
అధికారులపై నిప్పులు చెరిగిన హరీష్
హైదరాబాద్: మిషన్ కాకతీయ తొలి దశ వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చెరువుల పునరుద్దరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్బంగా హరీష్రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణలో పారదర్శకంగా నిధులను వినియోగిస్తామని చెప్పారు.
మిషన్ కాకతీయలో రెవిన్యూ సిబ్బంది భాగస్వామ్యం కావాలి, చెరువులు కబ్జా కాకుండా చూడాలని తెలిపారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ ఇరిగేషన్ అధికారులు వ్యవహారంపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. పద్దతి మార్చుకోవాలంటూ అధికారులను హెచ్చిరంచారు. కుత్బుల్లాపూర్లో కబ్జాకు గురైన చెరువుల్లో నిర్మాణాలు తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఈటెల, మహేందర్రెడ్డిలు హాజరయ్యారు.