సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ పాలక మండళ్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు కూడా ఉంటాయని సమాచారం.
టీఆర్‌ఎస్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే పాలక మండళ్లపై కన్నేసిన నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ యార్డులకు గాను ప్రస్తుతం 13యార్డులకు మాత్రమే మార్కెట్ కమిటీలున్నాయి. బాదేపల్లి, మదనాపూర్, అలంపూర్, వనపర్తి, కోస్గి మార్కెట్ యార్డులకు ప్రస్తుతం పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వర్తిసున్నాయి. నాగర్‌కర్నూలు, నవాబుపేట మార్కెట్ కమిటీల పదవీ కాలం కొద్ది నెలల్లో ముగియనుందిమార్కెట్ కమిటీలనురద్దు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో మరో రెండేళ్లకు పైగా కాల పరిమితి ఉన్నా చాలామార్కెట్ యార్డుల్లో పా లక మండళ్ల పాలనకు తెరపడనుంది.
అచ్చంపేట మా ర్కెట్ కమిటీ కాల పరిమితి 2015లో.. మహబూబ్‌నగ ర్, గద్వాల, కల్వకుర్తి,నారాయణపేట, ఆత్మకూరు, మక్త ల్, అమన్‌గల్, దేవరకద్ర పాలకమండళ్ల పదవీ కాల పరిమితి 2016లో ముగియనుంది. షాద్‌నగర్, కొల్లాపూర్ మార్కెట్ యార్డుల కాల పరిమితి మా త్రం 2017 దాకా ఉంది. అయితే ప్రస్తుతం ఏపీ మార్కెటింగ్ శాఖ ని బంధనల మేరకు పాలక మండళ్ల కాల పరిమితి మూడే ళ్లు. కొత్త మార్గదర్శకాలతో త్వరలో వెలువడే తెలంగాణ మార్కెటింగ్ శాఖ ఆర్డినెన్స్‌లో పాలక మండళ్ల కాల ప రిమితిని రెండేళ్లకు కుదించినట్లు సమాచారం. గతంలో పాలక మండలిలో 18 మంది సభ్యుల కు గాను వ్యాపారుల నుంచి కనీసం ఆరుగురికి ప్రాతినిథ్యం కల్పించే వారు. కొత్త చట్టంలో స భ్యుల సంఖ్య 14కు కుదించడంతో పాటు వ్యాపారులకు ప్రాతినిథ్యం తగ్గించి రైతుల సంఖ్యను పెంచేలా నిబంధనలు రూపొందించారు.
దేవాలయాల కమిటీలు కూడా!
జిల్లాలో మూడు వేలకు పైగా దేవాలయాలున్నప్పటికీ ఎనిమిది ప్రధాన ఆలయాలకు మాత్రమే పాలక మండళ్లున్నాయి. మన్యం కొండ, అలంపూర్ వంటి ప్రధాన ఆ లయాలకు ఇటీవలే నూతన పాలక మండళ్లు ఏర్పాట య్యాయి. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో దేవాలయ పాలక మండళ్లు కూడా రద్దు కానున్నాయి. ప్రస్తు తం ఆలయ కమిటీల కాల పరిమితి రెండేళ్లు కాగా, నూ తన చట్టంలో యేడాదికి పరిమితం చేసినట్లు సమాచా రం. నూతన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పా టు చేసిన నాటి నుంచే మార్కెట్, దేవాలయ కమిటీల్లో సా ్థనం కోసం ద్వితీయ శ్రేణి నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో తమ నేపథ్యాన్ని, రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం తదితరాలతో కూడిన ప్రొఫైల్ తయారు చేసుకుని కీలక నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మార్కెట్ యార్డు లు, దేవాలయాలకు త్వరలో పాలక మండళ్ల ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీ కానుందనే వార్తల నేపథ్యంలో ఆశావహు లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు త మ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యేలు కూడా సొంత జాబితాలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. రాజకీయంగా తమకు పోటీ లేకుండా, అత్యం త సన్నిహితులకు మాత్రమే పదవులు కట్టబెట్టాలనే యోచనలో శాసనసభ్యుల్లో కనిపిస్తోంది.
నామినేటెడ్ జాతర
Published Mon, Jul 21 2014 3:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement