పొన్నాల వద్ద భూమి... నిబంధనలకు విరుద్ధం | Minister Harish rao fire on Ponnala lakshmaiah in assembly | Sakshi
Sakshi News home page

పొన్నాల వద్ద భూమి... నిబంధనలకు విరుద్ధం

Published Wed, Nov 26 2014 1:23 PM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

పొన్నాల వద్ద భూమి... నిబంధనలకు విరుద్ధం

పొన్నాల వద్ద భూమి... నిబంధనలకు విరుద్ధం

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య  గత ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని... ఆ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పలేదని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు ఆరోపించారు. ఆ భూముల్లో ఫౌల్ట్రీ ఫామ్ను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో పొన్నాల లక్ష్మయ్య భూములపై హరీష్రావు చర్చించారు. తక్కువ ధరకు విక్రయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పకుంటే తమకు అప్పగించాలని 2013లోల ఏపీఐఐసీ వెల్లడించిందని గుర్తు చేశారు. కానీ పొన్నాల మాత్రం ఆ భూములు అప్పగించలేదని విమర్శించారు.

నిబంధనలకు విరుద్ధంగా  పొన్నాల వద్ద 8.3 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 2005లో మార్కెట్ ధర కంటే పొన్నాలకు తక్కువ ధరకే సదరు భూమిని ప్రభుత్వం విక్రయించిందని తెలిపారు. ఎకరాకు రూ. 25,500లకే కేటాయించారని హరీష్రావు తెలిపారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేయడం కానీ.. విక్రయిచండ కాని చేయకుడదని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement