నా మాటలు కొన్ని పత్రికలు వక్రీకరించాయి: పోచారం | Some papers misquote my comments on farmers suicide, says Pocharam Srinivas Reddy | Sakshi
Sakshi News home page

నా మాటలు కొన్ని పత్రికలు వక్రీకరించాయి: పోచారం

Published Sat, Nov 8 2014 1:30 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

నా మాటలు కొన్ని పత్రికలు వక్రీకరించాయి: పోచారం - Sakshi

నా మాటలు కొన్ని పత్రికలు వక్రీకరించాయి: పోచారం

నిజామాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు వాస్తవమేనని తాను చెప్పిన వాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్లో మాట్లాడుతూ... ఈ వ్యవహరంలో కొన్ని పత్రికల తీరును ఆయన ఖండించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, తాను రైతు బిడ్డలమేనని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రంలో రైతుల రుణమాఫీనే చేయలేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement