'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి' | Venkaiah naidu advice to ap cm and telangana cm | Sakshi
Sakshi News home page

'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి'

Published Sat, Jun 20 2015 11:56 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి' - Sakshi

'వివాదాలు వదిలి... అభివృద్ధిపై దృష్టి పెట్టండి'

నెల్లూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిలో పోటీ పడాలే కాని వివాదాల మధ్య కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం నెల్లూరులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలను చట్టాలకు వదిలిపెట్టాలని వారికి హితవు పలికారు. అలాగే రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఇద్దరు సీఎంలకు హితవు పలికారు.

కొందరు మంత్రులు సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని వెంకయ్య పరోక్షంగా ఏపీ కేబినెట్ మంత్రుల గురించి పరోక్షంగా విమర్శించారు. రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనవసర వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు వెంకయ్య సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement