
రేవంత్ ఓ జోకర్, బ్రోకర్
ఆదిలాబాద్ : టీటీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్రెడ్డిపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న నిప్పులు చెరిగారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో జోగు రామన్న మాట్లాడుతూ... రేవంత్రెడ్డి ఓ జోకర్, బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. రైతుల ధర్నా పేరిట టీటీడీపీ నిర్వహించిన ధర్నాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆరోపించారు.
రేవంత్రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. రేవంత్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు జోగు రామన్న వివరించారు.