనంగా వసూలు చేస్తాం. పనులను మధ్యలో వదిలివెళ్లినా..నాణ్యత పాటించకపోయినా డిపాజిట్‌ను జప్తు చేసుకుంటాం. కాంట్రాక్టర్ స్థాయిని, సామర్థ్యాన్ని బట్టి చెరువుల పనులను అప్పగిస్తాం’’ అని వివరించారు. ‘చెరువులపై చర్చ’ శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో ప్రచురిస్తున్న ప్రజల లేఖలకు స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. చెరువుల నుంచి తొలగించే పూడిక మట్టికి వ్యవసాయ శాఖ ద్వారా నాణ్యత పరీక్షలు జరిపించిన తర్వాతే రైతుల పొలాలకు తరలిస్తామని హరీశ్ తెలిపారు. మట్టిని రైతులే సొంతంగా తరలించుకోవాల్సి ఉంటుందన్నారు. పూడిక మట్టిని పంట భూమిలో పరచడం ద్వారా ఎరువులు, పురుగుల మందు అవసరాలు తగ్గి పంట ఖర్చులు తగ్గుతాయన్నారు. నాణ్యత కోల్పోయిన మట్టిని ప్రభుత్వ ఖర్చుతోనే ఇతర అవసరాలకు తరలిస్తామన్నారు. ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. మినీ ట్యాంక్బండ్లుగా పట్టణ చెరువులు చెరువుల సామర్థ్యం పెంచేందుకు అవసరమైతే మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించి పట్టా భూములను సేకరిస్తామని హరీశ్ తెలిపారు. ‘‘కబ్జాకు గురైన శిఖం భూములను స్వాధీనం చేసుకుంటాం. వాటికి పరిహారం వర్తించదు. పట్టణ ప్రాంత చెరువు శిఖం భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు మాత్రం మరో చోట ఇంటిని నిర్మించి ఇస్తాం. పట్టణ, నగర ప్రాంత చెరువులను పునరుద్ధరించి మినీ ట్యాంక్బండ్లుగా తీర్చిదిద్దుతాం. వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్కుల నిర్మాణంతో పాటు బోటింగ్ వసతి కల్పిస్తాం. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది 26 చెరువులను పునరుద్ధరణకు నిర్ణయించాం. కబ్జాకు గురైన చెరువులను కాపాడటమే గాక మళ్లీ కబ్జాకు గురికాకుండా చూస్తాం. కొన్ని చెరువుల తాలూకు ధ్వంసమయ్యాయి, తారుమారు చేసిన పాత రికార్డులను సరిచేస్తాం. వీఆర్ఓ, తహశీల్దార్, వ్యవసాయ అధికారి కలిసి చెరువుల సరిహద్దులు నిర్ణయిస్తారు’’ అని చెప్పారు. అంతా ముందుకొస్తున్నారు చెరువుల మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ పథకం కింద రెండేళ్లలో రూ.2,500 కోట్లిచ్చేం దుకు కేంద్రం అంగీకరించిందని హరీశ్ చెప్పారు. ‘‘రూ.1,000 కోట్ల రుణానికి నాబార్డు సానుకూలత వ్యక్తం చేసింది. జైకా, ప్రపంచ బ్యాంకుల నుంచి మరో రూ.3,000 కోట్లు సమీకరిస్తాం. ఇలా రూ.10 వేల కోట్లు సమీకరించడంతో పాటు మరో రూ.10 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. రూ.20 వేల కోట్లతో నాలుగైదు ఏళ్లలో చెరువుల పునరుద్ధరణ పూర్తి చేస్తాం’‘ అన్నారు. చెరువులకు తమ కుటుంబసభ్యుల పేర్లు పెట్టి పునరుద్ధరణ పనులు జరిపేందుకు 35 మంది ముందుకొచ్చారని హరీశ్ చెప్పారు. క్రెడాయ్, ఫార్మా కంపెనీలతో పాటు దాదాపు 15 కార్పొరేట్ సంస్థలు చెరువులను సొంత నిధులతో అ భివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయన్నారు. విశేష స్పందన మిషన్ కాకతీయపై హరీశ్‌తో సాక్షి టీవీ నిర్వహించిన ముఖాముఖికి విశేష స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, ప్రముఖులు స్పందించా రు. మంత్రికి సలహాలు, సూచనలివ్వడంతో పాటు అభినందనలు తెలిపారు. హరీశ్ తండ్రి సత్యనారాయణరావు, కవు లు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, జయరాజ్‌తో పాటు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ తదితరులు ఫోన్ చేశారు. ప్రాణహిత-చెవెళ్లను పూర్తి చేసి భువనగిరి ప్రాంతానికి సాగునీరు ఇస్తామని కోమటిరెడ్డి ప్రశ్నకు బదులుగా హరీశ్ చెప్పారు. -
తేల్చాల్సింది మీరే..!
సయోధ్య కుదరనందున మీ జోక్యం తప్పనిసరి కృష్ణా బోర్డుకు తెలంగాణ మరో లేఖ సాక్షి,హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ తెలంగాణ సర్కారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరని దృష్ట్యా రబీ అవసరాలకు నీటి కేటాయింపులపై బోర్డే స్వయంగా కల్పించుకొని పరిష్కరించాలని కోరింది. రాష్ట్రంలో ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వ కింద పంటల సాగు మొదలైనందున లభ్యత కలిగిన నీటిలో అవసరమైన మేరకు నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని కోరింది. కృష్ణా నీటి లెక్కలపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసిన నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ ఉండాలన్న దానిపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చలు జరిపారు. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను ఎక్కడా ఉల్లంఘించకుండా, కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటున్నామని తెలుపుతూ బోర్డుకు, కేంద్ర జల వనరుల శాఖకూ లేఖ రాయాలని భావించారు. కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాసే విషయమై ముఖ్యమంత్రి కేరళ పర్యటన ముగించుకొని వచ్చాక నిర్ణయం తీసుకుందామని, బోర్డుకు వాస్తవ గణాంకాలతో లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు లేఖ సిద్ధం చేసి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. లేఖలో ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 101 టీఎంసీల నీటిలో ఏపీకి దక్కే వాటా ఏమీలేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ‘కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీల హక్కు కలిగి ఉన్నాయి. తుంగభద్ర ఎగువన, సాగర్ దిగువన ఉన్న కేటాయింపులు మినహాయిస్తే.. జూరాల మొదలు సాగర్ వరకు తెలంగాణ 200, ఏపీ 281 టీఎంసీల హక్కు కలిగిఉన్నాయి. వీటికి తోడు ప్రస్తుత ఏడాది సాగర్‌లోకి వచ్చిన 137 టీఎంసీలను కలుపుకుంటే మొత్తంగా 618 టీఎంసీలు అవుతుంది. ఇందులో 68 టీఎంసీలు ఆవిరి నష్టాల కింద లెక్కకడితే అందుబాటులో ఉన్న 550 టీఎంసీలను తెలంగాణ 229, ఏపీ 321 టీఎంసీల మేర వాడుకోవాలి. ఇప్పటికే ఏపీ 321 టీఎంసీలకు అదనంగా మరో 8 టీఎంసీలను వాడుకోవడంతో అది 329 టీఎంసీలు వాడుకున్నట్లవుతుంది. ఇప్పుడు మిగిలిన ఖరీఫ్ అవసరాలకు 41 టీఎంసీలు, మిగిలిన రబీ అవసరాలకు మరో 155 టీఎంసీలు కావాలని కోరుతోంది. ఇది అసమంజసం. కృష్ణా డెల్టా కింద సైతం 152.2 టీఎంసీల కేటాయింపులుంటే ఖరీఫ్‌లోనే 155 టీఎంసీలు వాడుకుంది. ఖరీఫ్‌కు అదనంగా డెల్టాకు మరో 26 టీఎంసీలు కోరుతోంది. వాటాకు మించి కోటాను వాడుకొని, లభ్యత ఉన్న 101 టీఎంసీల్లో వాటా కోరుతోంది. మానవతా దృక్పథంతో ఏపీ ఖరీఫ్ అవసరాలకు 30 టీఎంసీలను అప్పుగా ఇస్తామని, తర్వాతి సీజన్లో దాన్ని సర్దుబాటు చేసుకుందామని ప్రతిపాదించినా ఏపీ అంగీకరించడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కష్టంగా మారినందున వివాదానికి తెరదించేందుకు మీ జోక్యం తప్పనిసరి’ అని లేఖలో తెలంగాణ పేర్కొన్నట్లుగా తెలిసింది. -
ఇక వేగంగా ‘మిషన్ కాకతీయ’ పనులు
279 చెరువుల పనులకు రూ.123కోట్ల పరిపాలనా అనుమతులు రెండు మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం ఈనెల రెండో వారంలో పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు కసరత్తును వేగిరం చేసింది. జనవరి రెండో వారానికి కనీసం 50 శాతం పనులను ఆరంభించాలని దృఢ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం 279 చెరువుల పునరుద్ధరణ పనులకోసం రూ.123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూ రుచేసింది. శుక్రవారం నుంచి వరుసగా ఎలాంటి అభ్యంతరాలు లేని చెరువులన్నింటికీ పరిపాలనా అనుమతులు ఇచ్చే దిశగా ఆర్థిక శాఖ సైతం సన్నాహాలు చేస్తోంది. మిషన్ కాకతీయలో భాగంగా తొలి దశలో పనులు చేపట్టనున్న 9వేల చెరువుల్లో సర్వే, అంచనాల తయారీ, పరిశీలన పూర్తి చేసుకున్న సుమారు 600 చెరువులకు రూ.230 కోట్ల అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ 15 రోజుల కిందటే ఆర్థిక శాఖకు పంపిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలను చూపుతూ చెరువుల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంలో ఆర్థిక శాఖ అలసత్వం ప్రదర్శించడంతో స్వయంగా మంత్రి టి.హరీశ్‌రావు కల్పించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ రూ.123.06 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మరమ్మతు పనులకు అనుమతులు లభించిన చెరువులన్నింటికీ 48 గంటల్లో టెండర్లు పిలవాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియను ముగించి జనవరి రెండో వారానికి పనులు ప్రారంభిస్తామని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి దశలో గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో రూ.500కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు అవుతాయని, అనంతరమే మిగతా పనులను చేపడతారని ఆ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రి ఉమాభారతికి ఆహ్వానం! జనవరి రెండోవారంలో చెరువుల పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఉమాభారతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నెల 4 లేదా 5న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన ఉమాభారతిని కలుస్తారని సమాచారం. -
అమాత్యా..ఆలకించు!
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు రైతులను కరువు వెంటాడుతోంది. కాలం కని కరించక పంట దిగుబడులు తగ్గి.. గిట్టుబాటు ధరలు లేక రైతన్న మరింత కుంగి పోతున్నారు. చేతికందిన పంటకు అమ్ముకునేందుకు మార్కెట్‌యార్డుల్లో కమీషన్ ఏజెంట్లు, దళారులను ఆశ్రయిం చి నిలువునా మోసపోతున్నారు. అప్పులబాధ నుంచి గట్టెక్కించే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గు రువారం జిల్లాకు భారీనీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావు రానున్నారు. తమ సమస్యలు తీరుతాయని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలను విరివిగా పండిస్తారు. ఈ ఏడాది పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో గిట్టుబాటు ధర కచ్చితంగా కల్పించాలనే సంకల్పం తో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 18 మార్కెట్‌యార్డులు ఉండగా, 76 ఐకేపీ, 30 పీఏసీఎస్ , ఐదు హాకా కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు 1,06,906 క్విం టాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. అదే ప్రైవేట్ వ్యాపారులు మాత్రం 3,23,763 క్వింటాళ్లను కొన్నారు. ఫలి తంగా కొన్నిచోట్ల వరికి మద్దతు ధర కూడా దక్కడం లేదు. మొక్కజొన్నకు సంబంధించి జిల్లాలో 17చోట్ల మార్క్‌ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి అంతంత మాత్రమే మొ క్కజొన్న పండినా.. మార్క్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోయారు. గతేడాది జిల్లాలో కేవలం ఐదు మార్క్‌ఫెడ్ కేంద్రాల ద్వారా 5.76 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. కానీ ఏ ఏడాది 17 కేం ద్రాలు ఏర్పాటుచేసినా 4.8లక్షల క్వింటా ళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. గోనే సంచుల కొరత జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొలుగో లు కేంద్రాల్లో చాలా చోట్ల గోనె సంచుల కొరత వేధిస్తోంది. మరికొన్ని చోట్ల ధా న్యం విషయంలో తేమశాతం సరిగా లేదనడం, కొనుగోళ్లు జరపాలంటే బ్యాంక్‌ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్ తదితర కొర్రీలు విధించడంతో పాటు డబ్బులు 15రోజుల తర్వాత ఆన్లైన్ చెల్లింపులు రైతులకు కాస్త ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురాలేక చాలా మంది రైతులు దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. భారీగా జీరోదందా రైస్‌మిల్లర్ల యజమానులుగ్రామాల్లో నేరు గా కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి కల్లాల నుంచే కొనుగోలు జరిపి అక్కడి నుంచి నేరుగా మిల్లులకు రవాణా చేస్తున్నారు. మార్కెట్‌యార్డులకు పన్నులు ఎగ్గొట్టడంతో పాటు రైతుల నుంచి జరిపే కొనుగోళ్లకు సంబంధించి తూకంలో మోసం చేస్తున్నారు. వీటి ని అరికట్టడం కోసం ప్రభుత్వం మార్కెటింగ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ అవన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారాయి. జిల్లాలో 18 మార్కెట్‌యార్డుల పరిధిలో 22 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా.. అవన్ని కూడా ప్రైవేట్ వ్యాపారులకు చుట్టాలుగా మారాయి. -
చట్టసభల్లో పోరాడతాం
గవర్నర్‌కు అధికారాలపై హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శాంతిభద్రతలపై గవర్నరుకు అధికారాలను అప్పగించడంపై చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తామని రాష్ట్ర సాగునీటి శాఖామంత్రి టి.హరీశ్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నరుకు శాంతిభద్రతల అధికారాలు అప్పగించటం ద్వారా తెలంగాణపై ఆధిపత్యాన్ని కొనసాగించే కుట్రకు ఏపీ సీఎం చంద్రబాబు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రెండు రాష్ట్రాలు ఏర్పాటైతే పదేళ్లు కాదు, పది రోజులు కూడా ఉండమంటూనే హైదరాబాద్‌ను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. హైదరాబాద్‌లో ఎన్నో దేశాల ప్రజలు నివాసం ఉంటున్నారని, ఎవరికీ లేని భయాందోళనలు ఒక్క ఆంధ్రోళ్లకు ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు దాటినా ఒక్క సీమాంధ్రునిపై అయినా దాడి జరిగిందా అని అడిగారు. గవర్నరుకు అధికారాలు కోరడం అక్రమ కార్యకలాపాలను కొనసాగించడానికా అని హరీశ్‌రావు అనుమానాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో బారికేడ్లు పెడితే భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నట్టుగా ఎందుకంటూ చంద్రబాబు గగ్గోలు పెట్టి ఇప్పుడేమో ఆంధ్రా పోలీసులను హైదరాబాద్‌లో పెడ్తారా అని ప్రశ్నించారు. బారికేడ్లను వారు ఒప్పుకోకుంటే ఆంధ్రా పోలీసులు బందూకులు పట్టుకుని తిరుగుతామంటే ఎలా ఒప్పుకుంటామన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు లేని షరతులు, విధానాలు ఒక్క తెలంగాణకే అమలు చేయటంపై టీటీడీపీ, టీబీజేపీ నాయకుల వైఖరిని ప్రశ్నించారు. అక్రమార్కులను రక్షించడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొడ్తామని హరీశ్‌రావు ప్రకటించారు. -
ద్రోహాలపై చర్చిద్దామా?
కాంగ్రెస్ నేతలకు హరీశ్‌రావు సవాల్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమేనా అని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీశ్‌రావు సవాల్ చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తామడిగే పది ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత నిందలకు కాంగ్రెస్ నాయకులు దిగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల పదవీ వ్యామోహం వల్ల, చేతకానితనం వల్ల జరిగిన అన్యాయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని హరీశ్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌వారు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నప్పుడు నోరు మెదపకుండా సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన అప్పటి మంత్రి, ఇప్పటి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు సహించరని చెప్పారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అప్పటి సీఎం కిరణ్ అంటే చప్పట్లు చరిచిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలదన్నారు. ఇలాంటి ద్రోహాలు చేసినందుకే కాంగ్రెస్‌తో పొత్తు వద్దనుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ఆయన సంధించిన ప్రశ్నలు... ఉద్యోగులకు ఆప్షన్లుండాలని కాంగ్రెస్ నేతలంటున్నరు. అంటే తెలంగాణ రాష్ట్రంలోనూ సీమాంధ్ర ఉద్యోగులను కొనసాగించి తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడ్త్తరా? డిజైను మార్చకుండా పోలవరం నిర్మించడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తారా? తెలంగాణ సచివాలయంలో 90 శాతం సీమాంధ్ర ఉద్యోగులు తిష్టవేసి ఉండాల్సిందేనా? భద్రాచలంలోని ఏడు మండలాలు తెలంగాణకే రావాలని అంటున్నం. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు? పెన్షన్ల చెల్లింపులు, ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరపాలి. మీరు వద్దంటారా? తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకరాష్ట్ర హోదాకోసం కేంద్ర ప్రభుత్వపు మెడలు వంచుతాం. కాంగ్రెస్ నేతలు ఏమంటారు? ఉన్నత విద్యాసంస్థల్లో ఉమ్మడి అడ్మిషన్లు వద్దని మేం అంటున్నాం. కాంగ్రెస్ నేతలు వద్దంటారా? 41 ఏళ్లపాటు కాంగ్రెస్ పాలనవల్లనే తెలంగాణ వెనుకబడింది. అదే పాలన గొప్పతనం చూసి మళ్లా ఓట్లేయమంటారా? మీ పాలనపై ఈ ఎన్నికలు రెఫరెండం అని ప్రకటించే ధైర్యం ఉందా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికే ఓటేయాలనే నినాదంతో జనంలోకి వెళ్లగలరా? కేసీఆర్ 13 ఏళ్ల ఉద్యమాన్ని చూసి ఓటేయాలని అడుగుతాం. ఈ పదేళ్ల పాలనను చూపి ఓటు అడిగే ధైర్యం ఉందా? -
ఆరున జోరు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో సెప్టెంబరు 6న టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అధ్యర్యంలో ఢిల్లీలో గురువారం జరిగిన జిల్లా పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు టి.హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, కె.తారకరామారావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ జిల్లా ఇన్చార్జి బి.వినోద్‌కుమార్, పొలిట్‌బ్యూరో సభ్యుడు నారదాసు లక్ష్మణ్‌రావు, నియోజకవర్గ ఇన్చార్జీలు దాసరి మనోహర్‌రెడ్డి, ఒడితల సతీష్‌బాబు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత పారీపరంగా నిర్వహిస్తున్న మొదటి పెద్ద కార్యక్రమం ఇదే కావడంతో భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలను కేసీఆర్ ఆదేశించారు. జనసమీకరణ బాధ్యలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. హుస్నాబాద్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, చొప్పదండికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎ.రవీందర్‌రెడ్డి, మానకొండూరుకు పరకాల ఎమ్మెల్యే ఎం.భిక్షపతి, మంథనికి మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, పెద్దపల్లికి చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కోరుట్లకు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, సిరిసిల్లకు మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, హుజూరాబాద్‌కు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వేములవాడకు టి.రవీందర్రావు, రామగుండంకు పురాణం సతీష్, జగిత్యాలకు శ్రీహరిరావు, ధర్మపురికి నాగుర్ల వెంకటేశ్వరరావులకు కూడా బాధ్యతలు ఇచ్చారు. పౌరసత్వం కేసులో ఎన్నిక చెల్లదని ఇటీవలే హైకోర్టు స్పష్టం చేసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఈ భేటీకి హాజరుకాలేదు. ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి అప్పగించారనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు వెల్లడించలేదు. అచ్చొచ్చిన సెంటిమెంట్.. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత తొలి బహిరంగసభ ఎస్సారార్ కాలేజీ మైదానంలోనే నిర్వహించారు. ఈ సభతోనే టీఆర్ఎస్కు ప్రజల్లో బాగా స్పందన వచ్చింది. దీంతో ఆ తర్వాత పార్టీ పరంగా చేపట్టిన దాదాపు అన్ని కార్యక్రమాలను కేసీఆర్ జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. 2009 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావడానికి కారణమైన నిరహారదీక్ష వేదిక సిద్ధిపేట అయినా... కేసీఆర్ కరీంనగర్ నుంచే అక్కడికి బయలుదేరారు. మార్గమధ్యంలో అల్గునూర్ వద్ద కేసీఆర్ అరెస్టు కావడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. మరోసారి తెలంగాణ ప్రకటన రావడానికి అనివార్య పరిస్థితులను కల్పించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పాత్ర ఏమిటనేది చెప్పేందుకు కేసీఆర్ బాగా అచ్చివచ్చిన ఎస్సారార్ కాలేజీ మైదానాన్నే వేదికగా చేసుకోవడం విశేషం. రేపు భేటీ... టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహణ విజయవంతం కోసం శనివారం జిల్లా స్థాయి పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తెలిపారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, అన్ని స్థాయిల ముఖ్యనేతలను ఈ భేటీకి ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్కు అన్ని సందర్భాల్లో కరీంనగర్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని, బహిరంగసభ ద్వారా వీరికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతారని చెప్పారు. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు... రాష్ట్ర ఏర్పాటు కోసం 13 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేసిన టీఆర్ఎస్కు ఉన్న తేడాను ఈ బహిరంగసభలో వివరిస్తామని శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలను ఆహ్వానిస్తున్నట్లు శంకర్‌రెడ్డి పేర్కొన్నారు.