బాబును విమర్శించడం కేసీఆర్కు తగదు: పరిటాల సునీత | Paritala Sunitha Checking Rythu bazar in anantapur district | Sakshi
Sakshi News home page

బాబును విమర్శించడం కేసీఆర్కు తగదు: పరిటాల సునీత

Published Sun, Oct 26 2014 9:53 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

బాబును విమర్శించడం కేసీఆర్కు తగదు: పరిటాల సునీత - Sakshi

బాబును విమర్శించడం కేసీఆర్కు తగదు: పరిటాల సునీత

అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించడంపై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆదివారం స్పందించారు. చంద్రబాబును విమర్శించడం కేసీఆర్కు తగదని అన్నారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అనంతపురం నగరంలోని రైతు బజార్లో పరిటాల సునీత అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజార్ నిర్వహణ తీరుపై సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతు బజార్లో రైతుల భాగస్వామ్యం పెంచాలని సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని కేసీఆర్ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబును కోర్టుకీడుస్తానంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించాలని విలేకర్లు కోరగా సునీతపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement