తెలంగాణకు వచ్చి ఏం చెబుతావ్? | TRS cebutav happened? | Sakshi
Sakshi News home page

తెలంగాణకు వచ్చి ఏం చెబుతావ్?

Published Sat, Feb 7 2015 1:24 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

TRS cebutav happened?

  • చంద్రబాబుపై హరీశ్ మండిపాటు
  • సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్‌కు వచ్చి ఏం చెప్తావ్? తెలంగాణ రాకుండా అడ్డుకున్నాను. కరెంట్ రాకుండా కుట్రలు చేశాను. పోలవరం విషయంలో ద్రోహం చేశాను. హైదరాబాద్‌లో ఉంటే పరాయి దేశంలో ఉన్నట్లుందని చెబుతావా?’ అని ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో చంద్రబాబు చేయనున్న పర్యటనపై శుక్రవారం సచివాలయంలో మంత్రి ఈ విధంగా స్పందించారు. తెలంగాణలో బాబు పర్యటనను తాము వ్యతిరేకించడం లేదని, అయితే పర్యటనకు కారణాలు చెప్పి రావాలన్నారు.
     
    సాగునీటి, మైనింగ్  ఉద్యోగుల విరాళం

    మిషన్ కాకతీయకు నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావుకు ఇరిగేషన్ ఉద్యోగుల తర పున టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దే వీప్రసాద్ మీడియా సమక్షంలో తెలియజేశారు. శుక్రవారం సచివాలయంలో నీటి పారుదల శాఖ ఉద్యోగుల డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మానికి మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే బాబూమోహన్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డిలతో పాటు నీటి పారుదల శాఖ ఉద్యోగుల సంఘం నేతలు జగదీశ్వర్, నరేందర్ తదితరులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా దేవి ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణలో మిషన్ కాకతీయకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. ఇదే సమావేశానికి హాజరైన మైనింగ్ శాఖ ఉద్యోగుల సంఘం నేతలు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మిడిదొడ్డి వెంకటయ్య రూపొందించిన మన ఊరు-మన చెరువు స్ఫూర్తి గీతాల పాటల సీడీని మంత్రి ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement