వైద్య ఆరోగ్యశాఖలో మార్పులకు కమిటీ | Committee on changes in medical and health department, says c lakshma reddy | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్యశాఖలో మార్పులకు కమిటీ

Published Sun, Oct 4 2015 1:34 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Committee on changes in medical and health department, says c lakshma reddy

మహబూబ్నగర్ : తన శాఖలో సమూల మార్పులకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అందులోభాగంగా బొమ్రాజ్పేట బ్రిడ్జి తోపాటు కొడంగల్, కోస్గిలో 100 పడకల ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా పరిగిలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే 60 నెల్లో రైతుల ఆత్మహత్యలు లేకుండా చూస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement