
'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి'
హైదరాబాద్: మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. యూఎస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆదివారం డల్లాస్లో నిర్వహించిన ఐటీ సర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ కంపెనీ ప్రతినిధులు, ఎన్నారైలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై కేటీఆర్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
తెలంగాణలో కంపెనీలు పెడితే ప్రభుత్వపరంగా అన్నివిధాల సహకారం అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా ఎన్నారైలకు హామీ ఇచ్చారు. కేటీఆర్ రెండు వారాల అమెరికా పర్యటనలో మే 5వ తేదీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన మే 16వ తేదీన భారత్ తిరిగి ప్రయాణం అవుతారు.