అమాత్యా..ఆలకించు! | farmers in drought haunts | Sakshi
Sakshi News home page

అమాత్యా..ఆలకించు!

Published Thu, Dec 4 2014 1:01 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

farmers in drought haunts

సాక్షి, మహబూబ్‌నగర్:  పాలమూరు రైతులను కరువు వెంటాడుతోంది. కాలం కని కరించక పంట దిగుబడులు తగ్గి.. గిట్టుబాటు ధరలు లేక రైతన్న మరింత కుంగి పోతున్నారు. చేతికందిన పంటకు అమ్ముకునేందుకు మార్కెట్‌యార్డుల్లో కమీషన్ ఏజెంట్లు, దళారులను ఆశ్రయిం చి నిలువునా మోసపోతున్నారు. అప్పులబాధ నుంచి గట్టెక్కించే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గు రువారం జిల్లాకు భారీనీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీష్‌రావు రానున్నారు. తమ సమస్యలు తీరుతాయని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలను విరివిగా పండిస్తారు.
 
  ఈ ఏడాది పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో గిట్టుబాటు ధర కచ్చితంగా కల్పించాలనే సంకల్పం తో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 18 మార్కెట్‌యార్డులు ఉండగా, 76 ఐకేపీ, 30 పీఏసీఎస్ , ఐదు హాకా కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు 1,06,906 క్విం టాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. అదే ప్రైవేట్ వ్యాపారులు మాత్రం 3,23,763 క్వింటాళ్లను కొన్నారు. ఫలి తంగా కొన్నిచోట్ల వరికి మద్దతు ధర కూడా దక్కడం లేదు.
 
 మొక్కజొన్నకు సంబంధించి జిల్లాలో 17చోట్ల మార్క్‌ఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి అంతంత మాత్రమే మొ క్కజొన్న పండినా.. మార్క్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోయారు. గతేడాది జిల్లాలో కేవలం ఐదు మార్క్‌ఫెడ్ కేంద్రాల ద్వారా 5.76 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. కానీ ఏ ఏడాది 17 కేం ద్రాలు ఏర్పాటుచేసినా 4.8లక్షల క్వింటా ళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు.
 
 గోనే సంచుల కొరత
 జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొలుగో లు కేంద్రాల్లో చాలా చోట్ల గోనె సంచుల కొరత వేధిస్తోంది. మరికొన్ని చోట్ల ధా న్యం విషయంలో తేమశాతం సరిగా లేదనడం, కొనుగోళ్లు జరపాలంటే బ్యాంక్‌ఖాతా నెంబర్, ఆధార్ నెంబర్ తదితర కొర్రీలు విధించడంతో పాటు డబ్బులు 15రోజుల తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు రైతులకు కాస్త ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురాలేక చాలా మంది రైతులు దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.  
 
 భారీగా జీరోదందా
 రైస్‌మిల్లర్ల యజమానులుగ్రామాల్లో నేరు గా కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి కల్లాల నుంచే కొనుగోలు జరిపి అక్కడి నుంచి నేరుగా మిల్లులకు రవాణా చేస్తున్నారు. మార్కెట్‌యార్డులకు పన్నులు ఎగ్గొట్టడంతో పాటు రైతుల నుంచి జరిపే కొనుగోళ్లకు సంబంధించి తూకంలో మోసం చేస్తున్నారు. వీటి ని అరికట్టడం కోసం ప్రభుత్వం మార్కెటింగ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ అవన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారాయి. జిల్లాలో 18 మార్కెట్‌యార్డుల పరిధిలో 22 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా.. అవన్ని కూడా ప్రైవేట్ వ్యాపారులకు చుట్టాలుగా మారాయి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement