
స్టేట్ ఫైట్ మాత్రమే..స్ట్రీట్ ఫైట్ కాదు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం స్టేట్ ఉద్యమమని, స్ట్రీట్ ఫైట్ కాదని తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ...దళితులకు, మైనార్టీలకు అందిస్తున్న కల్యాణలక్ష్మీ పథకాన్ని త్వరలోనే బీసీ సామాజిక వర్గాలకు కూడా వర్తింపు చేస్తామన్నారు.
నగర ప్రజలు అన్ని పార్టీలకు మేయర్ అవకాశం కల్పించారని.... కానీ, నగర అభివృద్ధికి ఏ పార్టీ చిత్తశుద్ధితో పని చేయలేదని ఆయన అన్నారు. తమకు అవకాశమిస్తే హైదరాబాద్ను అభివృద్ధి చేసి చూపిస్తామని కేటీఆర్ తెలిపారు.